LPC
-
ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ? -
ఎల్పీసీ ఇవ్వలేదని వీఆర్వో..
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఎల్పీసీ(లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వలేదనే మనస్తాపంతో వీఆర్ఓ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలప్‌చెడ్ మండలం చండూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చండూర్ గ్రామానికి చెందిన గొట్టం వెంకటేశం(48) వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం చిలప్‌చెడ్ మండలం నుంచి నర్సాపూర్ బదిలిపై వెళ్లి, ఆ తర్వాత నర్సాపూర్ మండలం బ్రహ్మణపల్లి, తుజాల్పూర్ గ్రామాలకు వీఆర్వోగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతని పనితీరు నచ్చడం లేదని, అధికారులు కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. అక్కడ 4 నెలలు విధులు నిర్వహించిన అనంతరం నెల క్రితం చేగుంట మండలానికి బదిలీ పై వెళ్లాడు. కాగా ఇన్ని చోట్లకు వెళ్లినా నర్సాపూర్ నుంచి వెళ్లిన అతనికి నర్సాపూర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు లాస్ట్ పే సరి్టఫికేట్(ఎల్పీసీ) ఇవ్వకపోవడంతో 8 నెలలుగా అతడికి జీతం రాలేదు. జీతం రాకపోవడంతో తరుచూ భార్యతో బాధపడుతూ ఉండేవాడని, వెంకటేశం ఎల్పీసీ కోసం నర్సాపూర్ కార్యాలయం చుట్టూ తిరగగా ఒకసారి వెంకటేశం కుమారుడు రంజిత్ కుమార్‌ను పంపిస్తే ఎల్పీసీ ఇస్తామన్నారని, రంజిత్ వెళ్లినా ఎల్పీసీ ఇవ్వలేదన్నారు. సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో అతని భార్య సువర్ణ రాఖీలు కట్టేందుకు కుమారుడు రంజిత్‌తో కలసి అమ్మగారి గ్రామం కుసంగి వెళ్లి, మంగళవారం 11:30 గంటలకు చండూర్ గ్రామానికి రాగా వెంకటేశం ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. -
వేతన జీవుల అవస్థలు
ఎస్ఎస్ఏ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులకు 'ఎల్పీసీ' అడ్డంకి ఐదు నెలలుగా జీతాలకు బ్రేక్ అనంతపురం ఎడ్యుకేషన్ : నెల రోజులు పనిచేసి ఒకటో తేదీన జీతం కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ డిప్యూటేషన్‌పై సర్వశిక్ష అభియాన్‌లో పనిచేసి తిరిగి మాతృశాఖ, ఇతర శాఖలకు వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఐదు నెలలుగా జీతాలందక అవస్థలు పడుతున్నారు. జీతాలు ఎందుకు ఆపారో తెలియక, 'ఎల్పీసీ' (లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఇలా.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా డిప్యూటేషన్‌లో పని చేస్తూ మరోశాఖకు బదిలీ అయితే అతనికి సంబంధించి 15 రోజుల్లో ఎల్పీసీ ఇవ్వాలి. నెల జీతం బ్రేక్ పడకుండా చూడాలి. పని చేస్తున్న చోటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెండింగ్ ఉన్నా...ఎల్‌పీసీకి కొర్రీ వేయరాదు. బదిలీపై వెళ్లిన శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి వాటిని రాబట్టుకోవాలి. తప్ప పెండింగ్ పెట్టరాదు. ఎస్ఎస్ఏలో జరిగిందిలా... డీఈగా పని చేసిన బాలాజీనాయక్ జూలై మొదటివారంలో, ఇన్చార్జ్ ఈఈగా పని చేసిన వెంకటస్వామి అదేనెల చివరివారంలో బదిలీపై వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన సూర్యనారాయణరెడ్డి మేలో, ఇక్బాల్ జూన్‌లో, ఎఫ్ఏఓ పార్వతి, అలెస్కోగా పని చేసిన వెంకటరమణనాయక్ అక్టోబర్‌లో ఇక్కడి ఎస్ఎస్ఏ నుంచి ఇతర శాఖలకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు ఎల్పీసీల కోసం తిరుగుతున్నా..పట్టించుకునే నాథుడే లేరు. డబ్బు లేక అల్లాడుతున్నానంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. కాగా వీరిలో ఎఫ్ఏఓ పార్వతి, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, అలెస్కో వెంకటరమణనాయక్‌కు ఇటీవల ఎల్పీసీ ఇచ్చారు. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే... – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ ఆర్థికపరమైన వ్యవహారాల వల్ల ఎల్పీసీలు ఇవ్వడం కొద్దిగా ఆలస్యమవుతోంది. కోట్లాది రూపాయలు చేసిన పనులు, అడ్వాన్స్‌లకు లెక్కలు చెప్పకుండా, వివరాలు ఇవ్వకుండా వెళ్తే రేప్పొద్దున ఆడిట్ ఇబ్బందులు వస్తాయి. వాటిని క్లియర్ చేయాలని అందరికీ సూచించాం. కొందరు ఉద్యోగులు ఖాళీ చెక్కులు ఇష్యూ చేశారు, ఓ ఉద్యోగి కీలకమైన ఫైళ్లు గల్లంతు చేశారు. వీటన్నంటినీ క్లియర్ చేయాలని చెప్పాం. క్లియర్ చేసిన కొందరికి ఎల్పీసీలు ఇచ్చేశాం. తక్కిన వారికి కూడా సిద్ధం చేస్తున్నాం.