IAF officer
-
CCTV: నిను వీడని నీడను నేనే..!
బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు. ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.The #DRDO pilot who had alleged that he was assaulted by a motorist on Monday has now been booked for attempted murder of that same motorist, #Bengaluru police sources said. Investigations have revealed that the #wingcommander made several false claims in the vdeo. @DeccanHerald pic.twitter.com/FnaA5jzUD2— Chetan B C (@Chetan_Gowda18) April 22, 2025 ఆఫీసర్ చెప్పిన కథ ఇది.. సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు. -
లైంగిక దాడి: ఫ్లైట్ లెఫ్టినెంట్ అరెస్ట్
చెన్నై: తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడి చేశాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఫ్లైట్ లెఫ్టినెంట్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా అధికారిణిని ఇటీవల ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు అడుతున్న క్రమంలో గాయపడ్డారు. దీంతో ఆమె గాయం తగ్గడం కోసం మందులు వేసుకొని తన గదిలో నిద్రపోయారు. అయితే ఆమె నిద్ర లేచి చూశాక.. తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించించారు. ఈ ఘటనపై ఆమె రెండు వారాల క్రింతం తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, వారు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఛత్తీస్ఘర్ రాష్టానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు. -
‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’
లక్నో: ‘నా కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాను.. ఉద్యోగ విరమణ తర్వాత ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేశాను. కానీ అవేవీ ఫలించలేదు. ఇందుకు యూపీఏ ప్రభుత్వం, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిర్ణయాలే కారణం’ అంటూ ఓ విశ్రాంత ఐఏఎఫ్ అధికారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. అస్సాంకు చెందిన బిజన్ దాస్ ఈ నెల 6న ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగాడు. అయితే ఆదివారం రోజున ఆయన గది బయటకు రాకపోవడమే కాక ఆహారం కూడా తీసుకోలేదు. అనుమానం వచ్చిన వెయిటర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వారు గది లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న బిజన్ దాస్ వారికి కనిపించాడు. గదిలో రెండు వేల రూపాయలతో పాటు ఓ ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించింది. దానిలో తన కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాని.. ఉద్యోగ విరమణ తర్వాత వ్యాపారం ప్రారంభించినప్పటికి కలిసి రాలేదని తెలిపాడు బిజన్ దాస్. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వాన్ని, చిదంబరాన్ని తప్పు పట్టాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లు, తప్పుడు నిర్ణయాల వల్ల మాంద్యం పరిస్థితులు తలెత్తాయని.. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత తాను ప్రారంభించిన వ్యాపారాలేవి కలిసి రాలేదని బిజన్ దాస్ ఆరోపించాడు. అంతేకాక ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల వల్ల తాత్కలిక ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొన్నాం.. కానీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు తలెత్తాయన్నాడు. తన కుమారుడు బాగా పాడతాడని.. ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాడని తెలిపాడు. తాను చనిపోవడంతో తన కుమారుడు దిక్కులేని వాడవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు అతని కలలను సాకారం చేసుకునేందుకు మోదీ సహకరించాలని బిజన్ దాస్ విజ్ఞప్తి చేశాడు. అంతేకాక అలహబాద్లోనే తన అంత్య క్రియలు పూర్తి చేయాలని అందుకు గాను రూ. 1500లను గదిలో ఉంచానని చెప్పాడు. హోటల్ గది అద్దె చెల్లించడం కోసం మరో 500 రూపాయలను కూడా ఉంచుతున్నట్లు పేర్కొన్నాడు. తాను మరణించాననే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపవద్దని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్లోనే ఎన్నోసార్లు నాపై దారుణం!
సాక్షి, కాన్పూర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కల్యాన్పూర్ సీఐ నవీన్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐఐటీ కాన్పూర్ విద్యార్థినికి ఐఏఎఫ్ అధికారి సితాన్షుతో సోషల్ మీడియాలో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు తరచుగా గర్ల్స్ క్యాంపస్‌కు వచ్చేవాడు. పరిచయంతో లొంగదీసుకున్న అధికారి పెళ్లి చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించాడు. కొన్నిసార్లు హాస్టల్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపారు. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన సితాన్షు తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆపై పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఆ విద్యార్థిని వాపోయింది. నిందితుడితో పాటు అతడి సోదరి, బామ్మర్ది, ఓ స్నేహితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
అమ్మను చంపి.. ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భారత వైమానిక దళంలో పనిచేసే ఓ అధికారి అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని పీకపిసికి చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పై నుంచి దూకి కింద పడి ఉన్న అతడిని ఇరుగుపొరుగులు గమనించి ఆస్పత్రిలో చేరచగా అక్కడ తీవ్ర గాయాలతో మరణించాడు. జగదేవ్ సింగ్ యాదవ్ (38) జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన తల్లి సంతరా దేవి (70)తో కలిసి ఉంటున్నాడు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడొక్కడే తల్లిని చూసుకుంటుండగా, అతడి భార్య, పిల్లలు బెంగళూరులో ఉంటున్నారు. ఏమైందో తెలియదు గానీ, ఇంటిపై నుంచి దూకేసిన అతడికి చాలా ఫ్రాక్చర్లు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడి మరణవార్తను తల్లికి చెబుదామని ఇంటికి వెళ్తే.. అక్కడ ఆమె మంచం మీద చనిపోయి పడి ఉన్నట్లు పొరుగువారు చెప్పారు. ఆమె మంచం పక్కనే కంప్యూటర్ కేబుల్ పడి ఉందని, దాంతోనే అతడు తల్లిని చంపేసి ఉంటాడని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంటరితనానికి తోడు తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేకనే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. -
ప్రియుడితో కలసి ఐఏఎఫ్ అధికారిని చంపిన భార్య, అరెస్ట్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి హత్య కేసులో ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 10న దక్షిణ ఢిల్లీ సుబ్రతొ పార్క్‌లోని తన నివాసంలో 40 ఏళ్ల రమేష్ చంద్ర హత్యకు గురయ్యారు. రమేష్ భార్య సుధ చంద్ర తన టీనేజ్ ప్రేమికుడు (17)తో కలసి ఆయనను చంపేసింది. సుధ ప్రేమికుడు మరో ఐఏఎఫ్ అధికారి కుమారుడని పోలీసులు తెలిపారు. వీరు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తారు. రమేష్‌ను చంపేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చిందని సుధ ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వెంటనే ఆయనను చికిత్స కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే రమేష్‌ను గొంతునులిమి చంపేసినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. పోలీసుల విచారణలో తొలుత తనకేం తెలియదన్న సుధ అనంతరం నేరం అంగీకరించింది. ఆమె ప్రేమికుడిని బాలనేరస్తుల కేంద్రానికి తరలించారు. సుధ, రమేష్ దంపతులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. వాళ్లకు నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది క్రితం పక్కింట్లో ఉండే యువకుడితో సుధకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రమేష్‌కు తెలియడంతో మద్యానికి బానిసయ్యాడు. వివాహ సంబంధం విచ్చిన్నమయ్యే పరిస్థితి ఏర్పడటంతో సుధ రమేష్‌ను చంపేసిందని పోలీసులు చెప్పారు. -
ఉత్తరాఖండ్ లో మరిన్ని విపత్తులు వచ్చే అవకాశం!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రాంతంలో మరిన్ని విపత్తులు సంభవించేందుకు ఆస్కారముందని ఐఏఎఫ్ అధికారి ఒకరు హెచ్చరించారు. గత జూన్‌లో ఉత్తరాఖండ్‌లో భీకరమైన రీతిలో వరదలు సంభవించి భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిన సందర్భంగా.. గాలింపు, సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన ఎయిర్ వైస్ మార్షల్ ఎస్ఆర్కే నాయర్ సోమవారమిక్కడ ఒక సెమినార్లో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. ‘‘విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా కేదార్నాథ్ ఎగువన ఉన్న భారీ హిమానీనద సరస్సు కరిగిపోయి నీరంతా ఒక్క ఉదుటన దిగువకు ప్రవహించి తీవ్రమైన బీభత్సం సృష్టించింది. ఇటువంటి హిమానీనద సరస్సులు ఈ ప్రాంతంలో మరిన్ని ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు సంభవించేందుకు ఆస్కారం ఉంది’’ అని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి విపత్తు సంభవించినా తగిన విధంగా ఎదుర్కొనేందుకు, సత్వర సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా కీలకమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ల కోసం ఇంధనంతో సహా సహాయ సామగ్రిని సైతం తగిన మొత్తంలో నిల్వ చేసి ఉంచాల్సిన అవసరం ఎంతయినా ఉందని నాయర్ సూచించారు.