Politics

అమరావతి.. స్కాంలకు పరాకాష్ట: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో జరుగుతున్న స్కాంలకు పరాకాష్ట.. అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు. ‘‘అమరావతి పనుల కోసం 2018 లోనూ టెండర్లు పిలిచారు. నాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41, 107 కోట్లు. దాదాపు 6 వేల కట్లు పనులు చేశారు. మిగిలిన రూ. 35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉంది. కానీ, ఈ టెండర్లు రద్దు చేేశారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కాకుండా మళ్లీ కడతారట. అంటే అన్నీ గంగపాలు చేసినట్లే!. అక్రమాలకు అడ్డు కాకూడదని.. మా హయంలో తెచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్నూ రద్దు చేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు లేవు. కానీ, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తెచ్చారు. అడ్వాన్స్‌ల పేరిట 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనులను ఇప్పుడు నిర్మాణ వ్యయం 4,468 కోట్లు. 2018తో పోలిస్తే దాదాపు రూ.2,417 కోట్లు (105 శాతం) పైగా పెంచారు. చదరపు అడుగుకు రూ.8, 931.. అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా?మీరు సాయం చేస్తే.. పుంజుకుంటాం(ఈనాడు క్లిప్‌ను ప్రదర్శిస్తూ..) అంటూ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. సొంత లాభాలు, బినామీ ఆస్తులను పెంచుకునే పని పక్కన పెడితే.. ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా’’ వైఎస్ జగన్ సూచించారు.

అసలువి మరచి.. కొసరుతో కాలక్షేపం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులూ చేస్తుంటారు. చిన్న, చితకా విషయాలపై సమీక్షల పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం.. ఆ వార్తలు తమ అనుకూల పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం.. ఇదీ బాబు మోడల్.చంద్రబాబు ఈ నెల 19న జరిపిన సమీక్ష సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. రెండు అంశాలు. ఒకటి.. ప్రభుత్వ సేవలలో లోపాలకు చెక్ పెట్టాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి అని!. రెండోది... గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా? అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాలా? కింది స్థాయి అధికారో.. లేక సంబంధిత శాఖల మంత్రులో చేస్తే సరిపోదా? అన్నది ప్రశ్న! పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రజలకు అందుతున్న రకరకాల సేవలను తొలగించి ఇలా మాట్లాడటం బాబుకే చెల్లుతుంది!.ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74 శాతం మంది తమకు రేషన్ అందుతోందని చెప్పారట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని తొలగించిన తరువాత ఏం జరుగుతోందని కదా?. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధిగల ప్రభుత్వం ఏదైనా ఇళ్లవద్దకే రేషన్ అందివ్వాలా? లేక షాపుల వద్దనైనా ఓకేనా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే.. రేషన్ సరఫరా వాహనాలను సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సమీక్ష!.గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయమూ ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చేవారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకూ సబబు?. వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ ఎలా అమలవుతోంది? అని!. ఏడాదికి ఒక సిలిండర్.. అది కూడా కొంతమందికే ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు? అని!. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ప్రయోజనం?. పైగా ఇప్పుడు ఇంకొ కొత్తమాట మాట్లాడుతున్నారు.. మూడు సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేస్తామూ అంటున్నారు. మంచిదే కానీ.. వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలకు నమ్మకం కుదిరేది?. పంచాయతీలలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోందని అరవై శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశం.జగన్ టైమ్‌లో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే ‘‘చెత్త పన్ను’’ అంటూ బాబు అండ్ కో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్తపన్ను తీసేశామని చెప్పి... ఆస్తి పన్ను పెంచేశారు! పోనీ చెత్త తొలగింపు జరుగుతోందా అంటే అది అంతంత మాత్రమే!. చెత్త సరిగా ఎత్తడం లేదని 40 శాతం మంది చెప్పారంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది!. స్వచ్చాంద్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయలేకపోయారా?. పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారేమో మరి.ఆర్టీసీ బస్స్టాండ్లలో సేవలపై ప్రజలలో అసంతృప్తి ఉందని తేలిందట. తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలు బాగోలేవట. ఈ సంగతి ముఖ్యమంత్రి స్థాయిలో కనిపెట్టాలా? మరి సంబంధిత మంత్రి ఏమి చేస్తున్నారు?. ఆర్టీసీకి అవసరమైన నిధులు కేటాయించినా అధికారులు ఎందుకు ఈ సేవలు అందించ లేకపోతున్నారు?. ఇక వాట్సప్ సేవలతో అన్ని జరిగిపోతున్నట్లు ప్రొజెక్టు చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 375 సేవలు అందిస్తున్నారని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. బాగానే ఉంది. ఇంతవరకు 45 లక్షల మంది ఈ సేవలను వాడుకున్నారట. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే ఈ సేవలను పది శాతం మంది మాత్రమే వాడుకున్నారన్న మాట!. వాట్సప్ సేవల సంగతేమో కాని, జనం ప్రతీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వస్తోంది.జగన్ హయాంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, వలంటీర్ల వ్యవస్థలన్నీ నీరు కార్చి ఇప్పుడు వాట్సాప్ కథలు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఉగాది నాడు పూజలు చేసి మరీ వాగ్దానం చేసిన చంద్రబాబు దానిని గాలికి వదిలి వేశారు. దీనిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనవసరం లేదా!. ఆరోగ్యశ్రీని క్రమేపి బీమా కిందకు మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా?.కొన్ని ప్రభుత్వ సంస్థలలో నెలల తరబడి జీతాలు అందడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిపై సమీక్ష జరిపితే పది మందికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత వాటి తీరుతెన్నులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఉపయోగం తప్ప, ఇలా విషయం లేని అభిప్రాయ సేకరణలు జరిపి, ఈ స్థాయిలో వాటిని సమీక్షించడం అంటే అవి సీఎం వద్ద జరిగే కాలక్షేపం మీటింగులే అని ప్రజలు భావిస్తారని చంద్రబాబుకు తెలియదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

‘మోదీజీ.. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించండి’
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్ గత 11 రోజుల్లో ఎనిమిది సార్లు భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందాన్ని తానే కుదిర్చినట్టు చెప్పారు. భారత్‌ను తానే ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రంప్ ఇదే చెబుతున్నారు. కానీ, ఆయన స్నేహితుడు ప్రధాని మోదీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మన విదేశాంగ మంత్రి కూడా ఏం మాట్లాడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. అంటే భారత్, పాకిస్తాన్ ఒకే పడవలో ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ చెప్పినప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఈ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ విషయమై అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై జైరాం రమేష్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్‌లోనే తిరుగుతున్నారు. వీరందరూ గత 18 నెలల్లో మూడు ఉగ్రవాద దాడులకు కారణమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఇలాంటిదేమీ లేకుండా.. ఎంపీలందరూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎంపీలను ఇతర దేశాలకు పంపడం ఎందుకు?. మేము అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?. పార్లమెంట్ సమావేశం జరగాలి. ప్రధానమంత్రి ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కారు. ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వరు అని విమర్శలు చేశారు.#WATCH | Delhi | Congress MP Jairam Ramesh says, "In the last 11 days, US President Trump has repeated 8 times that he convinced India and enabled the ceasefire... But his friend, PM Modi, is quiet. Our foreign minister is quiet... Donald Trump praises both PM Modi and Pakistan… pic.twitter.com/G2FxHs8Trx— ANI (@ANI) May 22, 2025

చంద్రబాబు.. అప్పుల సామ్రాట్: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ‘‘ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9 వేలకోట్లు అప్పు చేశారు. 293(1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం. ఏపీఎండీసీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్ర గనులపై ప్రైవేట్ వ్యక్తులు అజమాయిషి ఇస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
Sports

UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్ యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్ దాస్ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తాంజిద్ హసన్ ధనాధన్అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమాన్ (0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ (18 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ లిటన్ దాస్ (14) సహా తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్ హొసేన్ (9), రిషాద్ హొసేన్ (0), తాంజిమ్ హసన్ సకీబ్ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్ మహమూద్ (15 బంతుల్లో 26 నాటౌట్), షోరిఫుల్ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్) మాత్రం దంచికొట్టారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్ షరాఫూఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ముహమద్ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ముహమద్ జోహైబ్ (29)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ షరాఫూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్ ఖాన్‌తో కలిసి అలిషాన్ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.అలిషాన్ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్ ఖాన్ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అలిషాన్ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్

వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ప్రొఫెషనల్‌గా మారనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్‌జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్‌గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్‌జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్‌జీత్... ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్‌జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్‌గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు.

MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025
National

చనిపోయిన భార్యకు గుడి కట్టించిన భర్త
కొరుక్కుపేట(తమిళనాడు): అరియలూరుకి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించి, పూజలు చేస్తున్నాడు. అరియలూర్‌కు చెందిన విజయకుమార్, కవిత అనే మహిళను 16 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, అతను కవితను కాలేజీకి తీసుకెళ్లి, చదివించాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, కవిత తన భర్త విజయకుమార్‌ను ‘ఆసియుమ్మ‘ (కోరిక) అని పిలుస్తూనే ఉంది. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ, వారి తల్లిదండ్రుల నుంచి కఠినమైన మాటలకు గురయ్యారు. ఒక సమయంలో ఆమె తన భర్త విజయకుమార్‌తో కలిసి తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లారు. 2022లో, తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన కవిత, కృత్రిమ గర్భధారణ శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో ఔషధం అధిక మోతాదు కారణంగా మరణించింది. రోజులు గడిచే కొద్దీ, భార్యపై అతనికి ప్రేమ తగ్గలేదు. ఆమెతో గడిపిన రోజులను లెక్కించుకుంటూ జీవిస్తున్న విజయకుమార్, తన ప్రియమైన భార్యకు గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఇలంగేరి గ్రామంలో తన భార్య కవితకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాలుగు రోజులకొకసారి, విజయకుమార్ పనికి వెళ్లే ముందు, ఆమెకు పూజలు చేస్తున్నాడు. విజయకుమార్ ను అతని అత్తమామలు, బంధువులు మళ్లీ వివాహం చేసుకోమని చెప్పినప్పటికీ, తన భార్య కవితతో తన జీవితం ముగిసిందని, కానీ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెబుతాడు. ఆయన మాట్లాడుతూ కవిత తనతో చాలా ప్రేమగా ఉండేదన్నారు. ఆ అభిమానానికి అవధులు లేవన్నారు. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ, అది తమకు చాలా పెద్ద విషయం, తాము ఒకరికొకరు పిల్లలుగానే జీవించామని చెప్పారు. View this post on Instagram A post shared by Thanthi TV (@thanthitv)

103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
బికనీర్: ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని ఎనిమిది స్టేషన్లతో సహా 18 రాష్ట్రాలలో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. #WATCH | Bikaner, Rajasthan | Prime Minister Modi inaugurates the redeveloped Deshnoke Station under the Amrit Bharat Station Scheme and flags off the Bikaner-Mumbai express train. He will lay the foundation stone, inaugurate and dedicate to the nation multiple development… pic.twitter.com/QaNTPe9TA9— ANI (@ANI) May 22, 2025రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఒకరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ముందుగా రాజస్థాన్‌లో రూ. 26 వేల కోట్ల విలువైన కీలకమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు.#WATCH | Binaker, Rajasthan | After visiting Karni Mata Temple, PM Modi visits Deshnoke Railway Station, serving pilgrims and tourists visiting the Karni Mata Temple, inspired by temple architecture and arch and column theme. The PM will inaugurate 103 redeveloped Amrit… pic.twitter.com/Q4A106nMGt— ANI (@ANI) May 22, 2025తొలుత ప్రధాని భారత వైమానిక దళానికి చెందిన నల్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడి దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్రంలోని ఎనిమిది స్టేషన్లతో సహా 18 రాష్ట్రాలలో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.#WATCH | Bikaner, Rajasthan: Prime Minister Narendra Modi visits and offers prayers at the Karni Mata temple in Deshnoke.(Source: ANI/DD) pic.twitter.com/soECZE3pMF— ANI (@ANI) May 22, 2025అలాగే బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. చురు-సాదుల్పూర్ రైలు మార్గానికి కూడా ఆయన పునాది రాయి వేశారు. బహుళ విద్యుదీకరించిన రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారు. సరిహద్దు కనెక్టివిటీని పెంచడానికి అనువైన రూ. 4,850 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. #WATCH | Bikaner, Rajasthan | PM Modi will lay the foundation stone, inaugurate and dedicate to the nation multiple development projects worth over Rs 26,000 crore and also address a public function in Palana.A BJP supporter says, "We are here to welcome PM Modi... The people… pic.twitter.com/pRDc0nduYG— ANI (@ANI) May 22, 2025ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ

ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు.

158ని బలిగొన్న విమాన ప్రమాదం.. 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
మంగళూరు: అది 2010, మే 22.. కర్నాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Mangalore International Airport)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాదం జరిగి నేటికి (మే 22, 2025) 15 ఏళ్లు పూర్తయ్యింది.నాడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(Air India Express flight) 812లో ప్రయాణం సాగించిన 166 మంది ప్రయాణికులలో ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టగలిగారు. భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది. దర్యాప్తు దరిమిలా వెలువడిన వివరాల ప్రకారం విమాన కెప్టెన్ ల్యాండింగ్ విషయంలో చేసిన తప్పిదమే ప్రమాదానికి కారణమని వెల్లడయ్యింది. రన్‌వే ఓవర్‌షూట్ అయిన విమానం కొండవాలు నుండి పడగానే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయపు రన్‌వే మిగతావాటితో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది.నాడు ప్రమాదానికి గురైన విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చింది. ల్యాండింగ్ నుండి 2,000 అడుగుల దూరంలో ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో అది రన్‌వే 24 ప్రారంభం నుండి 5200 అడుగుల ఎత్తులో ల్యాండింగ్(Landing) ప్రారంభించింది. అది ఆపడానికి 2,800 అడుగులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అయితే అది అంతలోనే ఇసుక అరెస్టర్ బెడ్ గుండా దూసుకెళ్లింది. దాని రెక్కలు యాంటెన్నాలను ఢీకొని కొండపై పడిపోయాయి. వెంటనే మంటలు విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయారు.నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందించారు. అలాగే అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. ఇదేవిధంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించింది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ
International
NRI

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్‌గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్‌లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.
Sakshi Originals

బొప్పాయి.. లాభమేనోయి..
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు » బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. » ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. » చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. » బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది. » బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది. » విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. » కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. » ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిగుబడి బాగుంది నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్‌కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం కొవ్వూరు డివిజన్లో అధికం బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. – బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం కోల్‌కతా, ఒడిశాకు ఎగుమతి వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది.

అద్భుత శిల్పాల మ్యూజియం
అలంపూర్: అద్భుత శిల్పాల రమణీయం పురాతన శిల్ప సౌందర్యంలోనే కన్పిస్తుంది. పురాతన ఇతిహాసాలు, గాథలు, ప్రకృతి వింతలు, విశేషాలు, రాజరికపు గుర్తులు, సిరి సంపదలు, మనుషుల వేషధారణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను శిల్పులు తమ శిల్ప కళ ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. పురాతన ఇతిహాసాలకు, శిల్ప సౌందర్య కళకు అలంపూర్ పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన పురాతన ఆలయాల్లో శిల్పుల కళానైపుణ్యం పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. అక్కడక్కడ కనిపించే శిల్పాలే పర్యాటకుల మనసులను ఆహ్లాదపరిస్తే.. అబ్బురపరిచే శిల్ప సమూహం ఒకే చోట కనిపిస్తే శిల్పాకళా ప్రేమికుల ఉల్లాసానికి అవధులుండవు. అలాంటి అద్భుత శిల్పాల సమూహం అలంపూర్ క్షేత్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ప్రాంతంలో లభించిన పురాతన, అరుదైన శిల్పాలను పురావస్తు శాఖ ఒక చోట భద్రపరిచింది. అదే పురాతన శిల్పాల ప్రదర్శన క్షేత్రం. పురావస్తు మ్యూజియంగా ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనకు అందుబాటులో ఉంచారు. 1952లో ప్రారంభం.. అలంపూర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ప్రారంభించారు. ఆలయాల పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో లభించిన శిలా శాసనాలు, విగ్రహాలు అన్నింటినీ సేకరించి సిద్ధుల మఠంగా పిలవబడే మండపంలో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇందులో 26 శిలా శాసనాలు, 188 శిలా విగ్రహాలు ఉన్నాయి. క్షేత్రానికి వచ్చే పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం కల్పించారు. మ్యూజియంలో విశేషం ఇది.. ఉత్తరవాహిణి తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది. కోటి లింగాల క్షేత్రంగా అలంపూర్ ప్రసిద్ధిగాంచి.. దక్షిణకాశీగా పిలవబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగల క్షేత్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ప్రాచీన శిల్పకళకు అద్దంపట్టే శిల్పాలు పర్యాటకులను ఉల్లాసపరుస్తాయి. ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం పురావస్తు ప్రదర్శనశాల. 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారిచే ఆరాధించబడిన దేవతా మూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 6వ శతాబ్దంలోని బాదామి చాళుక్యుల కళాసంస్కృతికి ఇక్కడ వెలసిన శిల్పాలు నిదర్శనంగా ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం అలంకారానికి ఉపయోగించిన ఆభరణాలు, అప్పటి మహిళల వేషధారణ ఇక్కడి విగ్రహాలలో చూడవచ్చు. ఈ ప్రదర్శన శాలలో వీరాంగవీరులు (భర్త, భార్య ఇద్దరూ శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన వారు), వీరుగల్లు, వీరశిలా విగ్రహాలు, వారి బల ప్రదర్శనలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. సతీ సహగమనానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి.. అలంపూర్‌లో లభ్యమై పురావస్తు మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు దేశ విదేశాల్లో ఖ్యాతిని తెచి్చపెడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శిల్పాలు కేవలం సందర్శనలకే గాక ప్రపంచ పురావస్తు శిల్పాల ప్రదర్శనలకు వెళ్లి అరుదైన గౌరవాలను దక్కించుకున్నాయి. 1977లో ఇక్కడి నటరాజ మూర్తి విగ్రహాన్ని లండన్‌లో ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984లో సూర్య విగ్రహాన్ని జర్మనీలో, 2008లో సూర్య, నాగ, మహిషాసురమర్ధిని విగ్రహాలను బెల్జియంలో ప్రదర్శించగా ఖ్యాతి గడించాయి. మంత్రముగ్ధులను చేసే విగ్రహాలు.. శిల్పాచార్యులు స్థానికంగా లభించే నల్లరాతి శిలతో అందంగా నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో కనిపించే శరీర సౌష్టవాలు నాట్యభంగిమలు నాట్యకళాకారులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదే విధంగా 7–8 శతాబ్దాలకు చెందిన సూర్య విగ్రహం కూడా మెత్తటి ఎర్రఇసుక, రాతిని ఉపయోగించి తయారు చేశారు. ‘సప్తాస్వ రథసమారూఢం’అన్నట్టుగా ఏడు గుర్రాలతో ఒకే చక్రం కలిగిన రథం, ఉషా, ఛాయా సమేతంగా సూర్య విగ్రహాన్ని అందంగా మలిచి ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక 6–7 శతాబ్దాలకు చెందిన నాగబంధ విగ్రహాన్ని పరిశీలిస్తే.. పద్మ బంధంలో ఏడు తలలు కలిగి మానవ ఆకృతిని పోలి ఉన్న నాగబంధ విగ్రహం కళాకారులను మనసు దోచుకుంటుంది. 7–8 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్దిని విగ్రహం కూడా అలనాటి దేవీభాగవతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. అసుర సంహారం కోసం మహిషాసురిడిని సంహరించి మహిషి తలపై తాండవం చేస్తున్నట్టు ఆదిపరాశక్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. అలాగే అలనాటి వైభవాన్ని చాటి చెప్పే స్తంభాలను నేటి తరాలవారిని అదరహో అనిపిస్తాయి. ఈ స్తంభంపై మలచబడిన శిల్పా ఆకృతులను పరిశీలిస్తే పట్టుచీరలపై ఉన్న బార్డర్ల డిజైన్లు తలపిస్తున్నాయి. నంది వాహనంపై శివపార్వతులు.. పరమశివుడి రూపం ఎక్కడ చూసినా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. సతీ సమేతుడై ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనంపై ఆశీనులై దర్శనమివ్వడం అనేది చాలా అరుదు. కానీ అలంపూర్‌లో మాత్రం దేవతా స్వరూపంలో, అది కూడా శివుడు పార్వతీ సమేతుడై నంది వాహనంపై కూర్చుని ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి విగ్రహం చూడాలంటే అలంపూర్ మ్యూజియానికి రావాల్సిందే. శిలాశాసనం ద్వారా తెలిసేదేమిటంటే.. ఆలయాల మనుగడ కోసం ఆనాటి రాజులు ఎన్నో భూములను మాణ్యాలుగా సమర్పించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఈ మాణ్యాలు ఆలయాలకు చెందాల్సిందేనని.. అలాంటి మాణ్యాలను ఎవరైనా హస్తగతం చేసుకుంటే గోవధ చేసినంత పాపం వస్తుందని తెలియజేస్తూ ఆ శాసనంపై సూర్య, చంద్రులు, లింగం, ఆవు, ఖడ్గం వంటి బొమ్మలతో శిలాశాసనం చేశారు. అది హలగన్నడ లిపిలో కనిపిస్తుంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే..
నిర్దేశిత లోడు కంటే ఎక్కువ కరెంట్‌ను వినియోగించడం.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంతర్గత కేబుళ్లను ఇప్పటికీ మార్చక పోవడం.. కేబుల్ సామర్థ్యానికి మించి ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం.. వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండటం.. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తుతుండటం.. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ఒవెన్లు, ఐరన్ బాక్సులు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు రోజంతా ఆన్‌లోనే ఉంచడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించడానికి ఇవే కారణాలు. వీటివల్లనే కేబుళ్లు హీటెక్కి, మీటర్, జాయింట్ల వద్ద నిప్పు రవ్వలు (స్పార్క్‌లు) చెలరేగుతున్నాయి. ఇలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల ఫలితంగా మాల్స్, దుకాణాలు, ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. కొన్ని ఘటనల్లో అగ్నికీలల్లో చిక్కు కోవడం, పొగతో ఊపిరాడకపోవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు లైన్లు, వైర్లు, ప్లగ్ లు, ఎంసీబీలు, ఎర్త్రాడ్ల పని తీరును పరిశీలించి, దెబ్బతిన్న కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవాల్సి ఉన్నా వాణిజ్య, గృహ వినియోగదా రులు పట్టించుకోవడం లేదు. పాతబస్తీలోని పురాతన భవనాల్లోనే కాకుండా, కొత్తగా సీఈఐజీ అనుమతి పొందిన హైరైజ్ భవనాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు (Short Circuit) జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీ అయినా.. కొత్త హైరైజ్లైనాపాతబస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోనే కాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్రాంగూడల్లో కొత్తగా నిర్మించే హైరైజ్ బిల్డింగ్స్‌లోనూ విద్యుత్ లైన్లు సరిగా ఉండటం లేదు. భవిష్యత్తు అవసరాల మేరకు లోడు ఎంపిక మొదలు..లైన్ల ఏర్పాటు వరకు అన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆలోచనకు, అవసరాలకు భిన్నంగా ఆ తర్వాత ఇంట్లోకి అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో తక్కువ సామర్థ్యంతో లైన్లు, కేబుళ్లు వేయడం జరుగుతోంది. నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కనీస అనుభవం, అర్హత లేని ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. వీరు భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలిక అవసరం కోసం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఎంసీబీలు వాడుతున్నారు. కంటికి కన్పించే ప్లగ్‌లు, స్విచ్ బోర్డులు, లైట్లు మినహా గోడలు, స్లాబులో వాడే వైర్లు నాసిరకంగా ఉంటున్నాయి. సరైన ఎర్తింగ్ ఉండటం లేదు. మరోవైపు ఒకే ప్లగ్/ వైరు నుంచి మల్టిపుల్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఒకే సాకెట్ నుంచి ఒకటికి మించిన ఏసీ కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా సామర్థ్యానికి మించి ఏసీలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ఎక్కువగా వినియోగించడం వల్ల బలహీనంగా ఉన్న కేబుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. కేబుళ్ల జాయింట్ల వద్ద స్పార్క్‌లు చెలరేగుతున్నాయి.పేలుతున్న ఏసీ కంప్రెషర్లుఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించే ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. ప్రస్తుతం సాధారణ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి ఇందుకు దోహదపడుతోంది. ప్రతిఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగినట్టుగా తయారీ కంపెనీలతో పాటు పలు బ్యాంకులు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాయి. వాయిదా పద్ధతుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలాచోట్ల 60 నుంచి 100 గజాల స్థలంలోనూ ఐదారు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు కింద షాపులను ఏర్పాటు చేసి, పైన నివాసానికి వీలుగా చిన్న చిన్న గదులను నిర్మిస్తున్నారు. నివాసితులు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఏసీలూ వినియోగిస్తున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు ఏసీలు ఉంటున్నాయి. అయితే ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండటం లేదు. వైరింగ్ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి కరెంటు వాడటం, మండే ఎండల్లో రోజంతా ఏసీలు ఆన్‌లో ఉంటుండటం వల్ల కంప్రెషర్లు పేలిపోతున్నాయి.బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని..కిటికీ, డోర్ కర్టెన్లు, పరుపులు, దుస్తువులకు నిప్పు అంటుకుని వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు ఇరుకైన దారి ఉండటం, తలుపులకు తాళాలు వేసి ఉండటం, ఇతరత్రా కారణాలతో బయటకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మొన్న అఫ్జల్‌గంజ్‌లోని మూడంతస్తుల భవనం, తాజాగా చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇలాంటి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది.ఇలా చేస్తే సేఫ్...⇒ బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలనే భవనాల్లో ఉపయోగించాలి. ⇒ విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌తో మాత్రమే చేయించాలి. ⇒ అతుకుల తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరం. ⇒ విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్, ఓవెన్లను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలి. ⇒ అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న 3 పిన్ సాకెట్లను వాడాలి. ⇒ ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ (Mobile Charging) బెడ్ దగ్గర పెట్టకూడదు. ⇒ విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే నీళ్లతో ఆర్పవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు. ⇒ వెంటనే విద్యుత్‌ను ఆఫ్‌చేసి, పొడి ఇసుకతో లేదా కార్బన్ డయాక్సైడ్ ఎక్ట్సింగ్విషర్తో మంటలను ఆర్పాలి.చదవండి: పాతబస్తీ ప్రమాదంలో విస్తుపొయే విషయాలు.. అక్రమ కనెక్షనే కారణమా?⇒ ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి ఏర్పాటు చేయాలి. ⇒ ప్రతి అంతస్తులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతపై సైన్ బోర్డులు ప్రదర్శించాలి. స్మోక్ అలారం (Smoke Alarm) ఏర్పాటు చేయడంతోపాటు ఏటా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ⇒ ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఉండాలి. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలి. ⇒ అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలి. లిఫ్టులకు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలి. ⇒ మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని, పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలి. ⇒ మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలి.

Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది. శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్–1 న్యూక్లియర్ టెస్ట్‌గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.ఏ దేశాలు వ్యతిరేకించాయి? అణుబాంబుల బాధిత దేశమైన జపాన్ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్‌పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్ క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్ సైతం ఇలాగే స్పందించాయి.అమెరికా కన్నుగప్పి...1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్ (సిరస్) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్‌కు తరలించారు!చాన్నాళ్ల క్రితమే బీజం అణుబాంబు తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్ చేశారు. ‘‘డాక్టర్ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.ఆ మీట నొక్కిందెవరు?మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్ రేబతిరంజన్ దస్తీదార్ ఫైరింగ్ బటన్ నొక్కారు. ‘‘బటన్‌ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న ప్రణబ్ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్‌గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.‘స్మైలింగ్ బుద్ధ’ ఎందుకు? 1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్ పంపారు.1998లో పోఖ్రాన్–2 అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్
జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..
చమురుకు మరింత డిమాండ్
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
క్రైమ్

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.
వీడియోలు


అందాల యుద్ధం


హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం


మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్


బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం


Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..


పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు


కేసీఆర్ తో పాటు హరీష్‌రావు, ఈటలకు నోటీసులు


పెళ్లి నుంచి తిరిగొస్తూ.. తిరిగిరాని లోకానికి


అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్


గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?