
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్‌కు బైక్‌లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి