Sea Port
-
సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం
తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్) ఈ డీప్‌వాటర్ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్ ప్రపంచ టాప్–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్ అదానీ, శశిథరూర్ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్ సీపోర్ట్ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో శశిథరూర్ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్ అంతకుముందు ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
‘రెమాల్’ తుపాన్ టెన్షన్.. కోల్‌కత్తాకు విమానాలు బంద్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్‌ను రెమాల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. తుపాన్ కారణంగా బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్‌కత్తాకు రెడ్ అలర్ట్ విధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుపాన్ కారణంగా కోల్‌కతాలోని విమానాశ్రయం, పోర్టులో రాకపోకలను నిలిపివేశారు.కాగా, రెమాల్ తుపాన్ ప్రభావం బెంగాల్‌ను వణికిస్తోంది. కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగాల్ నుంచి విమానాల రాకపోకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. #WATCH | West Bengal: As per IMD, cyclone 'Remal' is to intensify into a severe cyclonic storm in the next few hours and cross between Bangladesh and adjoining West Bengal coasts around May 26 midnight as a Severe Cyclonic Storm (Visuals from Sundarbans, South 24 Parganas) pic.twitter.com/1yp3xRxUPr— ANI (@ANI) May 26, 2024మరోవైపు, కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని కూడా మూసివేస్తున్నట్టు పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్, కంటైనర్ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు నిలివేస్తున్నామన్నారు. ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోర్ట్ వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిసివేయనున్నట్టు స్పష్టం చేశారు. #CycloneRemal is here already! Earlier than predicted. Hoping that it doesn't do much damage. For the last five years, South Bengal is being badly hit by annual cyclonic storms. In 2020, Kolkata was rampaged by #Amphaan- more than 48 hours of no cell receptivity, no electricity pic.twitter.com/GQmHXMt7Hj— Srija Naskar (@writer_srija) May 25, 2024ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్, బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుపాన్ ప్రభావంతో బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెమాల్ తుపాన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. Next 24 hours are difficult for the eastern coast, esp the state of Bengal. #CycloneRemal will hit the coastal areas of East Medinipur, South Kolkata, Howrah etc. Around 12 coy of NDRF have been deployed. pic.twitter.com/ORnGCtFd63— Pranay Upadhyaya (@JournoPranay) May 26, 2024 -
చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భారత్ భారీ ప్లాన్..
సాక్షి, అమరావతి: సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడుతున్న అనివార్యతకు ఇది ముగింపు పలకనుంది. దేశ భద్రత ప్రయోజనాలకు కీలక స్థావరంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నికోబార్ దీవుల్లోని ‘గలాటియా బే’ వద్ద అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర మార్గానికి సమీపంలో నిర్మించనున్న ఈ పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలకం కానుంది. అందుకు సన్నాహకంగా 2020లోనే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్, నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్‌కు చెన్నై నుంచి సముద్రగర్భంలో 2,312 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మాణానికి రూ.41వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ట్రాన్షిప్మెంట్ పోర్టు లేక ఆర్థిక భారం అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ భారత్‌కు అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. తూర్పు తీరం, పశ్చిమ తీరంలోని పోర్టుల్లో బెర్త్‌ల వద్ద గరిష్ట లోతు 8 మీటర్ల నుంచి 12 మీటర్లే ఉంది. దీంతో గరిష్టంగా 75 వేల టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన కంటైనర్ నౌకలే ఈ పోర్టులకు వస్తున్నాయి. అంతర్జాతీయ లాజిస్టిక్స్ వ్యాపార ప్రమాణాల మేరకు 1.65 లక్షల టన్నుల నుంచి 1.80 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కంటైనర్ నౌకల్లో సరుకు రవాణా జరుగుతోంది. అంత పెద్ద కంటైనర్లతో కూడిన నౌకలు రావాలంటే పోర్టుల్లోని బెర్త్‌ల వద్ద లోతు 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండాలి. అటువంటి పోర్టు లేకపోవడంతో వివిధ దేశాల నుంచి వస్తున్న భారీ షిప్‌లను భారత్‌కు సమీపంలో ఉన్న సింగపూర్, కొలంబో, క్లంగ్ (మలేషియా), దుబాయిలోని అంతర్జాతీయ షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ 75వేల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న కంటైనర్లలోకి మార్చి భారత్‌లోని పోర్టులకు రప్పించాల్సి వస్తోంది. భారత్ నుంచి 75 వేల టన్నులకు మించిన కార్గో రవాణా చేయాలంటే తొలుత చిన్న కంటైనర్లలో సమీప దేశాల్లోని అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ నుంచి భారీ కంటైనర్ ద్వారా గమ్యస్థానాలకు చేర్చాల్సి వస్తోంది. అందుకోసం హ్యాండ్లింగ్ చార్జీల కింద ఒక్కో కంటైనర్ యూనిట్ కోసం 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్ మొత్తం కార్గో రవాణాలో 25 శాతం నాలుగు విదేశీ ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. అందులో 40 శాతం కొలంబో పోర్టు ద్వారానే సాగుతుండటం గమనార్హం. దీంతో భారత్ ఏటా రూ.5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. చైనా గుప్పిట్లో కొలంబో పోర్టు కొలంబో పోర్టుపై చైనా ఆధిపత్యం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. శ్రీలంక ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా చేసుకుని చైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చింది. కొలంబో పోర్టు పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకు ప్రతిగా కొలంబో పోర్టుపై చైనా నియంత్రణను అంగీకరించింది. ఒత్తిడికి లొంగి చైనా యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో లంగరు వేసేందుకు శ్రీలంక సమ్మతించింది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలంబో పోర్టుపై ఆధారపడటం భారత్ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని రక్షణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా కీలకం.. గలాటియా బే - వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణతోపాటు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలక వాటా కోసం నికోబార్‌లో ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. అందుకే అటు హిందూ మహాసముద్రం ఇటు పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉన్న నికోబార్ దీవిలోని ‘గలాటియా బే’ వ్యూహాత్మక ప్రదేశంగా ఎంపిక చేసింది. - గలాటియా బే ఉంది అంటే గంటకంటే తక్కువ సమయంలో ఆ పోర్టుకు చేరుకోవచ్చు. దీంతో సింగపూర్, కొలంబో, క్లంగ్ పోర్టుల కంటే నికోబార్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశాలున్నాయి. - గలాటియా బే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మలక్కా జలసంధి ముఖద్వారానికి సమీపంలో ఉంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రాలను అనుసంధానించే మలక్కా జల సంధి ద్వారా ఏటా లక్ష నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ప్రపంచంలో మొత్తం జల రవాణాలో 25 శాతం ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. - ఆస్ట్రేలియా, జపాన్, కొరియా సముద్ర మార్గంలో గలాటియా బే నోడల్ కేంద్రంగా ఉండటంతో ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అనువైందని కేంద్ర ప్రభుత్వ జియోటెక్నికల్ నివేదిక–2016 పేర్కొంది. - అంతర్జాతీయ కార్గో రవాణాలో అగ్రస్థానంలో ఉన్న సింగపూర్, దుబాయి ట్రాన్షిప్మెంట్ పోర్టులకు దీటుగా నికోబార్‌లో నిర్మించే పోర్టు అభివృద్ధి చెందుతుంది. - బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో భారత్ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా నిలుస్తుంది. - అక్కడ నిర్మించే పోర్టు బెర్త్‌ల వద్ద 18 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు ఉండేలా నిర్మించేందుకు అవకాశం ఉంది. ఆ దీవి వద్ద సముద్ర అడుగు భాగం పూర్తిగా గట్టి రాయితో ఉంది. దీంతో పెద్దగా డ్రెడ్జింగ్ (ఇసుక మేటలు తీయడం) చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా నిర్వహణ వ్యయం తగ్గుతుంది. -
తీరంపై డేగకన్ను
తీరం అప్రమత్తమైంది. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకునేందుకు.. ఎగిసి పడుతున్న అలల మధ్య డేగ కళ్లతో పహారా కొనసాగుతోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో పోర్టులు, హార్బర్లకు పడవల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్జన ప్రదేశాల్లో సైతం పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మెరైన్ పోలీసులు సముద్ర వేటకు వెళ్లే జాలర్లకు అవగాహన కల్పిస్తూ నిరంతరం గస్తీ కాస్తున్నారు. సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల కోస్ట్‌గార్డ్, పోలీస్ ఉన్నతాధికారులను నిఘా వర్గాల సూచనల మేరకు తీర ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సముద్రతీర ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మెరైన్ పోలీసులను ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలని రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర పహారా.. తీర ప్రాంతలో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు చొరబాట్లుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్జీవన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచారు. ఆధునిక మరబోట్లపై సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ జాలర్లను అప్రమత్తం చేసి వారికి అవగాహన కల్పించే మెరైన్ పోలీసులు నిమగ్నమయ్యారు. రాకపోకలపై ప్రత్యేక దృష్టి.. పోర్టులు, హార్బర్లకు రాకపోకలు కొనసాగించే పడవలు, బోట్లు, సముద్రంలో లంగరు వేసి ఉంచిన నౌకలపై కూడా దృష్టి సారించారు. ప్రసుత్తం ఉన్న బలగాలతో పాటుగా ఉగ్రవాదుల సమాచారం సేకరించే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకిదిగింది. మెరైన్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది విధిగా వారికి కేటాయించిన పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా సమాచారం సేకరించుకోవాలని నిఘా వర్గాలు సూచనల మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు ముందస్తు చర్యల గురించి ఆరా తీశారు. జాలర్లకు అవగాహన.. గతంలో మన జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన కోస్ట్‌గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని జాలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎలాంటి ఆనవాళ్లు గుర్తించినా వెంటనే తమకు సమాచారం అదించాలని సూచిస్తున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో సుమార్ 190 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా జిల్లాలో 43 కిలోమీటర్లు ఉంది. సూర్యలకం, నిజాంపట్నంలో మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్క నిజాంపట్నం హార్బర్లో 218 బోట్లు ఉంటే దాదాపు 200 బోట్లు నిత్యం చేపల వేటలో ఉంటాయి. ఇందులో 20 నుంచి 25 బోట్లు డైలీ సముద్రంలో వేట ముగించుకుని హార్బర్‌కు వస్తుంటాయి. -
నరసాపురానికి పోర్ట్ తీసుకువస్తాం: పరకాల
నరసాపురం పట్టణానికి పోర్ట్ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పరకాల ప్రభాకర్ ఆయన భార్య ,కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం వచ్చారు. ఈ సందర్భంగా పరాకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పేరుపాలెం బీచ్‌ను దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. అలాగే తాము దత్తత తీసుకున్న తూర్పు తాళ్లు, పెదమైనివానిలంక గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చుదిద్దుతామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం మండలంలోని పెదమైనివాని లంక గ్రామాన్ని, ఆమె భర్త పరకాల ప్రభాకర్ తూర్పు తాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే.