Khawaja Asif
-
భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. -
ఔను, ఉగ్రవాదాన్ని పోషించాం
ఇస్లామాబాద్: ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు! దాంతో ఈ విషయమై భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది. స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది. దీనిపై మీరేమంటారు?’ అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ, ‘‘అవును. అది నిజమే’’ అంటూ అంగీకరించారు. అయితే, ‘‘అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్‌లో సోవియట్‌పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. ‘‘మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్‌పై పోరులో, 2001 సెప్టెంబర్ 11 అల్‌కాయిదా ఉగ్ర దాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్రే వేరుగా ఉండేది’’ అంటూ వాపో యారు. సోవియట్‌తో ప్రచ్ఛన్నయుద్ధంలో, న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్ర దాడి తర్వాత అఫ్గానిస్తాన్‌పై ఆక్రమణలో అమెరి కాకు పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే.లష్కరే లేనేలేదట!పహల్గాం ఉగ్ర దాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచాలత ప్రదర్శించారు. కశ్మీర్‌తో పాటు పాక్‌లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గాం దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ విన్లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.దురాక్రమణను ఎదుర్కొంటాంపహల్గాం దాడితో పాక్ సంబంధముందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనేట్ శుక్రవారం తీర్మానం చేసింది. ‘‘మాపై దురాక్రమణకు దిగితే దీటుగా ఎదుర్కొంటాం. ఆ సామర్థ్యం మాకుంది’’ అని పేర్కొంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది. -
పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పాక్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరసన గళం విప్పుతుండగా, ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కూడా ఇమ్రాన్‌ను టార్గెట్ చేసింది. ఈ పరిస్థితులు నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇమ్రాన్ పొలిటికల్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ)పై బ్యాన్ విధించాలని ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. వివరాల ప్రకారం.. ఖవాజా ఆసీఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తరచూ దేశ రక్షణశాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, దేశ సైన్య విభాగాన్ని శత్రువుగా భావిస్తున్నారని ఆరోపించారు. పాక్ సైన్యం కారణంగానే ఇమ్రాన్ రాజకీయాల్లో కాలుమోపారని, ఇప్పుడు దీనిని మరచిపోయి ఆయన సైన్యాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కాగా, మే 9న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు సైనికాధికారుల ముఖ్యకార్యాలయంపై దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక, పలు అవినీతి ఆరోపణలతో మే 9న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తింది. Defence Minister Khawaja Asif said that the Federal government considering to impose ban on Imran Khan’s Party Pakistan Tehreek-e-Insaf.https://t.co/4YhnjJIAPR#imranKhanPTI #Ptiban #pdmgovt #DefenceMinister #KhawajaAsif #burjnews pic.twitter.com/3jMyTmzs7h — Burj News (@Burjnews) May 24, 2023 ఇది కూడా చదవండి: మరో మహమ్మారి పొంచి ఉంది.. WHO వార్నింగ్ ఇదే.. -
పాక్ విదేశాంగ మంత్రిపై వేటు
-
పాక్ రాజకీయాల్లో మరో సంచలనం!
ఇస్లామాబాద్: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్‌కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటున్నది. -
‘ట్రంప్ భారత్ భాషలో మాట్లాడుతున్నారు’
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే ఆయన భారత్ బాట (భారత్ గొంతుక వినిపిస్తున్నారని) పట్టినట్లు కనపడుతోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్ఘనిస్తాన్‌లో విఫలం చెందడానికి పాక్ కారణమని అమెరికా ఎలా అంటుదని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన పాక్‌ను బలిపశువును చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పాక్‌కు అమెరికా అందిస్తున్న 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై ట్రంప్ మాట్లాడుతూ.. బదులుగా అబద్ధాలు, మోసం తప్పితే ఏమీ రావడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆసిఫ్.. అమెరికా నాయకుల వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. -
ట్రంప్ షాక్‌తో.. పాక్ గిలగిల
ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఊహించని షాక్‌తో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. సహాయ నిధులను నిలిపేయడంతో పాటు ఉగ్రవాదుల విషయంలో అబద్దాలు చెబుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ట్రంప్ ట్వీట్ మీద, ఇకముందు అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ట్వీట్‌పై త్వరలో స్పందిస్తామని, ప్రపంచానికి నిజాలు తెలుసని ట్విటర్లో ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. వాస్తవాలకు కల్పితాలకు ఉన్న తేడాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకాన్ని ఆసిఫ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలావుండగా.. అమెరికా కోరుకుంటున్న ‘డూ మోర్’ పాలసీని పాకిస్తాన్ ఇదివరకే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ‘డూ మోర్’ అనే పదానికి ప్రాముఖ్యత లేదన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికా అందించిన సాయంపై పూర్తి వివరాలను ఖర్చులతో సహా వివరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ట్రంప్ ట్వీట్‌పై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్ తీవ్రంగా స్పందించారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఇచ్చిన నిధులకు జమాఖర్చులు అడగడం పాకిస్తాన్‌ను అవమానిండమేనని అన్నారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు లేకుండా ఆఫ్ఘన్‌తో నాటో దళాలు యుద్ధం చేసేవా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ రాయబారికి సమన్లు ట్రంప్ ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ హాలేకి ఆ దేశం సోమవారం రాత్రి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ సమన్లు జారీ చేసిన విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహమీనియా జుంజువా ఈ సమన్లు పంపినట్టు తెలిపింది. -
నిజమే.. దూరం పెరిగింది..!
ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ వివాదంతో.. ఇస్లామాబాద్-వాషింగ్టన్ మధ్య దూరం పెరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆసిఫ్ ఖాజా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతంఇరు దేశాల మధ్య విశ్వసనీయత లేదు.. అయితే.. దూరాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం..అని ఆసిఫ్ ఖాజా మీడియాకు తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో సమావేశం అనంతరం ఆసిఫ్ ఖాజా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా కాదని తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా ఉన్నతాధికారు ఒకరు పాక్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయాన్ని.. రెక్స్ టిల్లర్సన్ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాక పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల ఏరివేతకు ప్రభుత్వం మరింత తీవ్రంగా కృషి చేయాలని టిల్లర్సన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ కాజా వీటిపై వివరణ ఇస్తూ.. ఉగ్రవాదులు 40 ఆఫ్ఘన్ భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నారని ఆయన అన్నారు. , -
అణుదాడి చేస్తాం
ఇస్లామాబాద్ : మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు అంటూ భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది. అలాగే ఐఎస్ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్ వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్‌లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని’ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా ప్రకటనపై పాక్ ప్రతిస్పందించింది. మేం తల్చుకుంటే భారత్‌లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్ నిలబడలేదని హెచ్చరించారు. సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ ఒకటని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్ ఖండించారు. అసలు అమెరికాలోని గన్ లాబీసంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్‌వేగాస్ ఘటనే నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్ లాబీనే కారణమని ఆసిఫ్ అన్నారు. -
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్టు అని, భారత ప్రజలు ఓ ఉగ్రవాదిని తమ దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ అని, అది రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)కు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని స్థానిక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. గుజరాత్ అల్లర్లలో మోదీ ముస్లింల రక్తం కళ్ల చూశారని విమర్శించారు. భారత్‌లో గోవధ పేరుతో ముస్లింలు, దళితులను హతమారుస్తున్నారని ఆరోపించారు. వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలను ఉగ్రవాదులతో పోల్చి వారి దిష్టిబొమ్మలను తగలబెట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఖండించారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి చెబుతున్నారనే కారణంతో మోదీపై తమ అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు. -
ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆసిఫ్ ఈ విధంగా తిప్పికొట్టారు. సోమవారం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఉగ్రవాదన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్ ఆరోపించిందని, కానీ వారి దేశం భారత్ ఓ ఉగ్రవాది చేతిలోనే నడుస్తుందన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని, మోదీ గుజరాత్లో ముస్లింల రక్తం కళ్ల చూశాడని గుజరాత్ అల్లర్లను ఆసిఫ్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఆర్ఎస్సెస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మండిపడ్డారు. -
ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్
న్యూఢిల్లీ: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్ సమర్థించుకుంది. జాదవ్ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమనిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఒక్కటి కూడా చేయలేదని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసే శక్తుల విషయంలో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా జాదవ్ విషయంలో పాక్ మొండి వైఖరి స్పష్టమవుతోంది. ‘జాదవ్‌కు విధించిన ఉరి శిక్ష పూర్వాలోచనతో చేసిన పని భారత్ అంటోంది. కానీ, మేం మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించాం. నియమ నిబంధనలు పాటించాం. పాకిస్థాన్ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక కన్సెషన్ ఇవ్వబోదు. మా దేశ సార్వభౌమాధికారన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగంకలిగించాలనే చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటాం’ అని అసిఫ్ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. -
ఇదే మా హెచ్చరిక.. కుట్ర చేస్తే సహించం: పాక్
గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష విధించడాన్ని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ ఉరిశిక్ష హెచ్చరిక లాంటిందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని, వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ సైనికులు, ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ త్యాగాలు కోరుతున్నాయి’ అని అన్నారు. జాధవ్ బహిరంగంగా తన నేరాన్ని ఒప్పుకొన్నాడని, ఈ విషయాన్ని భారత్ లేవనెత్తితే.. పాకిస్థాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన చెప్పారు. కల్లోలిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పేర్కొంది. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.