India-Pak tensions
-
‘పాక్‌పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’
ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్ విషయంలో పాకిస్తాన్ మరో స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది. పాక్ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. -
భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్థాన్ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్‌కు బుద్ధి చెప్పాం పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
ఆర్థికవ్యవస్థపై దాడుల ప్రభావం తక్కువే
భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాందోళనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపడేశారు. ఆర్థికపరంగా అంత పెద్దమొత్తంలో మార్పులు సంభవించవని, స్వల్పంగా మాత్రమే ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో మార్కెట్లు, రూపాయిలో వస్తున్న మార్పులు కేవలం తాత్కాలికమేనని తెలిపారు. భారత్‌లో పెట్టే విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని పేర్కొన్నారు. టొరంటోస్ రోట్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగించారు. ఉడి ఉగ్రదాడి అనంతరం పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన నిర్దేశిత దాడులతో మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. బ్రెగ్జిట్ పరిమాణాల అనంతరం రూపాయి ఈ మేర పడిపోవడం ఇదే మొదటిసారి. సరిహద్దు ప్రకంపనాలతో యుద్ధవాతావరణం నెలకొంటుందనే టెన్షన్‌తో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. వాణిజ్య పరంగా రెండు దేశాల మధ్య ఆటంకాలు రావొచ్చని ఆందోళనలు ఎగిశాయి. ఈ భయాందోళలన్నింటినీ కొట్టిపారేస్తూ తాజా పరిస్థితుల్లో నెలకొన్న టెన్షన్ ప్రభావం మన ఆర్థికవ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. అది కూడా తాత్కాలికమేనన్నారు.