Chowdhury mv
-
టీడీపీ మెడకు...వీరముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా అదే పారీ్టకి చెందిన నేతలు, సానుభూతిపరుల పేర్లు వినిపిస్తుండటం అధికార టీడీపీని కలవరపెడుతోంది. హత్యలో పాల్గొన్నది, మొదలు వ్యూహరచన చేసింది అందరూ ఆ పార్టీ వారేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తమ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుమానితుడికి తెలుగుదేశం పార్టీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి, తాలూకా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న భవనంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ముసుగులు ధరించిన నలుగురు యువకులు కేవలం మూడు నిముషాల్లోనే ఆయన శరీరంలోకి 53 కత్తి పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన హంతకులు భూమి మీద ఉండడానికి అనర్హులని ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం చీమకుర్తి బైపాస్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక దాబా సమీపంలో హంతకులు వినియోగించిన స్కూటీ లభించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. కేసు కీలక మలుపు తిరిగింది. స్కూటీ ఆధారంగా చేసిన విచారణలో వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీ స్వా«దీనంతో లభించిన ఆధారాలతో నగరానికి చెందిన కొప్పోలు వాసి ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే రెండో వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకోవడంతో హత్యలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ జిల్లా వాసులుగానే గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతల్లో కలకలం... వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ యువనేతకు ఆ పారీ్టలోని ముఖ్య నాయకులందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. స్థానిక నాయకులతో పాటు జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యేలు, మంత్రులతో సదరు వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు ఎటుపోయి ఎటు వస్తుందో, చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనని కలత చెందుతున్నారు. అలాగే ప్రచారంలో ఉన్న హవాలా వ్యాపారికి, రేషన్ బియ్యం డాన్‌కు సైతం టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని ప్రచారం. అలాగే హత్యలో పాల్గొన్న ప్రధాన అనుమానితుడికి సైతం ఆ పారీ్టతో లింకులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరుకున పెడుతోంది.వీరయ్య కేసును ఏం చేస్తారు... వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితులు భూమి మీద ఉండేందుకు అర్హులు కారని చెప్పడం, నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టేది లేదనడంతో ఈ కేసు గురించి ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీకి చెందిన నాయకుడు కావడం, హత్యలో ప్రధాన అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్న యువనేత కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో ఇప్పుడీ కేసును ఏం చేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు నిందితులను కఠినంగా శిక్షిస్తారా? లేక క్రమంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారా? అనే అంశాలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మిగతా వారు కూడా అధికార పారీ్టకి చెందిన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అధికార పార్టీ స్థానిక నాయకులతో, రాష్ట్రంలోని కీలక నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు కావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.డైలమాలో పోలీసులు...వీరయ్య కేసులో పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. హత్య జరిగి దాదాపు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి హతుడు వీరయ్య చౌదరి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మద్యం సిండికేట్, బియ్యం మాఫియా, భూ, ఆర్థిక వివాదాలున్నాయి. అయినా ఆయన టీడీపీ నాయకుడు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పలు సవాళ్లు విసురుతోంది. విచారణలో అనుమానితులంతా టీడీపీ నాయకులే కావడంతో పాటు వారికి జిల్లా టీడీపీ నాయకులతో, మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్కూటీ లభించిన రోజు టీడీపీ మీడియా చానళ్లలో అధికార పార్టీ నేతల ప్రమేయాన్ని పేర్లతో సహా ప్రసారం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు రోజుకో పేరు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసు మరకలను ఇతర పారీ్టలకు అంటగట్టేలా ఆ పత్రికల్లో కథనాలు వస్తుండటంతో కేసు పక్కదోవ పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి కూడా పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా ఇతర పారీ్టలకు చెందిన వారి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కేఎస్ vs ఎంవీ
20న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు బరిలో కేఎస్ రామారావు, ఎంవీ చౌదరి బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ) కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 20న జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్రామారావుతో పాటు శ్రీమిత్ర రియల్టర్స్ అధినేత మేడికొండూరి వెంకటచౌదరి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ రెండు ప్యానెళ్లు హోరాహోరీగా పోటీ పడుతుండగా గెలుపు కోసం అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. క్లబ్లో అందరూ బడాబాబులు, సినీ దిగ్గజాలు ఉండటంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. క్లబ్లో మొత్తం 2100 మంది సభ్యులుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కె.రాఘవేందర్రావు, అల్లు అర్జున్, రాంచరణ్‌తేజ్, శ్రీకాంత్, మోహన్‌బాబు, మంచు విష్ణు, దాసరి నారాయణరావు, వెంకటేష్, మహేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి రానా, కోట శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, బి.గోపాల్, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, వైవి.రెడ్డి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి బాబు, ఎంపీ మురళీమోహన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. కేఎస్ రామారావు ప్యానెల్ కె.ఎస్.రామారావు అధ్యక్షుడిగానే పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేవీ.రావు, కార్యదర్శిగా బి. రాజశేఖర్‌రెడ్డి,కోశాధికారిగా సిహెచ్.శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శిగా తుమ్మల రంగారావు, కార్యవర్గ సభ్యులుగా రవీంద్రనాథ్, రఘునందన్‌రెడ్డి,సూర్యనారాయణరాజు, మదన్మోహన్ రావు ఉన్నారు. ఎంవీ చౌదరి ప్యానెల్ ఎంవీ.చౌదరి అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగా ఉపాధ్యక్షుడిగా నందమూరి తారకరత్న, సెక్రటరీగా యలమంచిలి సురేష్‌కుమార్, కోశాధికారిగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా జితేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సురేష్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి,భూపాల్వర్మ,శ్రీనివాస్‌రావు ఉన్నారు.