Arjun S/O Vyjayanthi Movie
-
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా సినిమా రిలీజ్ నుంచి ఈరోజు వరకు ఎంతో మంది మహిళలు ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని, తల్లీ కొడుకు మధ్య భావోద్వేగాలు కట్టిపడేశాయని చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఓ మంచి చిత్రం చేశాననే సంతృప్తి నాకు, మా యూనిట్‌కి కలిగింది’’ అని నటి విజయశాంతి చెప్పారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు. → ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత కొన్ని తెలుగు, తమిళ కథలు విన్నాను. కానీ, ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. ప్రదీప్ చిలుకూరిగారు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చెప్పినప్పుడు తల్లి, కొడుకు మధ్య భావోద్వేగాలు నన్ను బాగా ఎగ్జయిట్ చేయడంతో వెంటనే ఓకే చెప్పాను. → పోలీస్‌గా, తల్లిగా చాలా విరామం తర్వాత ఒక పవర్ఫుల్ పాత్ర చేశాను. ప్రజలు రాములమ్మని (విజయశాంతి) ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్‌ఫిల్ అయ్యింది. ఈ సినిమాలో బురద సన్నివేశం చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్ పాటించాను. అలాగే పాత్ర కోసం నిరంతరం వ్యాయామం చేశాను. ఇప్పుడు యాక్షన్ చేయడం అనేది ఒక రకంగా నాకు సవాల్‌తో కూడుకున్నదైనా చేశాను. → యాక్షన్, పెర్ఫార్మెన్స్ని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వారు అభినందిస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో తల్లి, కొడుకుగా నాకు, కల్యాణ్ రామ్‌కి మంచి అనుబంధం ఏర్పడింది.→ నా కెరీర్ మొదట్నుంచీ నా ట్రాక్ సెపరేట్. ‘ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్లాం’... ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఇన్ని రక రకాల పాత్రలు చేయడం నాకు కుదిరింది. అది దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తా. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించాను... ఆశీర్వదించి సింహాసనంపై కూర్చోబెట్టారు. ‘ప్రతిఘటన’ సినిమా తర్వాత లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల నుంచే వచ్చింది. అలాగే ‘లేడీ జాకీ చాన్, లేడీ అమితాబ్’ ఇలా పిలిచారు. నేటి తరం యువత కూడా నన్ను రాములమ్మ అని పిలుస్తుంటే ఆశ్చర్యపోతుంటాను. మీ డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్‌ని మేం స్ఫూర్తిగా తీసుకుంటున్నామని వారు చెప్పినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. → హీరోయిన్లను మీరు అనండి: ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు, వీడియోలు చూశాను. కొంతమంది మీడియా మిత్రులు హీరోలను మీరు అని, హీరోయిన్లను మాత్రం నువ్వు అని సంబోధిస్తున్నారు. అలా అగౌరవంగా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్? నందమూరి తారక రామారావుగారిలాంటి స్టార్ హీరో ఆయన మనవరాలి వయసున్న నన్ను సెట్స్‌లో మీరు అని మాట్లాడేవారు. అది మన సంస్కారం. తెలుగు వారు కానీ, ఏ ్ర΄ాంతం నుంచి వచ్చిన హీరోయిన్లను అయినా కానీ మీరు అని సంబోధించండి. -
కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? కొందరు నయనతార అంటారు. మరికొందరు సమంత లేదా సాయిపల్లవి పేరు చెబుతుంటారు. వీళ్లందరూ కాదు ఈ ట్యాగ్ ని మొట్టమొదట హీరోయిన్ విజయశాంతి కోసం ఉపయోగించారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్లకు దీన్ని ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడదే విషయమై విజయశాంతిని అడగ్గా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'నాకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్.. 'ప్రతిఘటన' మూవీ తర్వాత ప్రజలు ఇచ్చారు. నేను యాక్టివ్ గా లేనప్పుడు కొంతమంది హీరోయిన్లు ఆ ట్యాగ్ తీసుకున్నారు. పాపం వాళ్లు కూడా బ్రతకాలి కదా అని పెద్దగా పట్టించుకోలేదు' అని విజయశాంతి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది వచ్చిన ఐదేళ్లకు తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. తన పాత్రకు వస్తున్న ఆదరణ దృష్ట్యా.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడారు.ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హీరోలని మీరు అని సంభోదిస్తున్నారని కానీ హీరోయిన్లని మాత్రం ఇండస్ట్రీలో నువ్వు అని అంటున్నారని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని విజయశాంతి చెప్పుకొచ్చారు. దయచేసి ఇకపై హీరోయిన్లని కూడా మీరు అనే సంభోదించాలని కోరారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ తనని మీరు అంటూ పిలిచేవారని, అది చూసి తను ఆశ్చర్యపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో మళ్లీ ఫుల్ బిజీ అయ్యారు విజయశాంతి(Vijayashanti). ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా విలేకరులతో ముచ్చటిస్తూ.. మీడియాకు ఓ చిన్న రిక్వెస్ట్ చేసింది. ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను ‘నువ్వు’ అని కాకుండా ‘మీరు’ అని సంభోదించాలని కోరారు.‘సినిమాలకు దూరంగా ఉన్నా.. నేను అన్ని ఫాలో అవుతుంటాను. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు చూస్తుంటాను. ఇక్కడ మీకు(మీడియా) ఓ మాట చెబుతాను తప్పుగా తీసుకోకండి. మీరు(మీడియా) ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను కూడా ‘మీరు’ అని పిలవండి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ హీరోయిన్ని అయినా మీరు అనే పిలిస్తే వాళ్లను గౌరవించినట్లు ఉంటుంది. (చదవండి: కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి)హీరోని మీరంతా అలానే పిలుస్తారు కదా.. మరి హీరోయిన్ని నువ్వు అని ఎందుకు అంటారు? చదువుకున్న మనం వాళ్లకు గౌరవం ఇవ్వాలి. ముంబై, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు మన టాలీవుడ్‌కి వస్తున్నారు. వారందరిని ‘మీరు’ అని గౌరవిస్తే.. మన గొప్పదనం తెలుస్తుంది. నేను కూడా అందరిని మీరు అనే పిలుస్తాను. ఇది నేను ఎన్టీరామారావు దగ్గర నుంచి నేర్చుకున్నాను. సత్యంశివం సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఆయన మీరు అనే సంభోదించేవారు. ఆయన మనవరాలి వయసు ఉన్న నన్ను కూడా మీరు అని పిలవడం చూసి ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆయనలాగే అందరిని మీరు అని గౌరవించాలకున్నాను.నేను అదే ఫాలో అవుతున్నాను. మీడియా సోదరులు చాలా మంచోళ్లు.. చాలా కష్టపడతారు. హీరోయిన్లను మీరు గౌరవిస్తే.. వాళ్లు కూడా మీతో గౌరవంగా మాట్లాడతారు. నేను చెప్పేది తప్పుగా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే’అని విజయశాంతి అన్నారు. -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రెండు రోజుల కలెక్షన్
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి తల్లికొడుకుగా నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi). రీసెంట్ గా ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ రొటీన్ గా ఉండటంతో మిశ్రమ స్పందన వచ్చింది. అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా స్టడీగానే ఉన్నాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?(Movie Day 2 Collection) బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ కి సరైన హిట్ పడలేదు. దీంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్ రాలేదు. తొలిరోజు రూ.5.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రెండో రోజుకి కాస్త డ్రాప్ కనిపించింది. దీంతో రెండో రోజు కేవలం రూ.3.40 కోట్ల మాత్రమే వచ్చాయి.(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్)మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ.8.55 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. వీకెండ్ దాటిన తర్వాత సినిమా నిలబడితే బ్రేక్ ఈవెన్ దాటొచ్చు. కల్యాణ్ రామ్ మాత్రం శనివారం జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. మంగళవారం కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?కథ విషయానికొస్తే.. పోలీసాఫీసర్ వైజయంతి. ఆమె కొడుకు అర్జున్. ఓ క్రిమినల్ తన తండ్రిని చంపేశాడని అర్జున్ పగతో రగిలిపోతుంటాడు. తల్లి మాత్రం న్యాయబద్ధంగానే అతడిని శిక్షిద్దామని అంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో అర్జున్.. సదరు హంతకుడిని చంపేస్తాడు. అలా అర్జున్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు పఠాన్ అనే క్రిమినల్ వైజయంతిని చంపాలని చూస్తుంటాడు. మరి తల్లి కొడుకు కలిశారా? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?) -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'యానిమల్', 'జాట్'లో నా సీన్స్ కట్ చేశారు: పృథ్వీ
కొన్ని సినిమాలు కొందరు నటుల కెరీర్ ని మార్చేస్తుంటాయి. టాలీవుడ్ లో ఇలాంటి యాక్టర్స్ చాలామందే ఉంటారు. అందులో పృథ్వీ ఒకడు. అప్పుడెప్పుడో తెలుగులో పలు మూవీస్ చేశాడు. తర్వాత పూర్తిగా సైడ్ అయిపోయాడు. మళ్లీ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్'తో కమ్ బ్యాక్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ విలన్ గా ఆకట్టుకున్న పృథ్వీ.. తెలుగుతో పాటు పరభాష చిత్రాల్లో నటిస్తున్నాడు. 'సంక్రాంతికి వస్తున్నాం', 'తండేల్', 'జాట్'తో పాటు రీసెంట్ గా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో నటించాడు. తాజాగా ఈచిత్ర సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'యానిమల్, జాట్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్స్. అందులో నేను నటించిన కొన్ని సీన్స్ తీసేశారు. కానీ ఈ సినిమాలో (అర్జున్ సన్నాఫ్ వైజయంతి)నేను నటించిన ప్రతి సీన్ అలానే ఉంచారు. ఓ నటుడికి సంతృప్తి ఇచ్చే విషయం ఇది' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు) -
సినిమాను ఖూనీ చేద్దామని దుష్టశక్తుల ప్రయత్నం.. విజయశాంతి వార్నింగ్
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. మిశ్రమ స్పందన మధ్య సినిమా తొలిరోజు దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా మంగళవారం లోపు తిరిగి వచ్చేస్తుందని కళ్యాణ్ రామ్ ధీమాగా ఉన్నాడు. అయితే విజయశాంతి మాత్రం సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే మా హెచ్చరిక..శనివారం ఏర్పాటు చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్లో విజయశాంతి (Vijayashanthi) మాట్లాడుతూ.. సినిమాను ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక.. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలి. కొంత మంది కావాలనే శాడిజంతో సినిమాల్ని ఇబ్బండిపెడుతున్నారు. ప్రతి ఒక్క మూవీ ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగోలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి.సినీ ఇండస్ట్రీని బతికించండిసినిమా నచ్చలేదని.. ఖూనీ చేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రజలు మా మూవీ చూసి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి.. అంతేకానీ మంచి చిత్రాలను చంపే హక్కు మీకు లేదు. సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు అని విజయశాంతి పేర్కొంది.చదవండి: నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు.. -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మూవీని తెరకెక్కించాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు.బింబిసార సినిమా తర్వాత కల్యాణ్‌రామ్ మరో రెండు చిత్రాలు చేశారు. కానీ, వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వినిపిస్తుంది. దీంతో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్లు రాబట్టింది. బింబిసార ఫస్ట్ డే నాడు రూ. 6.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఏ రెండు సినిమాలు కూడా మొదటిరోజు రూ. 5 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇప్పుడు రూ. 5.15 కోట్లు రాబట్టి ఆ లోటును భర్తి చేసింది.ఈ సినిమాకు ప్రధాన బలయం విజయశాంతి, కల్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్మురేపారు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది. -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున్ సన్నాఫ్ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్,పృథ్వి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సాసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్విడుదల: ఏప్రిల్ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసేంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన అర్జున్ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్ మాఫీయా అర్జున్ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్ కమీషనర్‌గా శ్రీకాంత్ రావడంతో కథలో స్పీడ్ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్ కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్ చేసిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) నేడు (ఏప్రిల్ 18) విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్లో బొమ్మ పడింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చాటి చెప్పేలా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.ఓవర్సీస్లో ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్టాఫ్ పూర్తి అయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్ పోటీపడి నటించారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ స్టోరీగా సినిమా ఉందంటున్నారు.. అయితే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించాయని తెలుపుతున్నారు. ఫస్టాఫ్ వరకు కథాంశంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన మలుపులు వంటివి లేవని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటి స్టోరీస్‌తో చాలా సినిమాలు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రానికి దగ్గరగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి స్టోరీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్స్‌లో కల్యాణ్‌రామ్, విలన్ల మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్ అదుర్స్‌లా ఉంటుందని ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అయితే, ఫస్టాఫ్ పూర్తి అయింద పెద్దగా కొత్తదనం ఏమీ లేదంటున్నారు. కానీ, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం ఎంతమాత్రం నిరాశపరచదని ఎక్కువమంది చెప్పడం విశేషం.ఇక ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కొడుకు కోసం తల్లి పడే ఆరాటం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. అదే సమయంలో అమ్మ కోసం కొడుకు చేసే పోరాటాన్ని కూడా ఇందులో చూస్తారని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ రొటీన్‌గా సాగడం.. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మరీ ఎక్కువగా సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్ అని పేర్కొంటున్నారు. పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ లేకున్నా తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించారని నెటిజన్లు తెలుపుతున్నారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పినట్లు క్లైమాక్స్ సీన్‌కు చాలామంది ఎమోషనల్ అవుతారని తెలుపుతున్నారు. సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం ఇంకాస్త సమయం పడుతుంది. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమేBlockbuster reports for overseas Plus: pointsBest emotional 👍mass action 👌👌Peak climax💯🔥🔥Excellent bgm score💥💥Kalyanram come back 💯#ArjunSonOfVyjayanthi pic.twitter.com/V0W2IV0Bk3— Tarak cults 👑🐯🐅 (@gopiraju1993) April 18, 2025Just done with first half of #ArjunSonOfVyjayanthiUsual Formula or just an extended Janata Garage concept. Works fine in places. Visuals and Music are decent though songs didn’t catch on. Camera work is patchy, doesn’t look great with actors close up shots.Good to see… pic.twitter.com/7wJX8mtIxr— Majid (@iammajidzz) April 18, 2025Blockbuster talk from early shows 🔥@NANDAMURIKALYAN nailed it. Peak performance.Congratulations #ArjunSonOfVyjayanthi whole teampic.twitter.com/y3bxQSbEC3— Amaravati_Techie (@Amaravati_IT) April 18, 2025Just now watched the movies first half good and second half is excellent emotions worked very well Blockbuster movie 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #ArjunSonOfVyjayanthi pic.twitter.com/YjO96lB3bW— CMTarakMainFanPage🌐 (@tarakdevote9998) April 18, 2025#ArjunSonOfVyjayanthi Strictly Average 1st Half! Starts off with an interesting mother-son setup and has a few engaging sequences but quickly turns into a run of the mill and template commercial film. Music/BGM is a big drawback and fails to elevate the proceedings. Needs a…— Venky Reviews (@venkyreviews) April 18, 2025 -
మా అంచనాలకు మించి అద్భుతంగా వచ్చింది: సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో కల్యాణ్ రామ్, విజయశాంతిగార్ల పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. నటన పరంగానూ సమానంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫోన్ కూడా చూడరు. తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఫైనల్ ఔట్పుట్ చూసుకున్నాక మా అంచనాలకు మించి ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందనిపించింది’’ అని నిర్మాతలు సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా చెప్పారు.కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీల్, అశోక్‌వర్ధన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్‌గారు ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ చిత్రం చేయాలని ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ సిద్ధం చేయించాం. ఆయన తల్లి పాత్రకి విజయశాంతిగారినే అనుకున్నాం. ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. ఎక్కువ భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రదీప్ బాగా తెరకెక్కించారు. ఈ కథని నమ్మి బాగా ఖర్చు పెట్టాం. మేం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మా సినిమా చూసిన ఎన్టీఆర్‌గారు ఎమోషనల్ అయ్యారు. అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఏ నిర్మాత అయినా థియేటర్స్ వసూళ్లనే నమ్ముకుని సినిమా తీయాలి. అంతేకానీ, ఓటీటీ, శాటిలైట్ హక్కులు వంటి డిజిటల్ బిజినెస్‌పై ఆధా రపడకూడదు. మరో సినిమా నిర్మించ డానికి కథలు విన్నాం’’ అన్నారు. -
భావోద్వేగాలే నా బలం: ప్రదీప్ చిలుకూరి
‘‘చిన్నతనంలో మన బర్త్ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్ ఫిల్మ్ చేద్దామన్నారు. ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.యూపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే కొడుకు అర్జున్స్ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్ సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్ లోకనాథ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్ చేయడమే నా బలం’’ అని తెలిపారు. -
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నేను, అన్న నిల్చున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా గొప్పదనం సాధించలేదు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతదేశవ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు, పాత్రలు చేసిన మరో నటి ఇండియాలోనే లేదు. ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఐడియాతోనే ఈ కథ పుట్టినట్టు ఉంది' అని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. -
అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..
అన్న కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కోసం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎప్పుడూ అండగా ఉంటాడు. కల్యాణ్ రామ్ నటించిన పలు సినిమాల ఈవెంట్లకు తారక్ స్పెషల్ గెస్టుగా వెళ్లాడు. తాజాగా మరోసారి అన్న కోసం తమ్ముడు కదిలాడు. కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ (Arjun S/o Vyjayanthi Pre Release Event) శనివారం (ఏప్రిల్ 12) జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.విజయశాంతిని మాట్లాడనివ్వని ఫ్యాన్స్అతడిని చూసిన అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలతో కార్యక్రమం దద్దరిల్లేలా చేశారు. అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండటంతో తారక్‌కు కోపమొచ్చింది. విజయశాంతి మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ అభిమానులు కేకలేశారు. సీఎం.. సీఎం.. అని నినదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు.తారక్ ఆగ్రహంఒక్క నిమిషం సైలెంట్‌గా ఉంటే మాట్లాడతాను అని విజయశాంతి అభ్యర్థించినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో తారక్‌కు కోపమొచ్చింది. మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్లిపోతాను అంటూ సైగ చేశారు. దీంతో విజయశాంతి ఆయన్ను వెళ్లకుండా ఆపింది. మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది. కట్రోల్ చేయలేకపోతున్నాం అంటూనే తన స్పీచ్ కొనసాగింది. సినిమాఅర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. కల్యాణ్ రామ్‌కు జంటగా సాయి మంజ్రేకర్ నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.చదవండి: తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి? -
Arjun Son of Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
చివరి ఇరవై నిమిషాలు కన్నీళ్లు ఆపుకోలేకపోయా: హీరో ఎన్టీఆర్
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో విజయశాంతిగారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు. 18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్‌గారు. సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే. దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు. బహుశా అది విజయశాంతిగారు కాకుండా వేరే వారు అయ్యుంటే ఆయన అంత అద్భుతంగా చేసేవారో కాదో నాకు తెలీదు. ఆమెను ఓ తల్లిగా నమ్మారు కాబట్టి అంత అద్భతంగా నటించారు. ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరూ ముందుగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు) కూడా మిమ్మల్ని అలరిస్తుంది. పక్కాగా ప్లాన్ చేసి ఈ ఏడాది మిమ్మల్ని అందర్నీ తప్పకుండా కలుస్తాను’’ అని చెప్పారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘మీరు చాలా సినిమాలు చూస్తారు. మేం కూడా చేస్తాం. సినిమా అయ్యాక పార్కింగ్‌కి వెళ్లి బైక్, కార్ స్టార్ట్ చేసుకోగానే సినిమాని మర్చిపోతాం. కానీ, చాలా అరుదుగా నటులుగా మాకు గానీ, ప్రేక్షకులుగా మీకు గానీ కొన్ని సినిమాలు ఇంటికెళ్లేదాకా మనసుని హత్తుకుంటాయి. అలాంటి సినిమా మా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఎన్టీ రామారావుగారు ఓ డిక్షనరీ. ఆయనలో కొంత వచ్చినా ఎవరైనా గొప్ప నటీనటులు అయిపోతారు. ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం నా అదృష్టం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెట్స్‌లో నేను అనుకున్నదానికంటే అద్భుతంగా, చాలా సౌకర్యంగా చూసుకున్నాడు కల్యాణ్ బాబు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి, సూపర్ హిట్ అని చెప్పాలి’’ అని అన్నారు. ఈ వేడుకలో కెమేరామేన్ రాంప్రసాద్, నటులు జోగినాయుడు, సందీప్, రచయిత శ్రీకాంత్ విస్సా, ్ర΄÷డక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, రచయిత రఘురామ్ పాల్గొన్నారు. -
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
'దేవర' కోసం లెక్క ప్రకారం ఎన్టీఆర్(NTR) రావాలి. కానీ ఆ రోజు అభిమానుల తాకిడి వల్ల ఈవెంట్ జరగలేదు. దీంతో తారక్ మరో ఫంక్షన్ వచ్చే అవకాశం చాన్నాళ్ల తర్వాత మొన్న జరిగింది. ఇప్పుడు మరోసారి తన సోదరుడు కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైదరాబాద్ లో జరిగిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నయ్య కల్యాణ్ రామ్ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలానే విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాన్న లోటు లేనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు.ఈ ఆగస్టు 14న తాను నటించిన 'వార్ 2'(War 2 Movie) విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. మళ్లీ ఎప్పుడు కనబడతానో లేదో.. ఓసారి తనివితీరా మాట్లాడనివ్వండి అని అభిమానులని ఉద్దేశించి ఇదే ఈవెంట్ లో మాట్లాడాడు. దీనిబట్టి చూస్తుంటే 'వార్ 2' కోసం తప్పితే ఈ మధ్యలో ఎక్కడా తారక్ కనిపించడనమాట.(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ రిలీజ్) -
ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి తల్లికొడుకుగా నటించిన కొత్త సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie). ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ట్రైలర్ విషయానికొస్తే.. స్టోరీ ఏంటనేది విడమరిచి చెప్పేశారు. వైజాగ్ లో అర్జున్ అనే రౌడీ. తల్లి వైజయంతి ఏమో ఐపీఎస్. పెంపకం విషయమై తల్లికొడుకు మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో మాటలు ఉండవు. మరోవైపు విలన్ కి అర్జున్ తో గొడవ. దీంతో ఇతడి తల్లిని ఇబ్బంది పెడతారు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.విజువల్స్, తల్లి కొడుకు ఎమోషన్స్, ఫైట్స్.. ఇవన్నీ ట్రైలర్ వరకు బాగానే ఉన్నాయి. మరి మూవీలో ఎమోషన్స్ ని ఎంతవరకు వర్కౌట్ చేస్తారు, ఏంటనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కల్యాణ్ రామ్ అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్) -
ముచ్చటగా బంధాలే...
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ముచ్చటగా బంధాలే ఇచ్చటనే కలిశాయే...’ అంటూ సాగే రెండో పాటని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్ తల్లి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమా కోసం నిజాయతీగా చాలా కష్టపడ్డాం... చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ నెల 12న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తమ్ముడు (ఎన్టీఆర్) వస్తాడు’’ అన్నారు.