నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా మెదక్ లోనే చెరుకు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్ క్రషింగ్ సెంటర్ లో లక్ష టన్నుల చెరుకును ఏం చేస్తారో ప్రభుత్వమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతులకు రూ.13 కోట్ల బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.