గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతమైన ఎర్రబాలెంలో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ముఖాముఖి నిర్వహించారు.
గుంటూరు : గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతమైన ఎర్రబాలెంలో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్యాకేజీలను అంగీకరించేది లేదని ఈ సందర్భంగా ఎర్రబాలెం రైతులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎప్పుడో ఏదో ఇస్తుందని పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టుకోలేమన్నారు. భూములిచ్చే ప్రసక్తేలేదని ముక్త కంఠంతో చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు తమకొద్దని బేతపూడికి చెందిన ఓ మహిళ రైతు.... పవన్‌కల్యాణ్‌కి స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ పేరుతో.... ప్రభుత్వ అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరును ఆమె వివరించింది. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా బేతపూడి గ్రామంలో....పవన్ కల్యాణ్ రైతులతో మాట్లాడారు. వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కోసం మహిళా రైతు తెచ్చిన పెరుగన్నాన్ని....రుచి చూశారు.