స్కూల్కు ఫోన్ తెచ్చిందని మందలింపు..ఆత్మహత్య
► ఎర్రగడ్డ నందానగర్ లో విషాదం
► ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ నందానగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కు సెల్ఫోన్ తీసుకువచ్చిందని ఉపాధ్యాయులు మందలించడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే నందానగర్ బస్తీకి చెందిన రవళిక(13) సెయింట్ జూడ్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఓ రోజు విద్యార్థిని పాఠశాలకు సెల్ఫోన్ తీసుకెళ్లింది. ఇది గుర్తించిన పాఠశాల యాజమాన్యం రవిళికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.