breaking news
Hindu traditions
-
ప్రపంచాన్నీ ఆకట్టుకున్న ‘నమస్తే’! ఆంతర్యం ఏంటో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తిని కలవగానే ముందుగా చేసే పని ‘నమస్కారం’. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమైన గౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక. గుడిలో భగవంతుడిని దర్శించుకున్నా, ఇంట్లో పెద్దలను కలిసినా రెండు చేతులు జోడించి నమస్కరించడం మన ఆనవాయితీ. అసలు ఇలా రెండు చేతులూ ఎందుకు జోడించాలి..? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..‘నమస్తే’ అనే పదంలో దాగిన ఆంతర్యం..సంస్కృత పదాలైన ‘నమః‘, ‘తే’ కలయికతో ‘నమస్తే’ ఏర్పడింది. ‘నమః’ అంటే నాలోని అహంకారాన్ని వదిలిపెట్టడం, ‘తే‘ అంటే మీకు. అంటే.. ‘నా అహాన్ని విడిచిపెట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను‘ అని అర్థం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తికి నమస్కరించడం ద్వారా, వారిలో కొలువై ఉన్న పరమాత్మను స్మరించుకుంటున్నామని మన శాస్త్రాలు చెబుతున్నాయి.రెండు చేతులు ఎందుకు జోడించాలి..?ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కుడి చేయి సానుకూల సూర్య శక్తికి, ఎడమ చేయి గ్రహించే చంద్ర శక్తికి ప్రతీకలు. ఈ రెండు చేతులను ఏకం చేసినప్పుడు శరీరంలోని నాడులు సమతుల్యమై, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. చేతులు జోడించే భంగిమ ఎదుటివారి పట్ల మనకు ఉన్న వినమ్రతను, శరణాగతి భావాన్ని సూచిస్తుంది. ఇది బంధాల్లో ఆత్మీయతను పెంచుతుంది.నమస్కరించే సరైన విధానం..శాస్త్రాల ప్రకారం, రెండు చేతులను ఛాతీకి దగ్గరగా ఉంచి, తలను కొద్దిగా వంచి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనసులో వినయం ఇనుమడిస్తుంది. దేవుడికి లేదా వయసులో పెద్దవారికి నమస్కరించేటప్పుడు కళ్లు మూసుకుని భక్తి శ్రద్ధలతో ప్రణామం చేయడం అత్యంత మంగళకరం.నమస్కారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు..నమస్కారం చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. రెండు చేతుల వేళ్ల చివర్లు ఒకదానికొకటి తాకినప్పుడు చేతుల్లోని ఒత్తిడి బిందువులు ఉత్తేజితం అవుతాయి. అలా ఆక్యుప్రెషర్.. జరిగి నేరుగా కళ్లు, చెవులు, మెదడుకు అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల నమస్కరించిన వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.నమస్కారంలో ఎలాంటి భౌతిక స్పర్శ ఉండదు కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా నమస్కారానికి ఎంతో గుర్తింపు ఉంది. నేడు యోగాతో పాటు భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణ వల్ల, విదేశీయులు సైతం భౌతిక దూరం పాటిస్తూనే గౌరవాన్ని వ్యక్తం చేసే ఈ ‘నమస్తే’ సంప్రదాయాన్ని ఎంతో ఆసక్తిగా, భక్తితో పాటిస్తున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం..– పసుపులేటి శ్రీలక్ష్మినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
మన సంప్రదాయాలకు అమెరికా అమ్మాయి ఫిదా
సాక్షి, మంగళూరు : హిందూ మత సంప్రదాయలకు ఫిదా అయిన అమెరికా అమ్మాయి కన్నడ యువకుడిని వివాహం చేసుకుంది. కన్నడ యవకుడు, అమెరికా అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలపట్ల అమితంగా ఆకర్షితురాలైన ఆమె హిందూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేకుంది. ఈ సంఘటన మంగుళూరులో బుధవారం చోటుచేసుకుంది. మంగళూరులోని పుత్తూరు ప్రాంతానికి చెందిన విక్రమ్ కామత్ అమెరికా అమ్మాయి కరోలిన్ మార్గరేట్ రోవ్లిని వివాహం చేసుకున్నాడు. విక్రమ్ కామత్ అమెరికలో ఉన్న ప్రవేట్ కంపెనిలో డెరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇదే కంపెనిలో విధులు నిర్వహిస్తున్న కరోలిన్ మార్గరేట్ ఇద్దరు మొదట మంచి స్నేహితులుగా ఉంటూ అనంతరం ఇద్దరు ప్రేమించుకున్నారు. హిందూ సాంప్రదాయం అంటె ఇష్టమున్న కరోలిన్ ఇక్కడ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో మంగళూరుకు వచ్చిన ఇద్దరు పుత్తూరులోని కళ్లారేలో ఉన్న రఘువంశ నివాసంలో బుధవారం హిందూ సాంప్రదాయ పద్దతిలో కన్నడ అబ్బాయి, అమెరికా అమ్మాయి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు కరోలిన్‌ను పుత్తూరుకు చెందిన గోపీకృష్ణ శణై, రాధిక శణై అనే దంపతులు దత్తత తీసుకుని అనంతరం ఈ దంపతులు కన్యాదానం చేసి పెళ్ళి జరిపించారు. ఈ నూతన దంపతుల వివాహ వేడుకలను, వివిద ధార్మిక కార్యక్రమాలను వేదమూర్తి దివాకర్ భట్ సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. ఈ పెళ్ళి వేడుకలను పూర్తిగా అమెరికాలో ఉన్న కరోలిన్ తల్లిదండ్రులు విడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. ఈ హిందూ సాంప్రదాయ పెళ్ళి వేడుకల సందర్భగా కరోలిన్ పేరును విశాఖగా మార్చి నామకరణం చేశారు. దాంతో అమెరికా అమ్మాయి, కన్నడ అబ్బాయి ఇద్దరు హిందూ సాంప్రదాయ పద్దతిలో ఒక ఇంటివారు అయ్యారు. -
హిందూ ఆచారాలు మంటగలుపుతున్న బాబు
-
హిందూ ఆచారాలు మంటగలుపుతున్న బాబు
మైలలో ఉన్నప్పుడు తీసిన మట్టితో రాష్ట్రానికి అరిష్టం: ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్: ‘‘హిందూమత సంప్రదాయాలు, ఆచారాలను ముఖ్యమంత్రి మంటగలుపుతున్నారు. ఆయనకు దేవుడంటే భయమూ భక్తీ లేదు. అంతా నాటకమే. ఈనెల 8న చంద్రబాబు పెద్దనాన్న కుమారుడు మృతిచెందారు. దీంతో ‘అంటు’లో ఉన్న ఆయన సాక్షాత్తు టీటీడీ కల్యాణమండపంలో హోమాలు, పూజలు ఎలా చేస్తారు?’’ అని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అంటులో ఉన్న చంద్రబాబు తీసుకువచ్చే మట్టి, నీళ్ల వల్ల నూతన రాజధానికి అరిష్టం కలుగుతుందన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం తీరుపై ఆయన మండిపడ్డారు.


