breaking news
-
‘కేటీఆర్ అపరిచితుడిలా మాట్లాడుతున్నాడు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు సీఎల్పీ మధుసూదన్ రెడ్డి. తప్పు చేసింది మీరైతే.. విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టే బయటకు రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ మధుసూదన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ మాటల్లోనే డొల్లతనం బయటపడింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఒకలా.. నమోదు చేశాక అపరిచితుడులా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కేసు కొట్టేయాలంటూ కోర్టులకు వెళ్లి మరీ మొట్టికాయలు తిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నిన్న ఈడీ విచారణ సందర్బంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.ఈడీ వాళ్లు.. ఏసీబీ అడిగిందే అడుగుతున్నారు అని చెప్పారు. నేరం ఒక్కటే అయినప్పుడు ఇంకేం అడుగుతారు. కేటీఆర్‌కు చేయాల్సింది.. లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలి. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేసి.. విచారణకు సీఎంను రమ్మని అడుగుతారా?. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. బయటకు రావడం లేదు. మీ హయాంలో ప్రతిపక్షనేతల కేసులకు మీరు విచారణకు వెళ్ళారా?.కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసింది. మీ హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తున్నా నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
ఢిల్లీ గల్లీలో కొత్త నాటకం.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్(Congress) సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ.. అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం అంటూ విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి.. ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి?.. గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి?. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు?. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు?.రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ?. ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ?. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ?. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?. ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీలో ‘జిల్లా అధ్యక్ష లొల్లి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురూ అయ్యింది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్య కర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లా ల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయసేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై కేడర్ కొట్టుకుందని, బహిరంగంగానే విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయసేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొందరు అభిప్రాయ సేకరణ జరపకుండానే.. కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయసేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతోపాటు వారికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో కూర్చొని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో సమర్థులైన వారికి ఈ పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా (హైదరాబాద్ సెంట్రల్, మలక్‌పేట–భాగ్యనగర్, గోషామహల్– గోల్కొండ, మహంకాళి సికింద్రాబాద్) రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్, రూరల్ జిల్లాలు, ఇలా వివిధ జిల్లా శాఖలున్నాయి. -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్‌లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
ఈడీ విచారణకు వెళ్తున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
కేబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.‘త్వరలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు. కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు వస్తాయి’అని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. -
బీఆర్ఎస్ అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్(BRS Party) అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్(RSS) ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ(BJP) చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం.. సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు.(ఐడియాలాజికల్ డిఫరెన్సెస్) స్వాతంత్య్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని రేవంత్ అన్నారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అదని, మోహన్ భాగవత్ (ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్) అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని సీఎం వివరించారు.స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భాగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ అన్నారు. బీజేపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని, అందుకే తాము భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని సీఎం అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో!ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా? లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా? స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విషయంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు. -
రేపు ‘ఈడీ‘ ముందుకు కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) గురువారం(జనవరి16) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-e race case)లో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్‌పై ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని తెలపడంతో ఈడీ కేటీఆర్‌కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం(జనవరి 15) సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్‌కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి -
సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్‌లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్‌కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
ఢిల్లీకి సీఎం రేవంత్..మంత్రివర్గ విస్తరణపై ఫోకస్..!
సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(జనవరి14) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం,పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కాగా,ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది. సింగపూర్ పర్యటన తర్వాత ఈనెల 20 నుంచి 22 వరకు రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు.గతేడాది కొత్తగా సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంతత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంతత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఇటు కాంగగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
సాక్షి, కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్‌లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్(BRS) లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్, హరీష్‌రావు హౌస్ అరెస్ట్కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్‌రావులను హౌస్ అరెస్ట్ చేశారు.వన్ టౌన్లో మూడు, త్రీ టౌన్లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్‌రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్‌రెడ్డి నెట్టేశాడు. కౌశిక్‌రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్‌లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
కౌశిక్‌రెడ్డిVsసంజయ్‌కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు. అధికారిక లాంఛనాలతో.. మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రముఖుల సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా ప్రస్థానంనాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు.