breaking news
-
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్‌కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్‌రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
పింక్ బుక్‌లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. -
రైతుకో న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరొకటా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ప్రశ్నించారు. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అంటూ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ?రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..రుణమాఫీ చేయని రేవంత్ పై చూపించగలరా ?పేద రైతుకు ఒక న్యాయం..పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు..ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు !!జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ… pic.twitter.com/NzJlFk7zA9— KTR (@KTRBRS) February 13, 2025 -
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్‌కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్‌తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌ను నియమించడానికి హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లను ఏఐసీసీ మార్చనుంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్థానిక నేత అయిన దీపాదాస్ మున్షీకి పశ్చిమ బెంగాల్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్త ఇంఛార్జ్‌ను యమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.కాగా, గత వారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: Telangana: గీత దాటితే వేటే..! -
‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ పారిపోయారు’
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అదే వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని’ కవిత వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన ఇబ్బందులు.. రాహుల్ పర్యటన రద్దురాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
రేవంత్.. 12 రోజులు దాటినా జీతాలెక్కడ?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సీరియస్ కామెంట్స్ చేశారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో హోంగార్డుల జీతాల విషయమై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హరీష్..‘రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారు?. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు…— Harish Rao Thanneeru (@BRSHarish) February 12, 2025 -
పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్‌ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్‌తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తివైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
సడన్ టూర్.. నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్‌లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. -
రేవంత్.. దమ్ముంటే రాజీనామా చెయ్
సాక్షి, నాగర్‌కర్నూల్/నారాయణపేట: గత 14 నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం ఒక్క పని కూడా చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఎనుముల అన్నదమ్ముల కోసం, అల్లుడు, అదాని కోసం, బావమరిది, కుటుంబసభ్యుల కోసం దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ‘నీ నియోజకవర్గం నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తరో చూద్దాం. మేం బయటకు రాము. ఇంట్లోనే కూర్చుంటాం. మా సోదరుడు నరేందర్‌రెడ్డి కూడా బయటకు రాడు. మా పార్టీకి 50 వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల్లో ఉండను..’అని సవాల్ విసిరారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొంద పెట్టాలని ప్రజలు చూస్తున్నారని, రాష్ట్రం మొత్తం ఇదే ముఖచిత్రం ఉందని అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన ‘రైతు మహాధర్నా’లో కేటీఆర్ మాట్లాడారు. దుర్యోధనుడి తరహాలో పాలన ‘రాష్ట్రంలో గత ఏడాది కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన కౌరవుల రాజు దుర్యోధనుడి తరహాలో సాగుతోంది. ముఖ్యమంత్రి దుర్మార్గపు, అరాచక పాలనతో ఇక్కడి బిడ్డల పోరాటం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. దుర్యోధనుడు తన రాజ్యం నుంచి పాండవులను బయటకు పంపినట్టుగానే.. రేవంత్ కూడా కొడంగల్‌లోని గిరిజన ఆడ బిడ్డలను అవమానిస్తూ తండాల నుంచి జంగిల్‌కు ఉరికిచ్చారు. ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని జైలుకు పంపారు. కొడంగల్ ఆడబిడ్డలను గోసపెట్టిన రేవంత్‌ను చిత్తుగా ఓడించి ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు..’అని కేటీఆర్ చెప్పారు.రేవంత్ మోసం దేశమంతా తెలిసింది ‘సీఎం స్థాయిలో ఉండి కూడా అబద్ధాలు చెబుతారా? టకీ టకీమని డబ్బులు పడ్డాయంటే నిజమని అనుకున్నా కానీ రేవంత్ మోసం దేశమంతా తెలిసింది. రైతుబంధు, రుణమాఫీ, వరికి బోనస్, మహిళలకు రూ.2,500, తులం బంగారం, బాలికలకు స్కూటీలు.. ఎంత మందికి ఇచ్చారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా, తన కాంట్రాక్టర్ మంత్రి కోసం రూ.4,350 కోట్లతో కొత్త ప్రాజెక్టు తెస్తానంటూ మోసం చేస్తున్నారు. అల్లుడికి కట్నం కింద ఇచ్చేందుకు లగచర్ల, హకీంపేట భూములపై కన్నేశారు. ఎన్నికల సందర్భంగా అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. చికెన్ దావత్‌లు ఇస్తామని, పైసలు తీసుకోమని కాంగ్రెసోళ్లు వస్తారు..వారి దగ్గర పైసలు తీసుకుని కారు గుర్తుకే ఓటు వేయాలి..’అని కేటీఆర్ అన్నారు. కొడంగల్ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని మాట్లాడిన రేవంత్‌కు.. ఇక్కడి తాండూరు కందిపప్పునకు జియోలాజికల్ ఇండెక్స్ గుర్తింపు లభించిందని తెలియదా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.జ్యోతి–ప్రవీణ్ దంపతుల బిడ్డకు ‘భూమి’గా నామకరణం దుద్యాల్: కోస్గి మండల పరిధిలోని హకీంపేట మీదుగా కేటీఆర్ వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామ శివారు నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. లగచర్ల బాధిత రైతులను పరామర్శించిన కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతి, ప్రవీణ్ దంపతుల కుమార్తెకు భూమి అని నామకరణం చేశారు. తిరుగు ప్రయాణంలో పారిశ్రామికవాడఏర్పాటుతో కోల్పోతున్న భూములను పరిశీలించారు. -
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
నువు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్
సాక్షి,నారాయణపేటజిల్లా:ఏడాదిగా కొడంగల్‌లో దుర్యోధనుడి పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సోమవారం(ఫిబ్రవరి10) కోస్గిలో జరిగిన బీఆర్ఎస్ ‘రైతుదీక్ష’లో కేటీఆర్ మాట్లాడారు.‘ఇక్కడ కురుక్షేత్ర యుద్దం సాగుతోంది. 14 నెలలుగా రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడు.అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది. గిరిజనులు తలచుకుంటే రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మళ్లీ గెలవడు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి కొడంగల్‌లో పోటీ చేసి గెలువు.ఇక్కడ మా పార్టీ అభ్యర్దికి 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’అని కేటీఆర్ సవాల్ చేశారు.రైతుదీక్షలో కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రంలో 25 శాతం మంది రైతులకు కూడ రుణమాఫీ కాలేదుతమ హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు వేశాంఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 17 వేల 500 రూపాయలు బాకీ ఉందిఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొడంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్ది నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంఇక్కడి కంది రైతుల దాన్యం కొనుగోలు చేయలేని దుస్దితి నెలకొందిరాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్దాయిలో రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాలగచర్లలో భూములకు ఒక్కో ఎకరానికి నీవు ఇచ్చే 20 లక్షలకు అదనంగా పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం రేవంత్ రెడ్డి సొంత పొలాలు కంపెనీలకు ఇవ్వాలితెలంగాణలో ఎక్కడ రైతులకు,పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగినా మేం రక్షణగా ఉంటాంకొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కమీషన్ల కోసమే -
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్పొరేటర్లంతా పూర్తి సమయం కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, ప్రజలకు చేకూరే లబ్ధి, ప్రాజెక్టులు, నిధులను వివరించాలని కోరారు.జీహెచ్ఎంసీ మేయర్ పీఠం సాధిస్తే.. అనంతరం రాష్త్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీపై మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎలా వ్యవహరిస్తాయో చూసి.. దానికనుగుణంగా బీజేపీ వ్యూహం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలకలంబీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. -
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ‘చలో కామారెడ్డి’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కులగణన పేరుతో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘కామారెడ్డి డిక్లరేషన్’లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అక్కడే ‘చలో కామారెడ్డి’ పేరిట భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. సుమారు 500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో చలో కామారెడ్డి సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వారం రోజులపాటు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ సభకు అంతరాయం కలగకుండా చలో కామారెడ్డి సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గిలో రైతుల సభలో పాల్గొననున్నారు. కులగణన నివేదిక ఒక చిత్తు కాగితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. పార్టీ బీసీ నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసర్వే చేసి కులాలవారీగా కచ్చితమైన లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. కులగణన నివేదిక చిత్తుకాగితంతో సమానమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇండ్ల కేటాయింపులు, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని ఎంబీసీలు, బీసీలు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన సర్వేను చిత్తు కాగితంతో సమానమని తగులబెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. బిల్లు తేలేదు కానీ.. సొల్లు మాత్రం చెప్పారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల వారీగా ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. -
దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలు, హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు కలసి పోరాడాలన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’సదస్సులో ‘తెలంగాణ రైజింగ్, దక్షిణాది రాష్ట్రాలెందుకు కలసి పనిచేయాల’నే అంశాలపై ప్రసంగించారు. ‘‘ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కారణంగా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందుకు కేంద్ర పెద్దలు దక్షిణాదిని శిక్షిస్తున్నారా? కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన తోడ్పాటు ఇవ్వడం లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది..’’అని రేవంత్ ఆరోపించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణతెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని రేవంత్ చెప్పారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ జీడీపీని 2035 సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, మూసీ పునరుజ్జీవం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశానికి డేటా సెంటర్, పంప్డ్ స్టోరేజీ హబ్‌గా తెలంగాణ నిలవబోతోందన్నారు. దేశంలోని నాలుగు దిక్కులకు అనుసంధానమై దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణను దేశానికి లాజిస్టిక్ సెంటర్‌గా నిలపాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోందిసదస్సులో భాగంగా మాతృభూమి ఎడిటర్ మనోజ్.కె.దాస్‌తో పాటు పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే..⇒ ‘‘ఎన్నికల్లో జాతీయ నేతలను రంగంలోకి దింపితేనే పెద్ద మొత్తంలో ఓట్లు వస్తాయి. ‘రేవంత్‌రెడ్డికి ఓట్లేయండి’ అని అడిగితే.. ఆయన రెడ్డి, అగ్రకులం అంటారు. బీసీలు, ఎస్సీలంటూ రకరకాల విభేదాలు సృష్టిస్తారు. జాతీయ నాయకత్వం పేరు చెప్పి ఓట్లు అడిగితే ఈ భావనలు రావు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో అయినా బీజేపీ నరేంద్ర మోదీని చూపించే ఓట్లు అడుగుతుంది. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, మోదీకి ఏం సంబంధం? కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోందనేది నా పరిశీలన. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాలి. ⇒ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. దక్షిణాది ప్రజలు ఏవిధంగానైనా పోరాడేందుకు ఏకం కావాలి. తప్పనిసరైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా. ⇒ కేజ్రీవాల్ హరియాణాలో కాంగ్రెస్‌ను దెబ్బతీశారు. ఇది ఆయనకు ఢిల్లీ ఎన్నికల్లో ప్రతికూలమైంది. అంతిమంగా బీజేపీ లాభపడింది. ఈ విషయంలో ఇండియా కూటమి ఆలోచించాలి.⇒ జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నియోజకవర్గాలను పెంచాల్సి వస్తే ప్రస్తుతమున్న సీట్ల ప్రకారమే.. ప్రతి రాష్ట్రంలోనూ 50శాతం సీట్లు పెంచాలని ప్రధాని మోదీని కోరాను.⇒ ఒక దేశం–ఒక ఎన్నికను మేం అంగీకరించబోం. జాతీయ స్థాయి ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరు. రాష్ట్రాల ప్రాథమిక హక్కులను హరించలేరు. రాష్ట్రాలన్నింటినీ మోదీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలనుకుంటున్నారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అని రాజ్యాంగం నిర్ణయించింది. కానీ మోదీ మాత్రం అంతా కేంద్రం చేతుల్లోనే ఉండాలంటున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా పసిగట్టడం లేదు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఒక దేశం ఒక ఎన్నిక వంటి అంశాల్లో ప్రజా ఉద్యమం అవసరం.⇒ కేరళ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై పనిచేస్తోందే తప్ప అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించడం లేదు. కేరళకు అనేక అవకాశాలున్నాయి. పర్యాటకం, ఎనర్జీ, పెట్టుబడులపై పాలసీలు రూపొందించుకోవాలి.⇒ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదనేది బీజేపీ, నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన భావన మాత్రమే. ఆ వర్సిటీ అనేక అపోహలను సృష్టిస్తోంది. ఆ మాయాజాలంలో పడొద్దు.’’ -
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్‌రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్‌లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
‘కులగణన నివేదిక చిత్తు పేపర్’
సాక్షి,తెలంగాణ భవన్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక ఓ చిత్తు పేపర్‌తో సమానమాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ బేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులగణన తప్పుల తడక,కులగణన నివేదిక చిత్తు పేపర్.కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదు. బలహీన వర్గాలను చాలా స్వల్పంగా చూపించారు. కులగణన సర్వే శాస్త్రీయంగా చేయాలి. కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. దున్నపోతుమీద వాన పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైందీ?15 నెలల్లో 15పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు. కులగణనపై రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెప్పొద్దు. బీసీ డిక్లరేషన్‌లో 42శాతం రిజర్వేషన్ అన్నారు ఏమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం సొల్లు మాటలు చెప్పడం మానాలి. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది.కేసీఆర్ ఎప్పుడో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా టిక్కెట్లు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు రెండు టిక్కెట్లు ఇస్తామని చెప్పి కేవలం 19 మాత్రమే ఇచ్చింది. అందులో పాతబస్తీలో 5 సీట్లు ఇచ్చారు.రాహుల్ గాంధీ,మోదీ కూర్చుని చాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది.రేపటి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీసీల భావజాల వ్యాప్తిలో భాగంగా కార్యక్రమాలు ఉంటాయి. కేసీఆర్,కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.మాపై నెపం నెట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
60 లక్షల మందిని ఏం చేశారు?: బండి సంజయ్
సాక్షి,నల్గొండజిల్లా:తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి9) నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.‘దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులే కరువైంది తెలంగాణలో మాత్రమే.కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్,హరీష్ రావు జైలుకి పోతారని అన్నారు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు,ఫాంహౌస్ కేసులో జైలు అన్నారు ఏమైంది.ఈ ఫార్ములా కేసులో సుప్రీం కోర్టు చెప్పినా ఎందుకు విచారణ ఆగింది.నిరుద్యోగ భృతి నాలుగువేలు ఏమైంది. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 56 వేల అప్పు ఉంది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు.స్కూళ్లలో చాక్‌పీసులు కొనుగోలుకు నిధులు లేవు. విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్,భగత్ సింగ్,ఆజాద్ వీర్ సావర్కార్‌ను తయారు చేయాలని అనుకుంటోంది.రేవంత్ సర్కార్ చండ్ర పుల్లారెడ్డి లాంటి నక్సలైట్లను తయారు చేయాలనుకుంటోంది. 317 జీవోపై కొట్లాడి జైలుకు పోయింది మేమే. కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ సకల జనులసర్వే చేయించి రిపోర్ట్‌ను సంకలో పెట్టుకున్నాడు.కేసీఆర్ సర్వేలో బీసీల శాతం 51 ఉంటే రేవంత్ సర్వేలో 46 శాతం వచ్చింది.కుల గణనే ఒక బోగస్.తెలంగాణలో ఓటర్లు 3.34 కోట్లు ఉంటే జనాభా 3.7 కోట్లు ఉండటం ఏంటి. తెలంగాణలో 4.3 కోట్లు జనాభా ఉండాల్సి ఉంది.మిగతా 60 లక్షల మందిని కాంగ్రెస్ హత్య చేసిందా? ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ముప్పై మంది బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లీంలు గెలిచారు.బీసీ సంఘాలు ఎటుపోయాయి. తెలంగాణలో హిందువులు అడుక్కోవాలా. రేవంత్ రెడ్డి గ్యాంగ్,ఓవైసీ కుటుంబం హిందువులను రాచిరంపాన పెడుతున్నారు’ అని బండి సంజయ్ ఫైరయ్యారు.