breaking news
-
ఉత్తమ్ ద్రోహ చరిత్ర వల్లే.. రేవంత్ కృష్ణా జలాల విమర్శలకు హరీష్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. సంస్కారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారాయన. ‘‘కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి బయటకు వచ్చేశాం. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారు. కానీ, సీఎం అనే విజ్ఞత కోల్పోయి, సంస్కారం లేకుండా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి.. ఆ వ్యాఖ్యలపై సభలో మాట్లాడామన్నా మాకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు’’ అని హరీష్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన ద్రోహం వల్లే తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ తప్పు ముమ్మాటికీ కాంగ్రెస్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వల్ల నిర్లక్ష్యం జరిగింది. అప్పటి లెక్కల ప్రకారం నీళ్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పటి లెక్కల ప్రకారం నీళ్ల పంపకాలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు మంత్రి పదవి కోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు పీజేఆర్ తప్ప ఎవరూ పోరాడలేదు. ఆ సమయంలో ఉత్తమ్ మౌనంగా ఉండిపోయారు. .. తెలంగాణకు ద్రోహం చేసి పోతిరెడ్డిపాడుపై పెదవులు మూసుకున్నందుకే ఉత్తమ్‌కు మంత్రి పదవి వచ్చింది. విజయవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబు ఇంట్లో భోజనం చేశారు. ఆపై శ్రీశైలం ఖాళీ అయ్యే వరకు చూశారు. సెక్షన్-3 తెచ్చి తెలంగాణకు న్యాయం చేసింది కేసీఆర్. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది.. త్యాగ చరిత్ర మాది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మేము వ్యతిరేకించాం. నీళ్లు ఉన్నా ఖమ్మం, నల్గొండ లో పంటలు ఎండిపోయాయి ఎందుకు?. కేసీఆర్ కట్టిన సీతారామ పుణ్యమాని ఖమ్మం పంటలు కాపాడుకుంటున్నారు. -
కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్(KCR) మొహం చాటేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తూ.. మాజీ సీఎంతో పాటు హరీష్, కేటీఆర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాటకు ముందు స్టేచర్.. మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. మరి మీకు స్టేట్ ఫ్యూచర్ వద్దా.. మీ స్టేచరే మీకు ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు.కేసీఆర్ దగ్గర ఇప్పుడు మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమే. ఆ సీటుతో నేనేం చేసుకుంటాం. అది హరీశ్కో, కేటీఆర్‌కో కావాలి మాకు కాదు. కేసీఆర్‌ను ఉద్దేశించి నేను ‘స్ట్రెచర్’ వ్యాఖ్యలు చేశానని హరీష్, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నాను.. అందులో తప్పేం ఉంది. కేసీఆర్ చెడును నేను ఎందుకు కోరుకుంటా?. ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే అధికారంలో ఉండాలి. కేసీఆర్ సభకు రావాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించం. ఆయన సభకు వచ్చిననాడే కృష్ణా జలాల అంశం చర్చ పెడతాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంంలో మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో తమతో చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గవర్నర్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీనవర్గాలకు చెందిన మహిళ గవర్నర్‌గా ఉంటే.. ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్పూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్‌ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం.. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణం. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించాం. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం. గతంలో ఎన్నికప్పుడే రైతుబంధు అన్నదాత అకౌంట్లలో పడేది. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా అందిస్తామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారు. మా తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు క్షమాపణ చెబుతాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతాం. లెక్కలతో సహా నిరూపిస్తాను.. చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీటి కోసం పోరాటం చేస్తున్నాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా?. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్న పెంచితే తెలంగాణ ఎడారి అవుతుందని పీజేఆర్ అడ్డుకున్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు.. సంతోష్‌కు రాజ్యసభ ఇవ్వలేదా?. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలిచ్చారు.. పదేళ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు?. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు తక్కువ, పెట్టిన పరీక్షలు ఎక్కువ. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లా అమ్మేశారు. గత ప్రభుత్వంలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మేసింది. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దిగజారిస్తే మేం ప్రక్షాళన చేశాం. ఒక్క ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చాం. 19 శాతం నిరుద్యోగాన్ని తగ్గించిన ఘనత మాది. విద్యాశాఖను మేం ప్రక్షాళన చేశాం. 20 ఏళ్లు ప్రమోషన్, 10 ఏళ్లు ట్రాన్స్ఫర్ లేని వారికి శుభవార్త అందించాం. చిన్న వివాదం కూడా లేకుండా 36వేల మంది టీచర్లను బదిలీ చేశాం. గ్రూప్-2,3,4 పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశాం’ అని తెలిపారు. -
కేసీఆర్ ఎప్పుడూ చెప్తుండేవారు.. మీపై గౌరవం ఉంది: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అంటున్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన.‘‘స్పీకర్ అంటే జగదీష్‌రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్‌రెడ్డికి మైక్ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్‌రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలి’’ అని హరీష్ రావు స్పీకర్‌ను కోరారు. అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్‌ను ఆయన ఛాంబర్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్ఎస్ సభ్యులు.. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. -
TS Assembly: తెలంగాణ శాసన సభ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. :తెలంగాణ శాసన సభ ఎల్లుండి( సోమవారానికి) వాయిదాతెలంగాణ శాసన సభలో పొట్టి శ్రీరాములు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంరుణమాఫీ చరిత్రలో మిగిలిపోయే అంశం.ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేశాం.క్వింటాల్ కి 10 కిలోల తరుగు పేరిట కోట్లు కొల్లగోట్టారు.తరుగు తీస్తే.. తొలు తీస్తాం అని మేము చెప్పాం.కృష్ణ బేసిన్లో 299 టీఎంసీ లు చాలు అని సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్.. ఇది నిజం కదా..?వైఎస్సార్ ఆశీర్వాదంతో కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు.అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడ్డుకుంటే పోతురెడ్డి పాడు పెద్దది అయ్యేదా..?కేసీఆర్ ఏడాది నుంచి 55 లక్షల జీతం జీతం తీసుకొని.. సభకు వచ్చింది రెండు రోజులు మాత్రమే.సీఎం రేవంత్ ప్రసంగంరైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాంగత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం చేసిందిమార్చి 31వ తేదీ నాటికి రైతులందరినీ భరోసా అందిస్తాంఅధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాంరైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాంవరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నారుగతంలో ఎక్కడ పంట పండినా.. కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంకేబినెట్ విధానాలనే గవర్నర్ ప్రసంగిస్తారు.. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం ఈ మాత్రం అవగాహన లేకుండా మంత్రులుగా ఎలా చేశారో తెలియడం లేదు ఇష్టారీతిలో మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతే.. భవిష్యత్‌లో కూడా బీఆర్ఎస్కు సున్నానే వస్తది బీఆర్ఎస్ బాయ్కాట్మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసనరేవంత్ ప్రసంగం కొనసాగుతున్న వేళ సభ నుంచి బాయ్‌కాట్ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ఆ తర్వాత కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగం చేర్చారుఓ గవర్నర్ అందునా మహిళా గవర్నర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హేళన చేసింది మేము రాజ్యంగబద్ద వ్యవస్థ కు గౌరవం ఇస్తాంగవర్నర్ ప్రసంగం.. గాంధీ భవన్ ప్రసంగంలా ఉందని కొందరు హేళన చేస్తున్నారుఅజ్ణానమే కొందరు విజ్ణానం గా భావిస్తున్నారు. శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి..కృష్ణ బేసిన్ ప్రాజెక్టుల్లో తెలిమెట్రీలను పెట్టిస్తాం గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయింది కృష్ణ జలాలు అక్రమంగా తరలిపోవడానికి గత ప్రభుత్వం సహకారం ఉంది. కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటా కోసం మేము పోరాటం చేస్తాంబకాయిల పాపం ఎవరిది?: మంత్రి శ్రీధర్ బాబుబకాయిలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి?పేరుకుపోయిన బకాయిలను 14 నెలల నుంచి చెల్లిస్తున్నాంప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దుబకాయిలంతా మీరు అధికారంలో ఉన్న సమయంలోవేమీరు పెండింగ్‌లో ఉంచిన బకాయిలను మేమే అధికారంలోకి వచ్చాక చెల్లించాముపళ్ల రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలిమీ ఇంజనీరింగ్ కాలేజ్‌లకు దీటుగా.. మేము మా ప్రభుత్వ కాలేజ్‌లను ముందుకు తీసుకవెళ్ళతాముఇంత బ్లైండ్‌గా మాట్లాడుతారనుకోలేదు: భట్టిమేం పనులు చేశాం.. మీలా ప్రచారాలు చేసుకోవడంలేదుఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలోపు రుణమాఫీ చేశాంఅన్ని గ్రామాల్లో ఆ జాబితా డిస్ప్లే చేస్తున్నాంపల్లా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాస్తవాలు చెబుతారని అనుకున్నాం.కానీ, ఇంతబ్లైండ్గా మాట్లాతారనుకోలేదుబీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారుబీఆర్ఎస్ పాలనలో డ్రాపౌట్స్ ఎందుకు పెరిగాయి?2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడులు మానేశారు?మేం యూనివర్సిటీలను ధారదత్తం చేసి విద్యను అమ్ముకోలేదుటీచర్ రిక్రూట్మెంట్ ఎవరు ఇచ్చారు?ఇంకా 5, 6 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటాంఒక్కసారైనా ఐటీఐల గురించి పట్టించుకున్నారా?. మేం అధికారంలోకి రాగానే వాటిని స్కిల్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించాం. మీలాగా గాలికి వదిలేయలేదుఅన్ని వర్సిటీలకు వీసీలను నియమించాంచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వెళ్లి ఎప్పుడైనా చూశారా?వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించిన ఘనత రేవంత్రెడ్డిదేసీఎం ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోండిమీరు చూసిన సీఎంలాగా ఇప్పటి సీఎం చేయరు ప్రభుత్వానికి BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి.సీఎం, డిప్యూటీ సీఎం ఏ గ్రమానికైనా రచ్చి వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలి.ఏ గ్రామంలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!ఆ గ్రామంలోనే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా.జనగామనే కాదు డిప్యూటీ సీఎం మధిర అయినా పర్లేదు.వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాఅసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి..రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదనడం సరికాదుఅధికారంలో వచ్చిన మూడు నెలలోనే రుణమాఫీ చేశాంసిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకు ఆ నేతలు చేసిన దానికంటే.. మేం చేసిన మేలు ఎక్కువఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తాంప్రతీ పథకాలను లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంఅధికారంలో ఉన్నన్నాళ్లూ మీరు ప్రచారాలు చేసుకున్నారుమేం అన్నీ చేసుకుంటూ పోతున్నాం.. కానీ, ప్రచారం చేసుకోవడం లేదుకావాలంటే.. శాసన సభ ప్రాంగణంలో రైతు బంధు, రైతు భరోసా లిస్టులు అంటిస్తాం115 నియోజకవర్గాలకు సంబంధించి.. గృహజ్యోతితో పాటు అన్ని పథకాల సమాచారం మా దగ్గర ఉందిమేం పని చేసేది ప్రజల కోసం మీలాంటి రాజకీయ పార్టీల కోసం కాదుబీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు.. డిప్యూటీ సీఎం చెబుతున్నారుడిప్యూటీ సీఎం ఎలాగైనా సీఎంకు రావాల్సిన క్రెడిట్ కొట్టేసి.. ప్రమోషన్ పొందాలని చూస్తున్నారుమేం అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలిమా ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేశాంరైతు భరోసా ఎంత మందికి ఇచ్చారు?ఎంత మందికి ఇచ్చారో కాదు.. ఇంకా ఎంతమందికి ఇవ్వలేదో ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా?అధికారంలోకి వచ్చి 15నెలలు అయ్యింది.. ఇంకెతం కాలం పడి ఏడుస్తారు?వరికి రూ.500 బోనస్ ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు?మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో మెజార్టీ రైతులకు రుణమాఫీ అయ్యింది.. రైతు భరోసా ఇచ్చాము.మీ ప్రభుత్వo లో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు ఇన్స్టాల్ మెంట్ చేశారు...మేము 2లక్షలు ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా మేము ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..మేము రుణమాఫీ చేస్తే మీరు ఓర్వలేక పోతున్నారు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిరేపు సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ వస్తున్నారు.దేవాదుల ఆన్ చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలి.ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయి.రేపు సీఎం పంటనష్టం పై రైతులకు నిదులు ఇవ్వాలి.అంతకుముందు.. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అంశం పునఃసమీక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశంఘుంది. అలాగే ఇవాళ కీలకమైన యూనివర్సిటీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది. విభజన చట్టం 10 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడం, తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్లు లాంటి అంశాలను ఈబిల్లులో పొందుపరిచారు.అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశంఇవాళ అసెంబ్లీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్లు చేశారు. లాబీలో శ్రీధర్ బాబు ఛాంబర్ ముందు ఈ ఇద్దరు మంత్రులలు ఎదురు పడ్డారు. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందని కోమటిరెడ్డి అనగా.. అసెంబ్లీ సిబ్బంది, అధికారులు నవ్వుకున్నారు. వెంకన్న నాపై అభిమానంతో అలా అంటారు..ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దని శ్రీధర్ బాబు అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. -
సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు.ఒకవేళ అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపినా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావించినా హోలీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరే వెళ్లినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ముందుగా ప్లాన్‌చేసుకునే సస్పెన్షన్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ సందర్భంగా రచ్చ చేసి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎల్పీ భేటీలోనే ప్లాన్ చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించడం ద్వారా ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టే బడ్జెట్లోని డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశాలను ఉపయోగించుకోవాలి. దూషణలు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా పూర్తి అధారాలు, అంకెలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి’’అని సూచించినట్టు సమాచారం. పార్టీ రజతోత్సవాలపైనా చర్చ బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్ పలు సూచనలు చేశారు. వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే దృష్టి సారించారు. ఆ సభను విజయవంతం చేసేందుకు జరగాల్సిన కసరత్తు, నియోజకవర్గాల వారీ గా సన్నాహక సమావేశాలు, సన్నాహక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపైనా కేటీఆర్‌కు కేసీఆర్ ప లు సూచనలు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి త్వ రలో కేటీఆర్ అన్ని జిల్లాల ముఖ్య నేతలతో ఒక ప్ర త్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.22న డీఎంకే భేటీకి కేటీఆర్తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఆ భేటీలో బీఆర్ఎస్ పక్షాన ప్రస్తావించాల్సిన అంశాలు, పోరాట రూపాలు, ఐక్యకార్యాచరణ, అవలంబించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష, దానిపై బీఆర్ఎస్ చేసిన పోరాటాలను కూడా ప్రస్తావించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల పంపిణీలో వివక్ష, దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కంట్రిబ్యూషన్ తదితరాలపైనా దిశానిర్దేశం చేశారు. -
బలంగా గళం వినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభ్యుడిగా నా హక్కులు కాపాడుకోలేని నేను ప్రజల హక్కులను ఎలా కాపాడగలను? ఎలాంటి సభా సాంప్రదాయాలను ఉల్లంఘించకున్నా నన్నుఅసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం. నా సస్పెన్షన్‌కు చూపిన కారణాలేవీ సరికాదు. కాంగ్రెస్ పార్టీకి నా గొంతు నొక్కడం సాధ్యం కాదు. పంటలు ఎండి బాధ పడుతున్న రైతు గురించి, ప్రభుత్వం చేతిలో మోసానికి గురవుతున్న ప్రజల గురించి మరింత బలంగా నా గళం వినిపిస్తా.ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తా..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం భేటీలో సీఎం సమక్షంలో ముందే నిర్ణయం తీసుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడంపై జగదీశ్‌రెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పథకం ప్రకారమే గొడవకు దిగారు ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ నుంచి ఇద్దరు సభ్యులు సుమారు గంటన్నర పాటు మాట్లాడినా మేం ఎక్కడా అడ్డు చెప్పలేదు. కానీ నేను మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పథకం ప్రకారమే గొడవకు దిగారు. స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా నేను ఒక్క అక్షరం కూడా ఉపయోగించలేదు. 50 మంది సభ్యులు అంతరాయం కలిగిస్తున్నా స్పీకర్ నా రక్షణకు రాలేదు. సభను నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని మాత్రమే చెప్పా.సభ్యులందరికీ సమాన హక్కులుంటాయనే విషయాన్ని గుర్తు చేశా. నేను స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించానని, దళితులను అవమాన పరిచానని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో దళిత కోణం ఎక్కడుందో చెప్పాలి. ఏకవచనంతో సంబోధించలేదు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సభాపతి స్థానానికి కుల మతాలు ఉండవు. ప్రజలు ప్రత్యక్షంగా నేను మాట్లాడిన తీరును వీక్షించారు. ఈ విషయంలో స్పీకర్ నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. సభను ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో నడిపిస్తోంది..’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కారు ‘నా సస్పెన్షన్ విషయంలో అన్ని సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. అన్ని పార్టీల సభాపక్ష నేతల సమక్షంలో నా వ్యాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. నేను మాట్లాడిన అతికొద్ది సమయంలో ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడలేదు..’అని మాజీమంత్రి చెప్పారు. -
బీజేపీ నేతలతో రేవంత్ రహస్య భేటీల మర్మమేమి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025మరో ట్వీట్లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
మొయినాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగదీశ్‌రెడ్డి కామెంట్స్.. కలకలం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఈ సభ నీ సొంతం కాదు..’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్‌ను అవమానించిన, ఏక వచనంతో సంబోధించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. అందరికీ సమాన హక్కులు: జగదీశ్‌రెడ్డి ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి.. స్పీకర్‌ను ఉద్దేశించి ‘ఈ సభ మనందరిది. మనందరికీ సమాన హక్కులున్నాయి. మనందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నరు తప్ప ఈ సభ నీ సొంతం కాదు..’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన ప్రతిపదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ దళిత సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించారని తప్పుబట్టారు. మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్కి దళితుల పట్ల చిన్నచూపు అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ పేపర్లు పైకి విసిరేస్తే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సభ ప్రారంభం కాగా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో పాటు అధికార పక్ష సభ్యులు మాట్లాడారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కొందరు, బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా స్పీకర్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సెషన్ మగిసేవరకూ జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. ఆ తర్వాత కూడా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సస్పెన్షన్‌పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ళారు. అయినా అవకాశం ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు. అసలేమైంది..? ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా (ఈ సమయంలో 4 బర్రెల కథ చెప్పారు)..అధికార పక్షం (మధ్యలో) మాట్లాడకుండా ఉండాలంటే చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ అన్నారు. దీంతో ‘నేను గవర్నర్ ప్రసంగంపై చర్చ నుంచి అక్షరం పక్కకు పోయినట్టు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా..పొమ్మంటే పోతా..’ అంటూ జగదీశ్‌రెడ్డి ఆవేశంతో తన చేతిలో ఉన్న నోట్స్‌ను కుర్చీకేసి విసిరికొట్టారు. దీంతో స్పీకర్‌ని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను జగదీశ్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ‘అసహనానికి గురికాకుండా సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు. మంత్రిగా పదేళ్లు పని చేశారు. మీరీ విధంగా మాట్లాడడం, సభా సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు..’ అని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. ‘ఏ సభా సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో మీరు చెబితే ఆ తర్వాత నేను మాట్లాడుతా..’ జగదీశ్‌రెడ్డి అన్నారు. దీంతో ‘నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో వాతావరణం వేడెక్కింది. జగదీశ్‌రెడ్డి అన్నదాంట్లో తప్పేం ఉంది?: హరీశ్‌రావు బీఆర్ఎస్ సభ్యుడు, మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..‘సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించింది కాదని, ప్రతిపక్ష సభ్యులకు కూడా సమాన హక్కులుంటాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇందులో తప్పేం ఉంది..’ అని ప్రశ్నించారు. మీరు చేయలేనిది మేం చేశాం: శ్రీధర్‌బాబు 2014–15లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో తాము సంవత్సర కాలంలో చేసి చూపెట్టామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘వాళ్లు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. వారి విషయంలో ప్రజలు వ్యంగ్యంగా నవ్వారు కాబట్టే మేము ఇక్కడ (అధికారంలో) ఉన్నాం..’ అని వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి దేశమంతా పచ్చగా కనిపించినట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా జగదీశ్‌రెడ్డికి కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దళితుడిని సీఎం చేయకపోతే నా మెడ మీద తల ఉండదని 10 వేల సార్లు అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చావా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దళితుడు (భట్టి విక్రమార్క) ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకి అని నిరూపించుకున్నవు అని అన్నారు. బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనలేదని, వారికి ప్రజలపై ప్రేమలేదని వ్యాఖ్యానించారు. మమ్మల్ని రమ్మంటారా? వద్దా?: తలసాని సభ సాంప్రదాయాలను అధికారపక్షం పాటించకపోతే ఎలా? అని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. సభకు తమను రమ్మంటారా? వద్దంటారా? చెప్పాలని స్పీకర్‌ను ప్రశ్నించారు. అయితే జగదీశ్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని మంత్రులు, అధికారపక్ష సభ్యులందరూ ట్రెజరీ బెంచీల వద్ద నిలబడి నినాదాలతో హోరెత్తించడంతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సాయంత్రం 3.35కు సమావేశమైన తర్వాత జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సభ్యులను అనుమతించారు. జగదీశ్‌రెడ్డి చెప్పిన 4 బర్రెల కథ ‘ఓ తండా వద్ద తవి్వన బావివద్దకు వెళ్లి ప్రజలకు గవర్నర్ ప్రసంగం చదివి వినిపించిన. అది విన్న వెంకటరాములు, రాజయ్యలు వారి ఊళ్లో ఉండే వెంకటయ్య కథతో పోల్చారు..మా అమ్మగారి ఇంటికి పాలుపోసి తీరుతా..అని నేను అంటే నా భర్త కొట్టిండని వెంకటయ్య భార్య సర్పంచ్‌కి ఫిర్యాదు చేసింది. మీకు బర్రెలే లేవు..పాలు ఎక్కడివి అని సర్పంచ్ అడిగితే నాకు నాలుగు బర్లున్నాయి అని వెంకటయ్య అన్నడు. పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, మా అత్తగారు ఒకటి ఇస్తే, నేను ఒకటి కొంటే.. నాలుగైతయి అన్నడు. గవర్నర్ ప్రసంగం కూడా ఇలానే ఉందని ఆ గ్రామస్తులు అన్నరు..’ అని జగదీశ్‌రెడ్డి చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆటో కారి్మకులకు రూ.12 వేలు, అక్కచెల్లెళ్లకు రూ.2500, రైతులకు బోనస్, తులం బంగారం, స్కూటీలు, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీయడంతో వివాదం ప్రారంభమైంది. ‘గవర్నర్ ప్రసంగాన్ని ఏఐ, చాట్ జీపీటీతో తయారు చేసినట్టు ఉంది. మనసు కవి ఆత్రేయ బతికి ఉంటే ..ప్రభుత్వాలు ఇంత మనస్సు లేకుండా పనిచేస్తాయా? అని చూసి ఆత్మహత్య చేసుకునేవారు. గవర్నర్‌తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాలు మాట్లాడించారు.’ అని అంతకుముందు విమర్శించారు. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్‌రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. ‘‘నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను’ అని విజయశాంతి చెప్పారు.‘‘ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు’’ అని విజయశాంతి అన్నారు.‘‘కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు ’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. -
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని.. కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. గురువారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ స్థానం గెలవాలని తనకు అప్పగిస్తే.. నిద్రహారాలు మాని గెలిపించానన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో జగదీస్‌రెడ్డి చాలా అతి చేశారన్నారు. మేము ఎవ్వరిని టార్గెట్ చేయం.. తప్పు చేస్తే వదిలి పెట్టం.. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి చైర్‌ను ప్రశ్నించడం సరికాదు. స్పీకర్ కుర్చీని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్‌ను అవమానించినందుకే చర్యలు తీసుకున్నాం. ఎథిక్స్ కమిటికి సిఫార్సు చేశాం’’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
ఇదే మా సవాల్.. మీ సవాల్‌కు మేము కూడా సిద్ధమే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి, మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్‌రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్‌రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం -
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్ఎస్ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్ ప్రసాద్ అనడంతో జగదీశ్ రెడ్డి లేచారు. స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
మాటకు మాట.. తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొక్కుబడిగా హాజరవడం కాదు.. కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్‌గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు. నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు ‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్‌లను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. చెప్పేది సీరియస్‌గా తీసుకోండి.. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్‌గా ప్రయత్నించాలి. నాన్సీరియస్గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం.