అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది. తమిళ రాజకీయాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లనున్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ పార్టీ నేతలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి బలపరీక్ష సమయంలో తమపై వ్యవహరించిన తీరును వివరించిన స్టాలిన్.. నేటి సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఇటీవల అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా తలెత్తిన పరిస్థితులను వివరించనున్నారు.