
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.
క్లిక్ చేయండి👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్
క్లిక్ చేయండి👉 ఇంటర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్
క్లిక్ చేయండి👉 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్
క్లిక్ చేయండి👉 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్
తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.

గతం కన్నా మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని మంత్రి భట్టి తెలిపారు. పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారయన్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్ సెకండర్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ పరీక్షలు ఉండనున్నాయి. రీకౌంటింగ్, వెరిఫికేషన్‌కు వారం గడువు ఇచ్చింది ఇంటర్ బోర్డు.
