జీహెచ్‌ఎంసీకి ఎంపీ వార్నింగ్‌..కారణమిదే.. | Medak Mp Raghunandan Rao Comments On Ghmc | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీకి ఎంపీ రఘునందన్‌రావు సీరియస్‌ వార్నింగ్‌

Published Wed, Feb 5 2025 7:28 PM | Last Updated on Wed, Feb 5 2025 7:52 PM

Medak Mp Raghunandan Rao Comments On Ghmc

సాక్షి,సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాను మరో జవహర్‌నగర్‌గా మార్చాలని చూస్తున్నారని,శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్‌లో రోజుకు వంద లారీల చెత్త పోసేందుకు జీహెచ్‌ఎంసీ ప్లాన్‌ చేస్తోందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మేరకు రఘునందన్‌రావు బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు.

‘చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. పటాన్‌ చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితం అయింది.2015లో అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నలవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకపోతే  అధికారులకు భౌతిక దాడులు తప్పవు.

పట్నం చెత్తను పల్లెలో వేస్తామంటే ఊరుకోం. అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి. పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని ఉపసంహరించుకోకుంటే ప్రత్యక్ష నిరసనకు దిగుతాం.

పోలీసులతో ప్రజలను భయపెట్టి పనులు చేపట్టడం సరికాదు.చెత్తకు హైదరాబాద్,రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా’అని రఘునందన్‌రావు నిలదీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement