ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క | CLP Leader Bhatti Vikramarka Comments On Excise Policy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాలసీపై హోటల్‌లో నిర్ణయాలేంటి?: భట్టి విక్రమార్క

Published Tue, Aug 23 2022 1:27 PM | Last Updated on Tue, Aug 23 2022 1:42 PM

CLP Leader Bhatti Vikramarka Comments On Excise Policy - Sakshi

మద్యం పాలసీపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. 

‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్‌లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్‌లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.

ఇదీ చదవండి: లిక్కర్‌ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement