
photo credit: IPL Twitter
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్ సందర్భంగా కెమరాల్లో రికార్డైన ఓ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కోపంతో ఊగిపోతూ కనిపించాడు. తనపై కెమెరామెన్ పదేపదే ఫోకస్ చేస్తుండటంతో సహనం కోల్పోయిన అర్జున్ తిట్ట దండకం అందుకున్నాడు. ఈ సన్నివేశం ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్ సందర్భంగా జరిగనట్లు వీడియో ద్వారా స్పష్టమవుతుంది.
ఏం జరిగిందంటే..
ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ అర్జున్‌కు సంబంధించిన ఓ క్లిప్‌ను చూపించాడు. మ్యాచ్‌కు ముందు అర్జున్.. తన తండ్రి సచిన్‌తో ఏదో మాట్లాడుతున్న సందర్భమది. ఈ క్లిప్ ప్లే చేసిన తర్వాత కెమెరా సచిన్‌పై ఫోకస్ కావడంతో కామెంటేటర్ రవిశాస్త్రి.. కొనేళ్ల కష్టం తర్వాత కలను సాకారం చేసుకున్న కొడుకును చూడటం తండ్రికి ఎంతో గర్వకారణమని సచిన్ ఉద్దేశిస్తూ అన్నాడు.
— Tirth Thakkar (@ImTT01) April 18, 2023
ఆ మరు క్షణమే డగౌట్‌లో కూర్చున్న అర్జున్ ఫేస్‌ను కెమెరామెన్ జూమ్ చేశాడు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్లపై తన ముఖం కనబడటంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అర్జున్.. కెమెరామెన్‌పై తిట్ట దండకం అందుకున్నాడు. డగౌట్‌లో తన పక్కను కూర్చున్న తిలక్ వర్మవైపు చూస్తూ అర్జున్ అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ మొత్తం తంతు కెమెరాల్లో రికార్డు కావడం, అది కాస్త సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అర్జున్ ఆడుతున్నది కేవలం రెండో మ్యాచే కాబట్టి, అతనిపై కెమెరాలు పదేపదే ఫోకస్ చేస్తే ఒత్తిడికి లోనవుతాడు, అలా చేయడం కెమెరామెన్ తప్పేనని కొందరంటుంటే, మరి కొందరేమో.. ఇంత పొగరు పనికిరాదు, సెలెబ్రిటీ కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం ఫోకస్ ఉంటుందంటూ అర్జున్‌నే తప్పుబడుతున్నారు.
అర్జున్ ఏమన్నాడంటే..
వీడియోల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే.. “Iski Maa ki, mujhe jaan bujh ke dikhate hai BC" అన్నట్లు తెలుస్తోంది. దీని అర్ధం వర్ణించలేని భాషలో ఉంది. కెమెరామెన్ ఉద్దేశపూర్వకంగా నన్ను హైలైట్ చేస్తున్నాడు అన్నది దాని అంతర్ధాం.