అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది | YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments | Sakshi
Sakshi News home page

అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది

Published Sat, Apr 19 2025 2:23 PM | Last Updated on Sat, Apr 19 2025 3:36 PM

YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments

విజయవాడ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్‌సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?.  ఇప్పుడేమో నెంబర్‌ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. 

.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్‌ వన్‌ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement