మంచిర్యాలరూరల్(హాజీపూర్): మేడే వేడుకలు జరుపుకుంటున్న కార్మికులు ఓవైపు సంతోషంగా ఉండగా హాజీపూర్ మండలం పెద్దంపేటలోని ఈజీఎస్ కూలీలు పనుల్లో మునిగిపోయారు. ఈజీఎస్ నిర్వాహకులు వారితో ఉపాధి పనులు చేయించారు. కార్మిక దినోత్సవ వేళ ప్రభుత్వ సెలవు ఉండగా ఇలా పనులు చేయించడంపై కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కాగా ఈజీఎస్ ఏపీవోను వివరణ కోరగా ఇటీవల పనిచేసిన దినాల్లో కొలతలు తక్కువ ఉండటంతో వాటిని సరిచేసేందుకు ఏడుగురు కూలీలు స్వచ్ఛందంగా వెళ్లారన్నారు. కార్మిక సెలవు కారణంగా ఎవరికీ ఎలాంటి మస్టర్ వేయలేదని తెలిపారు.