
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గతనెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రారంభించిన ఆ టో రథయాత్ర బుధవారం బెల్లంపల్లికి చేరుకు ంది. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్స్ యూని య న్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్, నాయకులు, ఆటోడ్రైవర్లు రథయాత్రకు స్వాగతం పలికారు. బజారుఏరియా పురవీధుల మీదుగా రథయా త్ర, ఆటోలతో ర్యాలీ చేశారు. రథయాత్ర మే 27న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, ఈసందర్భంగా ఇందిరాపార్కులో నిర్వహించే ఆటో ఆకలికేకలు మహాసభకు ఆటోడ్రైవర్లు తరలిరావాలని కోరారు.
గేదెల మృతి కారకుడికి 9 నెలల జైలు
ఆసిఫాబాద్: విద్యుత్ తీగలు అమర్చి, నాలుగు గేదెల మృతికి కారణమైన తిర్యాణి మండలం చెలిమెల కొలాంగూడకు చెందిన టేకం కొండుకు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పుచెప్పారు. తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. తిర్యాణి నుంచి మాణిక్యాపూర్ వెళ్లే మార్గంలో గుట్టమేడి అటవీ ప్రాంతంలో జంతువులకోసం టేకం కొండు విద్యుత్ తీ గలు అమర్చాడు. భీమ్‌రావు, భుజంగరావు, సోంబాయి, విజయలకు చెందిన నాలుగు గేదెలు 2017 మే 31న మేత కు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో అటవీప్రాంతంలో గాలించగా మృతిచెంది ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో అ ప్పటిఎస్సై బుద్దేస్వామి కేసు నమోదు చేశా రు. రెబ్బెన సీఐ బుద్దేస్వామి, తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కోర్టులో సాక్షులు ప్రవేశపెట్టగా పీపీ జనన్మోహన్‌రావు విచారించి నేరం రుజువుచేశారు. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పుచెప్పా రు. నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, కానిస్టేబుల్ వినో ద్‌ను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
మంచిర్యాల సీఈగా
సత్య రాజచంద్ర
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖలో ఇద్దరు అధికారులకు ఇన్‌చార్జీలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ చేసి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా ఎస్‌ఈగా పనిచేస్తున్న ఎ.సత్య రాజచంద్రను మంచిర్యాల చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు. ఆదిలాబాద్ ఇరిగేషన్ సర్కిల్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎం.లక్ష్మిని నిర్మల్ సర్కిల్ డీఈగా బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ప్రి న్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ పేర్కొన్నారు.