
దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలోని షాహిద్ రాజయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పేలుడు కారణంగా బందర్ అబ్బాస్ పోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.
ఘటనాస్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా, పేలుడు జరిగిన సమయంలో ఓడరేవులో భారీ సంఖ్యలో కార్మికులు పనిలో ఉన్నారని సమాచారం. మరణాలు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. గాయపడినవారిని హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More than 500 were injured in a massive explosion at Iranian southern port city of Bandar Abbas.
Shahid Rajaei port is a major facility for container shipments in the Islamic Republic of Iran. It handles 80 million tons of goods a year.
This happened as the United States and… pic.twitter.com/wT4HznvN2W— John Dawson (@winthewestback) April 26, 2025