ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల | Andhra Pradesh Two MLA Quota MLCs By Poll Schedule Released | Sakshi
Sakshi News home page

జులై 12న ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక

Published Tue, Jun 18 2024 2:02 PM | Last Updated on Tue, Jun 18 2024 2:02 PM

Andhra Pradesh Two MLA Quota MLCs By Poll Schedule Released

సాక్షి, ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌పై మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఏపీతో పాటు కర్ణాటక(జగదీష్‌ శెట్టర్‌-రాజీనామా), బీహార్‌(రామ్‌బాలి సింగ్‌-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్‌(స్వామి ప్రసాద్‌ మౌర్య-రాజీనామా) మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.  

ఈ నెల 25వ తేదీన  ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జులై 2 కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉండనుంది. జులై 12వ తేదీన ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. దాకా పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement