Sundar pichay
-
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ. -
ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే : సుందర్ పిచాయ్
-
సుందర్ పిచాయ్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..! జీఎస్ఎంఏ అంచనా న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. -
సుందర్ పిచాయ్ కి గూగుల్ బహుమతి
♦ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు జారీ ♦ పిచాయ్ మొత్తం వాటా విలువ రూ.4,500 కోట్లపైనే న్యూయార్క్: గూగుల్ సెర్చింజన్ సహా పలు కీలక విభాగాలకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్‌కి కంపెనీ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించింది. అమెరికా చరిత్రలో ఒక లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగికి ఈ స్థాయిలో షేర్లు కేటాయించటం ఇదే తొలిసారి. గతేడాది గూగుల్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కంపెనీని వివిధ విభాగాలుగా విడదీసి ‘ఆల్ఫాబెట్’ పేరిట మాతృ సంస్థను ఏర్పాటు చేశారు. సెర్చింజన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, యూట్యూబ్ వంటి కీలక విభాగాలకు మాత్రం సుందర్‌ను సీఈఓగా నియమించారు. తాజాగా ఆయనకు 2,73,328 క్లాస్ ‘సి’ షేర్లను కేటాయించినట్లు మంగళవారంనాడు కంపెనీ అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్‌కు తెలియజేసింది. గతంలోనూ పిచాయ్‌కి కంపెనీ షేర్లు కేటాయించగా ప్రస్తుతం వాటి విలువ 250 మిలియన్ డాలర్లకు చేరింది. దానికిముందు పిచాయ్‌కి ఉన్న షేర్లు... తాజాగా కేటాయించినవి కలిపితే వాటి మొత్తం విలువ 650 మిలియన్ డాలర్లు... మన కరెన్సీలో దాదాపు 4,500 కోట్ల రూపాయలవుతుంది. వ్యవస్థాపకుడు కాకున్నా... నిజానికి కంపెనీ షేరు పెరిగితే దాని వ్యవస్థాపకుల సంపదే అత్యధికంగా పెరుగుతుంది. తాజా కేటాయింపులతో వ్యవస్థాపకుడు కాకున్నా అత్యంత ధనవంతులైన వారి జాబితాలో పిచాయ్ స్థానం సంపాదించుకున్నారు. అమెరికాలో 2015లో అత్యధిక వేతనం అందుకున్న రికార్డు కూడా ఆయనదే. అయితే 2019 వరకూ గూగుల్‌లో పనిచేస్తేనే పిచాయ్ తన తాజా షేర్లను విక్రయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు దీర్ఘకాలం తమ వద్ద పనిచేయటంతో పాటు వారి ప్రణాళికలు కూడా దీర్ఘకాలికంగా ఉండేందుకే తాము ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు గూగుల్ తెలియజేసింది. గత వారం తొలిసారిగా ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ విలువ 554 బిలియన్ డాలర్లను దాటింది. అప్పటికి యాపిల్ మార్కెట్ విలువ 534 బిలియన్ డాలర్లే కావటంతో... ప్రపంచంలో అత్యధిక మారె ్కట్ క్యాప్ కలిగిన కంపెనీగా గూగుల్ ప్రథమ స్థానం దక్కించుకుంది.