Ryan Rickelton
-
ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఐపీఎల్–2025లో ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. సీజన్లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్: ఐపీఎల్ సీజన్లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ మేనేజ్మెంట్ ‘పింక్ ప్రామిస్’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్’ కిట్ ధరించగా... బ్యాటర్ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్... ఆర్చర్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్ కావడంతో రాయల్స్ పతనం మొదలైంది. బౌల్ట్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్ తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (9) అవుట్ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్ (16), హెట్‌మైర్ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్ జురేల్ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) తీక్షణ 61; రోహిత్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 53; సూర్యకుమార్ (నాటౌట్) 48; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్: ఆర్చర్ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్ 4–0–39–0, పరాగ్ 2–0–12–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బౌల్ట్ 13; వైభవ్ (సి) జాక్స్ (బి) చహర్ 0; నితీశ్ రాణా (సి) తిలక్ (బి) బౌల్ట్ 9; పరాగ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 16; జురేల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 11; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; శుభమ్ దూబే (సి) బౌల్ట్ (బి) పాండ్యా 15; ఆర్చర్ (సి) బుమ్రా (బి) బౌల్ట్ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్ శర్మ 2; కార్తికేయ (సి) చహర్ (బి) కరణ్ శర్మ 2; మధ్వాల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–13–1, బౌల్ట్ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్ 3–0–29–0, హార్దిక్ పాండ్యా 1–0–2–1, కరణ్ శర్మ 4–0–23–3. ఐపీఎల్లో నేడుగుజరాత్ X హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్దాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో రికెల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 32 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వర్మ కేవలం 26 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో వర్మను రికెల్టన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం -
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్ (MI)- గుజరాత్ టైటాన్స్ (GT) శనివారం అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ప్రస్తుత, గుజరాత్ మాజీ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.అయితే, హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో ఎవరిపై వేటు పడుతుందనే అంశంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ ఆగమనం వల్ల ముంబై మరింత పటిష్టంగా మారుతుందని.. అయితే, రియాన్ రికెల్టన్ లేదంటే.. విల్ జాక్స్ సేవలను జట్టు కోల్పోతుందని పేర్కొన్నాడు.జాక్స్‌కే ఓటు వేస్తాఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలంటే తాను మాత్రం జాక్స్‌కే ఓటు వేస్తానని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం ముంబైకి భారీ ఉపశమనం. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు లేని లోటు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.హార్దిక్ రాక వల్ల మిడిలార్డర్లో స్థిరత్వం చేకూరుతుంది. అయితే, అతడు వచ్చాడు కాబట్టి రియాన్ రికెల్టన్ లేదంటే విల్ జాక్స్.. ఈ ఇద్దరిలో ఒకరు తప్పుకోక తప్పదు. నేనైతే విల్ జాక్స్‌ను కొనసాగించాలని చెబుతా.రికెల్టన్ను తప్పించండిఎందుకంటే గతంలో అతడు ఈ వేదికపై విధ్వసంకర శతకం బాదాడు. మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. అప్పుడు అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడేవాడు. ఏదేమైనా.. రికెల్టన్ను తప్పించి.. విల్ జాక్స్‌ను కొనసాగిస్తూ.. రికెల్టన్ స్థానంలో రాబిన్ మింజ్‌ను వికెట్ కీపర్‌గా వాడుకుంటే సరిపోతుంది’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బౌలింగ్ యూనిట్ కూడా బలపడుతుంది. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్లతో పాటు రీస్ టాప్లీను ఆడించవచ్చు. హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో భారీ మార్పులు ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అందుకే తొలి మ్యాచ్‌కు దూరంఇదిలా ఉంటే.. విల్ జాక్స్ గతేడాది ఆర్సీబీకి ఆడుతూ.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే అజేయ శతకంతో మెరిశాడు. మరోవైపు.. గతేడాది ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. అందుకే ఐపీఎల్-2025లో ముంబై ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ముంబై.. నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుదిజట్టురోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.బెంచ్: విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, రాజ్ బవా, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహమాన్, హార్దిక్ పాండ్యా, క్రిష్ణన్ శ్రీజిత్, అర్జున్ టెండుల్కర్, బెవాన్ జేకబ్స్.చదవండి: ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
అదరగొట్టిన దక్షిణాఫ్రికా
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్గిడి 13; రషీద్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రికెల్టన్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ చేసిన సౌతాఫ్రికా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ టోనీ డిజోర్జీ తొందరగా ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం మెరుపులు మెరిపించాడు.రికెల్టన్ కేవలం 106 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ర్యాన్ మంచి ఊపులో ఉండగా దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(58), రాస్సీ వండర్ డస్సెన్(52), ఐడైన్ మార్క్రమ్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోయాడు. మరి 316 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గాన్ చేధిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంతకుముందు వన్డే ప్రపంచకప్-2023లో మాత్రం సఫారీలను అఫ్గాన్ మట్టికర్పించింది.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ ఆహ్మద్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడిచదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్ -
జో రూట్ విధ్వంసం.. శివాలెత్తిపోయిన రికెల్టన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 18) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ తలపడగా.. రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ అమీతుమీ తేల్చుకున్నాయి.రూట్ విధ్వంసంప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్, దయ్యన్ గేలిమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎహసాన్ మలింగ ఓ వికెట్ దక్కించుకున్నాడు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో పార్ల్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో క్యాపిటల్స్ నాలుగో స్థానంలో ఉంది.శివాలెత్తిపోయిన రికెల్టన్రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో రీజా హెండ్రిక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో డుప్లెసిస్ టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్‌లో రికెల్టన్ కోవిడ్‌తో బాధపడుతూ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్, మతీశ పతిరణలకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఎంఐ కేప్‌టౌన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. -
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది. -
SA Vs PAK: 2025లో తొలి డబుల్ సెంచరీ
2025లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్ రికెల్టన్ ద్విశతకం బాదాడు. ఈ ఏడాది ఇదే మొట్టమొదటి డబుల్ సెంచరీ. ఈ ఏడాది తొలి టెస్ట్ సెంచరీని కూడా రికెల్టనే సాధించాడు. రికెల్టన్ కెరీర్లో తన తొలి డబుల్ సెంచరీని 266 బంతుల్లో సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. పాక్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికెల్టన్ రికార్డుల్లోకెక్కాడు. రికెల్టన్కు ముందు ఏబీ డివిలియర్స్ (278 నాటౌట్), గ్రేమ్ స్మిత్ (234), హెర్షల్ గిబ్స్ (228) పాక్‌పై డబుల్ సెంచరీలు చేశారు.తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్లు..ర్యాన్ రికెల్టన్ టెస్ట్‌ల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రికెల్టన్ ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడు కూడా రికెల్టనే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు.ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా)- 211 నాటౌట్బ్రెండన్ కురుప్పు (శ్రీలంక)- 201 నాటౌట్గ్రేమీ స్మిత్ (సౌతాఫ్రికా)- 200డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 200నాలుగో వేగవంతమైన ద్విశతకంపాక్పై రికెల్టన్ చేసిన ద్విశతకం టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున నాలుగో వేగవంతమైన ద్విశతకం. రికెల్టన్ 266 బంతుల్లో డబుల్ బాదాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీని హెర్షల్ గిబ్స్ సాధించాడు. 2003లో పాక్‌పై గిబ్స్ 211 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీలు..హెర్షల్ గిబ్స్- 211 బంతుల్లోగ్రేమీ స్మిత్- 238 బంతుల్లోగ్యారీ కిర్‌స్టన్- 251 బంతుల్లో రికెల్టన్- 266 బంతుల్లోజాక్ కల్లిస్- 267 బంతుల్లోశతక్కొట్టిన బవుమాపాక్తో రెండో టెస్ట్‌లో రికెల్టన్ డబుల్ సెంచరీ సాధించగా.. కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బవుమా 106 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బవుమాను ఇది నాలుగో శతకం. ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌లో ఉన్న బవుమా.. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికాపాక్తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆ జట్టు 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రికెల్టన్ (211), కైల్ వెర్రిన్ (53) క్రీజ్‌లో ఉన్నారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా (106), డేవిడ్ బెడింగ్హమ్ (5) ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా , మొహమ్మద్ అబ్బాస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖుర్రమ్ షెహజాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ విజయానంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. -
సూపర్ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్ అఘా బౌలింగ్‌లో బౌండరీ బాది రికెల్టన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్ట్‌ల్లో రికెల్టన్కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్ టెంబా బవుమా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్ (106), బవుమా (51) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
రికెల్టన్, వెర్రిన్ సెంచరీలు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 103.4 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ రికెల్టన్ (101), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ టెంబా బవుమా (78) అర్ద సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 20, టోనీ డి జోర్జి 0, ట్రిస్టన్ స్టబ్స్ 4, బెడింగ్హమ్ 6, మార్కో జన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 0, రబాడ 23, డేన్ పీటర్సన్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార 4 వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో 3, విశ్వ ఫెర్నాండో 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (101; 11 ఫోర్లు) సెంచరీతో దక్షిణాఫ్రికాను నిలబెట్టాడు. శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.మిడిలార్డర్లో కెప్టెన్ తెంబా బవుమా (78; 8 ఫోర్లు, 1 సిక్స్), కైల్ వెరీన్ (48 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగగానే అసిత ఫెర్నాండో... ఓపెనర్ టోని డి జోర్జి (0)ని డకౌట్ చేశాడు. కాసేపటికే లహిరు కుమార నిప్పులు చెరగడంతో మార్క్రమ్ (20; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (4) పెవిలియన్ దారి పట్టారు.44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోగా, బవుమాతో జతకట్టిన రికెల్టన్ సఫారీని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించాక 177 స్కోరు వద్ద బవుమాను ఫెర్నాండో అవుట్ చేశాడు. కాసేపటికే బెడింగ్హామ్ (6) జయసూర్య బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది.ఈ దశలో రికెల్టన్, వెరీన్ నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. 250 పైచిలుకు స్కోరు నమోదయ్యాక సెంచరీ పూర్తయిన వెంటనే రికెల్టన్ వికెట్‌ను లహిరు పడగొట్టగా, ఓవర్ వ్యవధిలో యాన్సెన్ (4)ను విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో సఫారీ ఏడో వికెట్‌ను కోల్పోయింది. లహిరు కుమార 3, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?