గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాబలిపురం సమీపంలోని ద్వీపంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, శశికళ వర్గీయులతో పాటు కువత్తూర్కు చెందిన స్థానికులు కూడా పోలీసుల చర్యలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు వెళ్లిన మీడియా వర్గాల మీద కూడా లోపల ఉన్నవారు రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. డీఆర్వో కూడా అక్కడకు తమ సిబ్బందితో చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.