రాష్ట్రంలో కేసీఆర్ సాగిస్తున్న అవినీతి, అక్రమాల పాలనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
ఇల్లెందు: రాష్ట్రంలో కేసీఆర్ సాగిస్తున్న అవినీతి, అక్రమాల పాలనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, ఖమ్మం జిల్లా కారేపల్లిల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గిరిజనులకు అడవిపై హక్కు లేదని సీఎం అసెంబ్లీలో చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. సింగరేణిలో ఓపెన్‌కాస్ట్‌లు ప్రజల గుండెలపై కుంపట్లుగా మారాయని తమ్మినేని పేర్కొన్నారు. భూగర్భ గనులు మూసివేయడంతో ఇక్కడి ప్రజల జీవితాల్లో కళతప్పిందని ఆయన సీఎం కేసీఆర్‌కు శనివారం రాసిన లేఖలో పేర్కొన్నారు.