కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తిరుమల(2) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటికాలువలో పడ్డాడు. తల్లిదండ్రులు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందాడు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.