అందుకే నిర్మాతగా మారా | beeram sudhakar reddy interview about subrahmanyapuram | Sakshi
Sakshi News home page

అందుకే నిర్మాతగా మారా

Published Thu, Dec 6 2018 6:49 AM | Last Updated on Thu, Dec 6 2018 6:49 AM

beeram sudhakar reddy interview about subrahmanyapuram - Sakshi

‘‘‘కార్తికేయ, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్‌’ వంటి సినిమాలకు ఫైనాన్స్‌ చేశాను. ‘సుబ్రహ్మణ్యపురం’ కథ నచ్చి నిర్మాతగా మారాను. అంతా  అనుకున్న విధంగానే జరిగింది. ఫైనాన్షియర్‌గా వర్క్‌ చేసిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది’’ అన్నారు నిర్మాత బీరం సుధాకర్‌ రెడ్డి. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్‌ రెడ్డి చెప్పిన విశేషాలు....

► కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యపురం పుత్తూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కట్టించింది మా పూర్వీకులే. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యస్మామి.

►‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా కథను సంతోష్‌ మరో నిర్మాతకు చెబుతుంటే నేను విన్నాను. సంతోష్‌ కథ చెప్పిన విధానం ఇంకా నచ్చి నిర్మాతగా మారాను. ఆ తర్వాత సంతోష్‌ తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ను పరిశీలించాను. సంతోష్‌ చెప్పింది చెప్పినట్లు తీశారు. ఈ సినిమా బడ్జెట్‌ దాదాపు ఆరు కోట్లు అయింది.   

►ఈ కథకు సుమంత్‌గారు సెట్‌ అవుతారని ఆయన్ను తీసుకున్నాం. సుమంత్‌గారి అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. దేవుడి మహిమ గొప్పదా? మానవ మేధస్సు గొప్పదా? అనే అంశాలను సినిమాలో చర్చించాం. సైంటిఫిక్‌ అంశాలు కూడా ఉన్నాయి. ఏది గొప్ప అనేది ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు.

►‘మదరాసు ఏస్టేట్‌’ అని చెన్నైలో నాకు కంపెనీ ఉంది. చెన్నై టు సేలం ఫంక్షన్‌ హాల్స్‌ కట్టాలనుకుంటున్నాం. ముందుగా ఈ సినిమాను నవంబర్‌ 7న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కుదర్లేదు. కార్తీకమాసం చివరి రోజు అని రేపు విడుదల చేస్తున్నాం. రిలీజ్‌ రోజు అమావాస్య అని కూడా అన్నారు. చెన్నైలో మేం ఏం స్టార్ట్‌ చేసినా అమావాస్య రోజునే స్టార్ట్‌ చేస్తాం. ఆ కంపెనీస్‌లో ముఖ్యవాటాదారు నేనే. బాగానే ఉంది. అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. 2019లో మా సంస్థ నుంచి ఇంకా పెద్ద బడ్జెట్‌ సినిమాలు ఉంటాయి. త్వరలో వివరాలు చెబుతాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement