రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.