రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.