బీజేపీ-టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.