
హనుమకొండ జిల్లా: కావాలనే తన క్యారెక్టర్ దెబ్బతీయడానికి ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కలిసి అభూత కల్పనలు స్పష్టిస్తున్నారని విమర్శించారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను అవినీతికి, కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆ ఇద్దరికీ చీము నెత్తురు ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
దేవునూర్ గుట్టల వ్యవహారంపై హన్మకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై విరుచుకుపడ్డారు. ‘ నేను, నా కుటుంబ ఆక్రమిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ
ఆ భూములను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే కబ్జా అనడం సిగ్గుచేటని కడియం ఆరోపించారు
ఆధారాలు ఉంటే ప్రజలు ముందు పెట్టాలని తప్పు ప్రచారం చేసే పత్రికలకు, చానెల్స్ కు, వ్యక్తులకు ఆధారాలు ఉంటే బయట పెట్టలని డిమాండ్ చేసారు. నిజమని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి జీనామా చేస్తా. లేదంటే న్యాయపరంగా వెళ్లాడనికి వెనకడను అని హేచ్చరించారు. 30 ఏళ్ల రాజకీయాలలో ఒక గంట కబ్జా చెయ్యలేదని, ఆధారాలు నిరూపిస్తే పల్లా, తాటికొండ రాజయ్యల ఇంట్లో గులాంగీరీగా పనిచేస్తా అని కడియం అన్నారు. ఆధారాలు నిరూపించకపోతే నా ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య గులాంగిరి చెయ్యాలని డిమాండ్ చేశారు