
ఏమిటీ వైపరీత్యం...? తరచూ ఏమిటిలా భక్తుల మృత్యుఘోష...? చంద్రబాబు ప్రభుత్వ దారుణ వైఫల్యం.. భక్తుల పాలిట మృత్యు ఘంటికలు మోగిస్తోంది.. నాటి గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన మొదలు నిన్నటి తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన.. నేటి సింహాచల అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిపోవడం వరకు చంద్రబాబు జమానాలో ఎన్నో ఉదంతాలు.. పుణ్యక్షేత్రాలలో రెగ్యులర్‌గా జరిగే కార్యక్రమాల గురించి, వాటికి వచ్చే భక్త జన సందోహం గురించి. ప్రభుత్వం చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణం అని జనం చర్చించుకుంటున్నారు.. అతి ప్రచార కండూతి.. అంతులేని నిర్లక్ష్యం.. చంద్రబాబు మార్కు పాలనకు ప్రతీకలుగా మారాయి..