Science Subject
-
దారి చూపే చుక్కాని
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్‌లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ల్యాబ్‌లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్‌కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్‌కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్‌ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్‌లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.– డా. సెరెజో శివ్‌కర్, శాస్త్రవేత్త -
విద్యార్థులను గందరగోళానికి గురికానివ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం సైన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఇదే కీలకం. గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్ష జరిగేది. ఈసారి మొత్తం ఆరు పేపర్లకే పరిమితం చేశారు. ఇందులో భాగంగానే సైన్స్ రెండు (ఫిజికల్, బయలాజికల్ సైన్స్) పేపర్లను కలిపి ఒకేరోజు నిర్వహిస్తున్నారు. అయితే రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల గ్యాప్ ఇస్తున్నారు. కాగా సోమవారం పరీక్షపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్తగా చేపడుతున్న ఈ పరీక్ష విషయంలో విద్యార్థులు ఏమాత్రం గందరగోళానికి గురవ్వకుండా చూడాలని పేర్కొంటూ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రెండు పేపర్లకు కలిపి 80 మార్కులుంటాయి. స్కూల్ అంతర్గత పరీక్షల ఆధారంగా 20 మార్కులు తీసుకుంటారు. మొత్తంగా 100 మార్కుల్లో విద్యార్థులు 35 సాధించాల్సి ఉంటుంది. పరీక్ష ఇలా... ♦ ముందుగా పార్ట్–1 (ఫిజికల్ సైన్స్) పరీక్ష ఉంటుంది. ఇది ఉదయం 9.30 గంటలకు మొదలై 11 గంటల వరకూ (1.30 గంటల వ్యవధి) ఉంటుంది. ఇందులోనే బిట్ పేపర్ (పార్ట్–బీ)ను 10.45 గంటలకు ఇస్తారు. 15 నిమిషాల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చి బయలాజికల్ పేపర్ ఇస్తారు. ♦ బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన పరీక్ష 11.20 నుంచి 12.50 వరకూ (1.30 గంటలు) జరుగుతుంది. 12.35 గంటలకు బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన బిట్ పేపర్ (పార్ట్–బీ) ఇస్తారు. దీన్ని కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులకు ప్రత్యేక సూచనలు రెండు పేపర్లను విడివిడిగా ప్యాక్ చేసి, మూల్యాంకన కేంద్రాలకు పంపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది. రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల బ్రేక్ సమయంలో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది. -
కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి
అక్క చార్టర్ అకౌంటెంట్.. నాన్న ఆడిటర్.. ఇలా కుటుంబ నేపథ్యం ఇచ్చిన స్ఫూర్తితో.. లక్ష్యం దిశగా కదిలింది.. లెక్కలు, పద్దులు అంటూ అంకెల సముద్రాన్ని తలపించే చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సును సులువుగా పూర్తి చేయడమేకాకుండా జాతీయ స్థాయిలో 42వ ర్యాంక్ సాధించింది.. అరవపల్లి హరిప్రియ.. ఈ దిశగా చేసిన కృషి, సీఏ ఔత్సాహికులకు విలువైన సూచనలతో హరిప్రియ సక్సెస్ స్పీక్.. స్వస్థలం గుంటూరు. నాన్న అరవపల్లి వెంకటేశ్వర్లు ట్యాక్స్ కన్సల్టెంట్లో ఆడిటర్. అమ్మ శశికళ గృహిణి. అక్క పుష్ప శిరీష చార్టర్‌డ అకౌంటెంట్. ప్రస్తుతం కరీంనగర్లో సొంతంగా సంస్థను నిర్వహిస్తుంది. కుటుంబమే స్ఫూర్తి: మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి. కాకపోతే పదో తరగతిలో ఉన్నప్పుడే అందరిలా మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నా. అదే సమయంలో నాన్న, అక్కల వృత్తి, విద్యా నేపథ్యం స్ఫూర్తిగా నిలిచింది. దాంతో చార్టర్‌డ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును చదవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా సీఏ కోర్సుకు ఉన్న డిమాండ్ ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూపులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది. దాంతో ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యా. ఫైనల్ పరీక్షలకు: ఆర్టికల్‌షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం కోచిం గ్ కూడా తీసుకున్నా. సీఏ ఫైనల్లో మొత్తం 8 సబ్జెక్టులు ఉంటాయి. వీటిని గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్, డెరైక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ సబ్జెక్ట్‌లను చదవాలి. వీటిలో కాస్టింగ్ సబ్జెక్ట్ కొద్దిగా కష్టమనిపించింది. దాంతో ఆ సబ్జెక్‌కు మిగతా వాటి కంటే ఎక్కువ సమయం కేటాయించా. ఈ విషయంలో అక్క ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఉపకరించాయి. గ్రూప్-1, గ్రూప్-2 సబ్జెక్టులను ఒకే సారి ప్రణాళిక ప్రకారం చదివా. 63.25శాతం మార్కులు వచ్చాయి. కారణాలనేకం: సీఏ పూర్తి చేయడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదు. ఎందుకంటే చాలా మంది కీలక సమయాల్లో కొన్ని మౌలిక తప్పులను చేస్తుంటారు. ఉదాహరణకు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు చాలా మంది సీఏ ఫైనల్ పరీక్షలపై అంతగా శ్రద్ధ చూపకపోడం, తొలుత ఓ గ్రూపు, ఆ తర్వాత మరో గ్రూపు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం, కేవలం మెటీరియల్ మీద మాత్రమే ఆధారపడి ప్రిపరేషన్ సాగించడం వంటివి. వీటికి తోడు నిరంతరం సాధన చేయరు. కాబట్టి ఈ అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సీఏలో ఉత్తీర్ణత సాధించడం సులువే. నిరంతర మార్పులపై: చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సులో ఉండే సబ్జెక్టులంతా ఆర్థిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థలో ఎప్పటికప్పుడు పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వస్తుంటాయి. దాంతో నూతన ఆర్థిక పోకడలు చోటు చేసుకుంటుంటాయి. అంటే మనం చదివే పుస్తకాల్లో అప్పటికున్న సబ్జెక్టుకు అదనంగా సమాచారాన్ని జోడించాలి. వీటిని పట్టించుకోకుండా ఎంత చదివినా వృథానే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను నోట్స్‌గా రాసుకోవడం, వాటిని సిలబస్ దృష్టి కోణంలో విశ్లేషించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతీ రోజూ చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే సీఏలో ఉత్తీర్ణత సాధించవచ్చు. లక్ష్యం: మంచి అవకాశాలు వస్తే ఉద్యోగంలో చేరతాను. లేకపోతే సివిల్స్ దిశగా దృష్టి సారిస్త. అకడెమిక్ ప్రొఫైల్ 10వ తరగతి (2008): 550/600 ఇంటర్ (ఎంఈసీ-2010): 968/1000 సీఏసీపీటీ: 6వ ర్యాంక్ (జాతీయ స్థాయి) ఐపీసీసీ: 24వ ర్యాంక్ (జాతీయ స్థాయి) సీఏ ఫైనల్: 42వ ర్యాంక్ (జాతీయ స్థాయి)