pidakalu
-
గోమయం.. దివ్యమైన హోమం
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. నగరి : పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చిత్తూరు జిల్లా నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శా్రస్తోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాతి్మకతను సంతరించుకుంటుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు.ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ -
అంగరంగ వైభవంగా పిడకల సమరం
కర్నూలు జిల్లా, సాక్షి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు రెండువర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ పిడకల సమరంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ పిడకల సమరంలో గాయాలవుతున్నా భక్తులు పిడకల్ని విసిరారు. -
లక్ష పిడకలతో 'భోగి'
వీధివీధినా వెలిగే భోగి మంటల్లో ఎన్ని నులివెచ్చని జ్ఞాపకాలు దాగుంటాయో కదా. కర్రల వేట నుంచి బోగి రాత్రి జాగారం వరకు చేసిన పనులు, పోగు చేసిన అనుభూతులు గుండె గదిలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. కానీ నేటి తరం అలాంటి జ్ఞాపకాలు మూటగట్టుకోవడంలో విఫలమవుతోంది. కృత్రిమ రీతిలో పండగలు నిర్వహిస్తూ రెండు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి మాత్రమే పరిమితమవుతోంది. కలిసికట్టుగా పండగ చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది. మురపాక వాసులు మళ్లీ ఆ నాటి సంప్రదాయానికి జీవం పోస్తున్నారు. లక్ష పిడకలు తయారు చేసి బోగి చేయడానికి పూనుకుంటున్నారు. సలక్షణమైన ఈ ఆలోచనకు స్థానికులూ సై అంటున్నారు. సాక్షి, లావేరు(శ్రీకాకుళం): సంకురాతిరి వచ్చేస్తోంది. కానీ సందడి మాత్రం కొద్దిగానే కనిపిస్తోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంసృతి, సంప్రదాయాలు, పండగలు, ఆచారాలను చాలా మంది మరిచిపోతున్నారు. నానాటికీ అంతరించిపోతున్న ఆచారాలను బతికించాలనే తలంపుతో మురపాక గ్రామంలో వినూత్నంగా లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మురపాక గ్రామంలోని సీతారామాలయ, ఉమానరేంద్రస్వామి ఆలయ కమిటీలు, వివేకానంద యూత్ సొసైటీ, అంబేడ్కర్ యూత్ సొసై టీ, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికుల నుంచి కూ డా మంచి స్పందన కనిపిస్తోంది. గ్రామంలో ఎవరైతే ఎక్కువ బోడి పిడకలను తయారు చేస్తారో వారికి బోగి పండగ రోజు ప్రత్యేక బహుమతులు ఇస్తామని గ్రామంలో ప్రకటనలు జారీ చేయడం, ర్యాలీలు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా చేశారు. దీంతో గ్రామంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, రైతులు, యువకులు చాలా మంది గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొని బహుమతుల కోసం బోగి పిడకలు తయారు చేస్తున్నారు. చిన్నారులు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి రోజూ గ్రామంలో ఆవుపేడను సేకరించి వాటితో పిడకలు తయారు చేయడం చేస్తున్నారు. భోగి పండగ రోజు ఆవుపేడతో తయారుచేసిన పిడకలను కాల్చడం వలన పాజిటివ్ వైబ్రేషన్లు వస్తాయని అంటున్నారు. మంచి స్పందన వస్తోంది కనుమరుగైపోతున్న మన విశిష్టతల గురించి నేటి తరానికి తెలియజేయడం కోసం మురపాకలో లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమం చేపట్టాం. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ బోడి పిడకలు తయారు చేస్తున్నారు. – ప్రగడ శ్రీనివాసరావు, సీతారామాలయం కమిటీ సభ్యుడు, మురపాక గ్రామం మంచి పని చేస్తున్నారు సమైక్యత, సదాచారం, సంతోషంతో పాటు మంచి పవిత్ర భావాలను పరిరక్షించి సంస్కృతిని కాపాడడమే మన పండగల పరమార్థం. కానీ నేటి తరానికి ఆ విలువలు తెలీడం లేదు. ఇలాంటి తరుణంలో ఈ కార్యక్రమం చేయడం మంచి పరిణామం. – తేనేల మంగయ్యనాయుడు, రిటైర్డు హెచ్ఎం, మురపాక గ్రామం సంప్రదాయాలను బతికంచడం కోసమే.. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతీ, సంప్రదాయాలను మర్చిపోతున్నాం. వాటికి మళ్లీ జీవం పోయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఎక్కువ పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు కూడా ఇస్తాం. – బాలి శ్రీనివాసనాయుడు, వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షుడు, మురపాక గ్రామం -
400 అడుగుల భోగి పిడకల దండ
సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగకు భోగి పిడకల దండలు వేయడానికి చిన్నారులు పోటీపడుతుంటారు. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా చెప్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ పరిధిలో రంగాపురంలో విశ్రాంత ఉపా«ధ్యాయుడు భూపతిరాజు విశ్వనాథరాజు కోడలు శ్రీరామసత్య 400 అడుగుల భోగి పిడకల దండ తయారు చేశారు. విశ్వనాథరాజు ఇంట్లోని గోమయం (ఆవు పేడ)తో ఈ దండను తయారు చేశారు. భోగి మంటలు వేయడంలో కొన్ని సైన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయని విశ్వనాథరాజు తెలిపారు. దేశీయ గోమయం పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మ క్రిములు నశించి పాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుందని, ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి మంచిందన్నారు. రంగాపురంలో తొలిసారిగా చేసిన దండను చూడటానికి పలు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాన్ని ఈ తరం పిల్లలకు తెలియజేయాలని ఈ దండను చేశామన్నారు. 14 తేదీన భోగి పండగ రోజున పూజలు చేసి ఈ దండను భోగి మంటలో వేస్తామని సత్య తెలిపారు. -
గోపూజ సర్వదేవతా పూజ
బోట్‌క్లబ్ (కాకినాడ) : గోవులను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని హిందూ ధర్మరక్షసమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా ఆనందభారతి మైదానంలో జరుగుతున్న లక్ష గో పిడకల యజ్ఞం శుక్రవారం ముగిసింది. గవర య్య మాట్లాడుతూ పూర్వీకులు గో ఆధారిత వ్యవసా యం చేయడం వల్ల వారికి ఎలాంటి రోగాలూ రాలేదన్నారు. నేడు క్రిమి సంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారన్నారు. గోవుల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చె ప్పారు. ఇస్కా¯ŒS ప్రతినిధి జీవదాసు, సమితి జిల్లా అధ్యక్షుడు పుట్టా రాజారావు గోవు విశిష్టతను వివరించారు. ఉదయం గాంగేయుల బుచ్చిరాజు శర్మ శిష్య బృందం సౌర పంచాయతన దీక్షా యజ్ఞం నిర్వహించారు. -
50 పిడకలు @ రూ.15
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పండగంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు. గోవు పేడతో పిడకలు చేసి దండగా మార్చి భోగి మంటలలో వేస్తారు. ఈ సంప్రదాయం పట్టణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తోంది. అయితే పల్లెవాసులకు పిడకలు తయారుచేసే తీరిక, ఆసక్తి తగ్గుతోంది. దీనినే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 50 పిడకలను దండగా కట్టి రూ.15 విక్రయిస్తున్నారు. మొగల్తూరులోని పలు దుకాణాల వద్ద పిడకల దండలు కనిపిస్తున్నాయి. పిడకల తయారీపై గ్రామీణులలోనూ ఆసక్తి తగ్గిందనడానికి ఇది నిదర్శనం.