new postings
-
ప్రాధాన్యాలకు కొత్త జట్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఆదివారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే పలు కీలక శాఖలు, విభాగాలకు కొత్త బాస్‌లను నియమించింది. పెట్టుబడుల ఆవిష్కరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కొత్త జట్టును సిద్ధం చేసింది. ఈ మేరకు 18 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు నాన్ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఐటీ, పరిశ్రమలు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్, స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/సీఈఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పరిశ్రమలు, ఐటీ, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ స్థానచలనం పొందారు. ఇక గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ‘ఎక్స్’లో పోస్టులను షేర్ చేసిన యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యకార్యదర్శిగా మళ్లీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా జయేశ్ రంజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా, శాఖాధిపతిని మార్చడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం సీఎస్ రేసులో ముందంజలో ఉన్న శశాంక్ గోయల్‌ను ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు నుంచి మరో ప్రాధాన్యత లేని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది. రెండుగా పురపాలక శాఖ విభజన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ను ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ శాఖను రెండుగా విడగొట్టి ఇద్దరు కార్యదర్శులను నియమించింది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ (హెచ్ఎండీ వెలుపలి ప్రాంతం) కార్యదర్శిగా బదిలీ చేసింది. హెచ్ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని పురపాలికలు మాత్రమే ఈ పోస్టు పరిధిలోకి రానున్నాయి. మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ (హెచ్ఎండీఏ పరిధి) పేరుతో కొత్త శాఖను సృష్టించి దాని కార్యదర్శిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తిని బదిలీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆథారిటీ(ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమించింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా అదనపు బాధ్యతల నుంచి సందీప్‌కుమార్ సుల్తానియాను తప్పించింది. జెన్కో సీఎండీగా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీ ఎస్.హరీశ్‌ను నియమించింది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. -
11 మంది డీఎస్పీలకు పోస్టింగులు
అమరావతి: ఏపీలో కొన్ని నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తోన్న డీఎస్పీలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. వెయిటింగ్లో ఉన్న11 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఒక డీఎస్పీని బదిలీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన అధికారులను తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పోస్టింగ్ ఇచ్చిన డీఎస్పీలు ఎమ్. మహబూబ్ బాషా, వైవీ రమణ కుమార్, ఎమ్ . కృష్ణ మూర్తి నాయుడు, ఎ. దేవదానం, కె. తిరుమల రావు, జి. సోమేశ్వర రావు, జి. ఆంజనేయులు, సీహెచ్. పాపారావు, బి. మల్లేశ్వరరావు, టి. మధుసూదన్ చారి, పి. సోమశేఖర్ లకు కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. శ్రీకాకుళంలో డీఎస్పీగా పనిచేస్తున్న టీ. మోహన్ రావును విజయవాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆర్టీసీలో బదిలీలాట!
* వారం క్రితం జరిగిన బదిలీల్లో మార్పులు * 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో బదిలీలాట సాగుతోంది. ఎక్కడి వారు అక్కడ పద్ధతిలో పాలనపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు కావటంతోనే తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 270 మంది అధికారులను బదిలీ చేశారు. ఒకే పోస్టులో మూడేళ్లుపైబడ్డవారిని మార్చారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు, వరస పదోన్నతులు పొందుతూ ఒకేచోట పాతుకుపోయినవారిని కూడా మార్చారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలబాట పట్టాలంటే అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఎం సూచించటంతో... ఈ మార్పులు అవసరమని ఆర్టీసీ జేఎండీ రమణరావు భావించారు. దీంతో సమూలంగా ప్రక్షాళన లక్ష్యంగా ఆయన భారీ ఎత్తున బదిలీలు చేశారు. దీంతో చాలామంది అభ్యర్థనలు పెట్టుకున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు... ఇలా పరిశీలనార్హమైన అభ్యర్థనలు కొన్ని రావటంతో వాటి ఆధారంగా మార్పుచేర్పులు చేయాలని జేఎండీ నిర్ణయించారు. వాటిని పరిశీలించి సిఫారసు చేసేందుకు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో ఆయన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. కొందరు అవినీతి అధికారులు కూడా కోరుకున్న సీటు కోసం పైరవీలు ప్రారంభించారు. ఇందుకోసం అర్థబలం, రాజకీయ నేతల బలాన్ని కూడా ఉపయోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేశారు. వెరసి... బదిలీ అయిన వారిలో 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్స్ జారీ చేశారు. ఇందులో అర్హమైన మార్పులు కొన్ని ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం ఒత్తిళ్లతో చేసినవి ఉన్నాయని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ఇక పదోన్నతి కల్పించి జూనియర్లకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారంటూ సీనియర్లు చేసిన ఫిర్యాదుల మేరకు కొన్ని మార్పులు చేశా రు. ఈ నేపథ్యంలో మార్పులకు సంబంధించి 70 మంది అధికారులకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా గురువారం కొత్త చోట రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
వెయిటింగ్లో ఉన్న 9మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో వెయిటింగ్లో ఉన్న 9 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లు లభించాయి. ఈ మేరకు నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులను తక్షణమే విధుల్లో చేరవలసిందిగా అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన వారి వివరాలు... 1. ముని రామయ్య సీఐడీ డీఎస్పీ 2. టి. సాయి మనోహర్ సీసీఎస్ ఏసీపీ 3. పి. ఆశోక్ ట్రాఫిక్ ఏసీపీ 4. ఎస్ హెచ్ అహ్మద్ టీఎస్ఎస్పీ 13 పటాలం అసిస్టెంట్ కమాండెంట్ 5. ఎస్ కే ఇస్మాయిల్ డీటీసీ డీఎస్పీ 6. కె. ద్రోణాచార్యులు డీటీసీ డీఎస్పీ 7. కె. మోహన్ డీఎస్పీ డీఎస్బీ 8. డి.కోటేశ్వర్ రావు డీఎస్పీ ఎఆర్ 9. ఎస్. లక్ష్మినారాయణ ఏసీపీ హెడ్ క్వార్టర్స్