Mylavaram Assembly Constituency
-
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ప్రలోభాల పన్నాగం
జి.కొండూరు: టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే నాయకులను తన వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్న వసంత, ఓటర్లను సైతం ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో డబ్బు పంపిణీ చేసేందుకు 2వేల మంది తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులను రంగంలోకి దింపిన వసంత, ఇప్పుడు మద్యాన్ని సైతం పంపిణీ చేసేందుకు తన అనుచరులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి మద్యం బాటిళ్లను రవాణా చేస్తూ వసంత వెంకటకృష్ణప్రసాద్ అనుచరులు ఐదుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు పట్టుబడ్డారు.దొరికారు ఇలా..మైలవరం నియోజకవర్గంలోకి భారీగా తెలంగాణ మద్యం సరఫరా అవుతోందని ఉన్నతాధికారుల సమాచారం మేరకు మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ నేతృత్వంలో ఎస్ఈబీ సీఐ నాగవవల్లి, మైలవరం డీటీపీ ఎస్ఐ ఎల్. రమాదేవి, ఎస్ఐ సుబ్బిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మైలవరం మండల పరిధి అనంతవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులు మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనంలో తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి తరలిస్తున్న 150కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రెడ్డిగుంటలో భారీ డంపు స్వాధీనం..ఈ ఐదుగురు నిందితులను విచారించిన అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటలోని చేబ్రోలు కృపారాజుకి చెందిన మామిడితోటలో భారీగా డంపు చేసిన 250కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మామిడితోట యజమాని చేబ్రోలు కృపారాజు సైతం వసంతకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు చేబ్రోలు రాజుకి బంధువు కావడం గమనార్హం.అన్న క్యాంటీన్ నడుపుతున్న నిందితుడు..ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలలో ఒకడైన చేబ్రోలు రాజు రెండేళ్లుగా మైలవరంలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి ప్రధాన అనుచరుడిగా ఉన్న రాజు, వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆయన పంచన చేరి మద్యం సరఫరా బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం బాటిళ్లను డంపు చేసిన మామిడితోట సైతం రాజు బంధువు చేబ్రోలు కృపారాజుకు చెందినది కావడం, ఆయన కూడా వసంతకు ప్రధాన అనుచరుడు కావడం, పట్టబడిన మిగిలిన నలుగురు నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు కావడంతో వసంత వెంకటకృష్ణ ప్రసాదే ఈ మద్యంను డంపు చేయిస్తున్నారు అనడానికి బలం చేకూరింది.మద్యం విలువ రూ.30లక్షలు..పట్టుబడిన మద్యం విలువ రూ.30లక్షలు ఉంటుందని మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ విలేకరుల సమావేశంలో తెలిపారు. మద్యం రవాణా చేస్తున్న రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులను ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనం, 150కేస్లు మద్యం బాటిళ్లు, డంపు చేసిన మరో 250కేస్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలలో ఈ మద్యం బాటిళ్లను పంపిణీ చేసేందుకే తెలంగాణ నుంచి నియోజకవర్గంలోకి తీసుకొస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. -
అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు. ఇన్‌చార్జ్‌లదే పెత్తనం వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్‌చార్జ్‌లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్‌ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్‌లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్‌గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.సీటిచ్చినా పార్టీ మారారంట..! ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్‌కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.