Four death
-
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తొర్రూరు మండల చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వేప, తుమ్మ కర్రలను కొనుగోలు చేసిన ఓవ్యాపారి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే కర్రను తరలించాలనుకున్నారు. కొనుగోలు చేసిన కర్రను లోడ్ చేసి తరలిస్తుండగా స్థానికంగా ఉన్న ఎక్కలదాయమ్మ చెరుపు కట్టపై అదుపుతప్పి లారీ బోల్తా పడింది. కట్టెల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. క్యాబిన్లో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు కోసం ఆసుపత్రికి తరలించినటట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందినవారిని హర్యా, గోవింద్, మధు, దూతియాగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రమాదం జరగగా తెల్లవారుజామున మూడు గంటలకు మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మరో ఉగ్ర దాడి
ముగ్గురిని మట్టుపెట్టిన సైన్యం ♦ కుప్వారా జిల్లాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు ♦ ఆయుధాలు, మందుగుండు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ ♦ ఎల్వోసీ వెంట ఉగ్ర చొరబాట్లు విఫలం.. నలుగురి హతం ♦ సర్జికల్ దాడులపై ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు: పరీకర్ శ్రీనగర్/ఆగ్రా: కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం సైనిక శిబిరంపై కాల్పులకు తెగబడగా... సైన్యం ఉగ్రదాడిని సమర్థంగా తిప్పికొట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. కుప్వారా జిల్లా లాన్‌గేట్ వద్ద ఆర్మీ శిబిరంపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, మ్యాప్‌లు వంటి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్మీ కమాండింగ్ అధికారి కల్నల్ రాజీవ్ శారంగ్ కథనం ప్రకారం... సైనిక శిబిరం కంచె పరిధిలో అనుమానాస్పద కదలికల్ని గమనించిన జవాన్లు అప్రమత్తమై ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. ‘శిబిరానికి కాపలాగా ఉన్న సెంట్రీ పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు మొదలయ్యాయి. జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు.వెంటనే క్విక్ రియాక్షన్ బృందం అప్రమత్తతతో ఉగ్రవాదులు తప్పించుకోలేకపోయారు. వెంటనే ప్రకాశవంతమైన పరికరాల సాయంతో ఉగ్రవాదుల్ని కనిపెట్టి హతమార్చారు’ అని చెప్పారు. హతులైన ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే రైఫిల్స్, మూడు అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్స్, పెద్ద ఎత్తున మ్యాగజీన్స్, బుల్లెట్లు, నాలుగు వాకీ టాకీ రేడియో సెట్లు, మూడు జీపీఎస్ పరికరాలు, మూడు మొబైల్ ఫోన్లు, డ్రై ఫ్రూట్స్, మందులు, మ్యాప్‌లు, మాట్రిక్స్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. మందులపై పాకిస్తాన్లో తయారైనట్లు ముద్రలు ఉండడంతో ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన వారిగా నిర్ధారించామని కల్నల్ శారంగ్ వెల్లడించారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చా? అని ప్రశ్నించగా.. ‘ఉండవచ్చు. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రమే హతమార్చాం. కంచె దాటేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని మాత్రమే గుర్తించాం. సమీప ప్రాంతాల్లో వెదుకులాట, అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాప్‌ల్ని, మ్యాట్రిక్స్ షీట్లను విశ్లేషిస్తున్నాం. వాటి ద్వారా మరిన్ని వివరాలు తెలిస్తే వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఒక్కోసారి ఉగ్రవాదులు ఒకటి కంటే ఎక్కువ రేడియో సెట్లను వాడతారని, అందుకే నాలుగు సెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మందుల్ని బట్టి కొద్ది రోజులుగా క్యాంప్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. నూరు శాతం సర్జికల్ దాడులే సైనిక చర్యకు సంబంధించి వీడియో ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం చెప్పారు. ఆగ్రాలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంట జరిగిన దాడి నూటికి నూరు శాతం సర్జికల్ దాడేనన్నారు. దేశం పట్ల విశ్వాసం చూపని వారి విషయంలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. మన బలగాల ధైర్యం పట్ల ఇంతవరకూ ఎవరికీ అనుమానం లేదని... మొదటిసారి కొందరు వ్యక్తులు సందేహపడుతున్నారని పరీకర్ విమర్శించారు. ఒక జాతీయ న్యూస్ చానల్ కథనం ప్రకారం సర్జికల్ దాడి జరిగినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారి అంగీకరించారన్నారు. సరిహద్దుల్లో పోరాటానికి అవసరమైతే చాలామంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాక్ హోదాపై సమీక్షిస్తాం: భారత్ పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశంగా ఇచ్చిన హోదాపై పునఃసమీక్షిస్తామని భారత్ ప్రకటించింది. భద్రతా, వాణిజ్య ఆసక్తులు ఆధారంగా ఈ సమీక్ష చేస్తామని, ఉగ్రవాదం ఎగుమతి చేసే వస్తువు కాదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. 3 చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టిన ఆర్మీ జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఆర్మీ మూడు చొరబాట్ల యత్నాల్ని విఫలం చేసి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున నౌగామ్ సెక్టార్లో చొరబాటును అడ్డుకుని నలుగురిని హతమార్చామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపాయి. నౌగామ్, రాంపూర్ సెక్టార్లలో బుధవారం రాత్రి రెండు చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.