
సాక్షి, మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తిరువీధుల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హతమార్చి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 12న అనారోగ్యంతో లక్ష్మీనారాయణ భార్య శిరీష చనిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన తన కుమారులు తేజేశ్వర్, అమరేశ్వర్‌లకు పాలల్లో విషం కలిపిచ్చి ఆ తర్వాత తానూ విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విగతజీవులుగా ఇంట్లో కనబడటం గమనించిన పాలు పోసే వ్యక్తి, ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం బయటపడింది.