ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ ప్రాంతాల్లో పలు సమస్యలు ప్రతిబంధకంగా మారారుు.
ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ ప్రాంతాల్లో పలు సమస్యలు ప్రతిబంధకంగా మారారుు. శ్రీకాకుళం జిల్లాలో 3.6 మి.యూ, విజయనగరంలో 5.3 మి.యూ విద్యుత్ డిమాండ్ అంత త్వరగా పరిష్కారం సాధ్యమయ్యే సూచనలు కన్పించడం లేదు. విద్యుత్ లైన్లన్నీ దెబ్బతిన్నాయి. టవర్లు పూర్తిగా పాడయ్యాయి. పెందుర్తి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే మార్గంలో మూడు ప్రధాన టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వరకూ 132 కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. 12 వేల స్తంభాలు నేలకొరిగారుు.
ఇవన్నీ మారిస్తే తప్ప, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా సాధ్యం కాదు. జాతీయ గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం ఉన్నా లైన్లు లేక వీలు కుదరడం లేదు. లైన్లు, టవర్లు పునరుద్ధరించడానికి వారం రోజులు పడుతుందనేది అధికారిక సమాచారం. అయితే మరో 48 గంటల్లో జిల్లా కేంద్రాలకు విద్యుత్ అందిస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ క్షేత్రస్థాయి సమాచార క్రోడీకరణ జరగలేదు. స్తంభాలు, ఇతర సామగ్రి ఉన్నప్పటికీ వాటిని చేర్చడం కష్టంగా ఉంది. ప్రధాన రహదారుల్లో కూలిపోయిన చెట్లే ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు సామగ్రి సరఫరా కష్టంగా ఉంది.