
సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నేత షర్మిల తమ ఎన్నికల ప్రచారానికి శనివారం విరామం ప్రకటించారు. తెలుగువారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది రోజున ప్రతి ఇంటా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకునే సమయంలో ప్రచార సభలతో వారిని ఇబ్బంది పెట్టరాదనే ఉద్దేశంతో వారీ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని తన స్వగృహంలో జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు.