
వచ్చే నెల 19కి వాయిదా వేసినట్లు..
అమరావతి: ఉపాధ్యాయ నియామకాలకై నిర్వహించే ఏపీ డీఎస్సీ రెండు వారాల పాటు వాయిదా పడింది. వచ్చే నెల 19కి వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 19 నుంచి 22 వరకు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు ఎస్‌జీటీ పరీక్షలు, డిసెంబర్ 23,24 తేదీల్లో పీజీటీ పరీక్షలు, డిసెంబర్ 26,27 తేదీల్లో టీజీటీ పరీక్షలు, డిసెంబర్ 28న లాంగ్వేజ్, పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు.