ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చిన తీసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్యాకేజీ కావాలని గోల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని హోదా అని నాటకాలు ఆడితే ప్రజలు నమ్మరని చెప్పారు.