ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు 17 మంది మృతి చెందగా 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిరాత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటవా- మెయిన్‌పూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.