ర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అధికారులతో చర్చించిన సీఎం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సమ్మె ప్రభావం ఏ విధంగా ఉందని సీఎం ఆరా తీశారు. అయితే ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం మరికాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.