ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆశయం ప్రత్యేక హోదానేనని వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నాయకులు బైఠాయించి హోదాపై నినాదించారు.